మాదిరెడ్డి సులోచన కథలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మాదిరెడ్డి సులోచన కథలు
కృతికర్త: మాదిరెడ్డి సులోచన
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): కథలు
ప్రచురణ: తెలంగాణ సాహిత్య అకాడమీ
విడుదల: 2018, అక్టోబరు


మాదిరెడ్డి సులోచన కథలు తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన పుస్తకం. మాదిరెడ్డి సులోచన రాసిన కథల్లోంచి 32 కథలను ఎంపికచేసి ఈ పుస్తకం ప్రచురించారు.[1]

కథల నేపథ్యం[మార్చు]

1970ల కాలంనాటి తెలుగు ప్రాంతాలలోని నాగరిక, సామాజిక, సాంస్కృతిక, పరిస్థితులను తన కథల్లో చిత్రించింది. సులోచన రచనల్లో స్త్రీల అభ్యుదయం, స్వేచ్ఛ, హక్కులు మొదలైన అంశాలు ఉంటాయి. కథల్లోని పాత్రలు తెలంగాణ ప్రాంత నేపథ్యంలో ఉంటాయి.[2]

పుస్తక నేపథ్యం[మార్చు]

తెలంగాణ సాహిత్య చరిత్రలో మాదిరెడ్డి సులోచనది ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో దశాబ్దాలుగా సులోచన కథలు పాఠకులకు అందుబాటులో లేవు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఆనాటి సమాజపు విశేషాలు పరిశీలన చేసే అవకాశం ఉంటుంది. సాహితీ చరిత్రకారుడు సంగిశెట్టి శ్రీనివాస్ సేకరించిన 32 కథలతో తెలంగాణ సాహిత్య అకాడమీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది.[3]

విషయసూచిక[మార్చు]

 1. భార్యా కోపవతీ
 2. బడి
 3. తనదాకవస్తే!
 4. కృష్ణకన్నయ్యా!
 5. రక్ష
 6. రేవతి
 7. పురుష లక్షణము
 8. అంతరాత్మ
 9. సాలమ్మ
 10. తల్లి తప్పు
 11. అడ్డం తిరిగిన కథ
 12. ప్రగతి పథమా? పతన మార్గమా?
 13. కలిసిరాని కాలం
 14. నేటి కథ
 15. స్త్రీ బుద్ధిః ప్రళయాంతకః
 16. ఒక్కమాట!
 17. రంగప్రవేశం
 18. పుట్టినరోజు
 19. పడి లేచే కడలి తరంగం
 20. అభిమానులున్నారు జాగ్రత్త!
 21. ఖరీదయిన స్నేహము
 22. జరుగుతున్న చరిత్ర
 23. అనుబంధాలకు అర్థం ఏమిటి?
 24. ఆశకు హద్దులు
 25. అనుభవం
 26. బదులు ఇచ్చి బిరుదు కొన్నాము
 27. హరివిల్లు
 28. దేవుడు తెల్లబోయాడు
 29. డబ్బు! డబ్బు! డబ్బు!
 30. చీమలు పెట్టిన పుట్టలు
 31. బ్రతకటానికో దారి
 32. భలే భార్యలు

మూలాలు[మార్చు]

 1. "Maadireddy Sulochana Kathalu-Telangana Sahitya Academy". www.telugubooks.in (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-22. Retrieved 2021-12-22.
 2. మాదిరెడ్డి సులోచన కథలు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణ, హైదరాబాదు, 2018, పుట IV.
 3. "మాదిరెడ్డి లోకమలహరి రచనలు". Sakshi. 2018-12-24. Archived from the original on 2021-12-22. Retrieved 2021-12-22.