మాధబి ముఖర్జీ
Appearance
మాధబి ముఖర్జీ | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | మాధబి చక్రవర్తి, మాధబి ముఖోపాధ్యాయ, మాధురి |
గుర్తించదగిన సేవలు | చారులత |
మాధబి ముఖర్జీ (మాధబి చక్రవర్తి) బెంగాలీ సినిమా నటి. 1970లో వచ్చిన దిబ్రత్రిర్ కబ్యా సినిమాలో నటించి, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది.[1] బెంగాలీ సినిమారంగంలో విమర్శకుల ప్రశంసలు పొందిన కొన్ని చిత్రాలలో నటించింది, బెంగాలీ సినిమా ప్రముఖ నటీమణులలో ఒకరిగా నిలిచింది.[2]
జననం, విద్య
[మార్చు]మాధబి ముఖర్జీ, 1942 ఫిబ్రవరి 10న పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో జన్మించింది.
నాటకరంగం
[మార్చు]చిన్నతనంలోనే నాటకరంగంలో అడుగుపెట్టి, అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నది. సిసిర్ భాదురి, అహీంద్ర చౌదరి, నిర్మలేందు లాహిరి, ఛబీ బిస్వాస్ వంటి ప్రముఖులతో కలిసి నటించింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]ముఖర్జీ బెంగాలీ సినీనటుడు నిర్మల్ కుమార్‌ను వివాహం చేసుకున్నది.[3] వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మాధబి ముఖర్జీ, భర్త నిర్మల్ కుమార్ జంట విడిపోయింది. 1995లో అమీ మాధబి పేరుతో తన ఆత్మకథ కూడా రాసింది.[3][4]
సినిమాలు
[మార్చు]- ఆబేష్ (2021)
- బోరున్‌బాబర్ బాంధు (2019)
- కుషుమితార్ గప్పో (2018)
- బకితా బైక్తిగాటో (2013)
- హింగ్ టింగ్ చాట్ (2010)
- మేయర్ అదార్ (2002)
- ఉత్సబ్ (2000) భాగబతి
- రంగిన్ బసంత (1995)
- ఆర్తిక్రమ్ (1994)
- పృథిబీర్ శేష్ స్టేషన్ (1993)
- దీపక్ తల్లిగా మోన్ మనే నా (1993)
- డాన్ ప్రతిదాన్ (1992)
- అంతరేర్ భలోబాషా (1991)
- అగ్ని తృష్ణ (1989)
- చందనీర్ (1989)
- కరి దియే కిన్లామ్ (1989)
- అఘతోన్ అజో ఘటే (1989)
- అంజలి (1988)
- ఏక్తి జిబాన్ (1988)
- హిరర్ షికల్ (1988)
- ప్రతీకార్ (1987)
- ఉత్తర లిపి (1986)
- అనురాగేర్ చోవా (1986)
- భలోబాస భలోబాస (1985)
- పుతుల్ఘర్ (1985)
- జోగ్ బయోగ్ (1984)
- సమాప్తి (1983)
- ఛోటో మా (1983)
- చోఖ్ (1983)
- మతిర్ స్వర్గ (1982)
- ప్రఫుల్ల (1982)
- సుబర్ణలత (1981)
- మాణిక్‌చంద్ (1981) బారోబౌడీ
- సాహెబ్ (1981)
- బంచారామర్ బగన్ (1980) చకారీ భార్య
- గణదేవత (1979) పద్మగా
- యుగో మనబ్ కబీర్ (1976)
- ఫూల్ సజ్యా (1975)
- నటున్ సూర్య (1975)
- అగ్నిశ్వర్ (1975)
- బిందుబాసినిగా బిందుర్ చెలీ (1973)
- బాన్ పలాశిర్ పడబలి (1973)
- స్ట్రిర్ పాత్ర (1972)
- చిన్న పాత్ర (1972)
- బిరాజ్ బౌ (1972)
- జిబాన్ రహస్య (1972)
- కలకత్తా 71 (1971)
- ఛద్మబేషి (1971) సులేఖ
- సమంతరాల్ (1970)
- దురంత చరై (1969)
- అద్వితీయ (1968)
- గర్ నసింపూర్ (1968)
- ఛోట్టో జిగ్నాసా (1968)
- ఖేయా (1967)
- అజన శపత్ (1967)
- శంఖబేల (1966)
- స్వప్న నియే (1966)
- జోరాడిఘిర్ చౌదరి పరిబార్ (1966)
- కపురుష్ (1965) కరుణా గుప్తా
- ఘూమ్ భంగార్ గాన్ (1965)
- సుబర్ణరేఖ (1965) సీతగా
- థానా తేకే అస్చి (1965)
- గోధూలి బెలాయే (1964)
- బిన్సతి జనని (1964)
- చారులత (1964) చారులత
- మహానగర్ (1963) ఆరతి మజుందార్
- ఆజ్ కల్ పర్షు (1961)
- బైషే శ్రవణ (1960)
- టాన్సిల్ (1956)
- కంకంటల లైట్ రైల్వే (1950)
టెలివిజన్
[మార్చు]- ఇష్టి కుటం
- హియర్ మాజే
- కుసుమ్ డోలా
- గచ్‌కౌటో
- నోక్షి కంఠర్ మాథ్
అవార్డులు, నామినేషన్లు
[మార్చు]- 2017: డ్లబ్యూ.బి.ఎఫ్.జె.ఏ. లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- 2014: ఫిల్మ్‌ఫేర్ ఈస్ట్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు
- 1970: దిబ్రాత్రిర్ కబ్యా సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1965: చారులత సినిమా ఉత్తమ నటిగా బి.ఎఫ్.జె.ఏ. అవార్డు
- 1966: ధోల్గోబిందర్ కర్చా సినిమా ఉత్తమ నటిగా బి.ఎఫ్.జె.ఏ. అవార్డు
- 1967: జోరాదిఘీర్ చౌదరి పరిబార్ సినిమా ఉత్తమ నటి అవార్డు బి.ఎఫ్.జె.ఏ. అవార్డు
- 1971: దిబరాతిర్ కబ్యా సినిమా ఉత్తమ నటి అవార్డు బి.ఎఫ్.జె.ఏ. అవార్డు
- కళాకర్ అవార్డులు[5]
మూలాలు
[మార్చు]- ↑ "17th National Film Festival". Directorate of Film Festivals, GOI. Retrieved 2022-04-02.
- ↑ "'If you say something, you must speak out the whole truth. Or else, don't say anything at all'". www.telegraphindia.com.
- ↑ 3.0 3.1 "The Telegraph - Calcutta (Kolkata) | Look | 'If you say something, you must speak out the whole truth. Or else, don't say anything at all'". www.telegraphindia.com. Retrieved 2022-04-02.
- ↑ "Had ideas, not funds: Madhabi Mukherjee - Times of India". The Times of India. Retrieved 2022-04-02.
- ↑ "Kalakar award winners" (PDF). Kalakar website. Archived from the original (PDF) on 25 April 2012. Retrieved 2022-04-02.
అనులేఖనాలు
[మార్చు]- ముఖర్జీ, మాధబి. మై లైఫ్, మై లవ్: యాన్ ఆటోబయోగ్రఫీ. పాలో ఆల్టో: ది స్టాన్‌ఫోర్డ్ థియేటర్ ఫౌండేషన్, 1999.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మాధబి ముఖర్జీ పేజీ