మాధవపెద్ది రామస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వీరు బ్రాహ్మణకోడూరు గ్రామములో 1927,మే-31న శేషగిరిరావు, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించినారు. వీరు ప్రసిద్ధ లలిత సంగీత మదుర గాయకులు, రంగస్థల నటులు మరియు క్యారంస్ క్రీడాకారులు. 1952 నుండి 1975 వరకు ఆకాశవాణి లలిత సంగీత విభాగంలో వందలాది పాటలకు స్వరకల్పన చేయడంతోపాటు ప్రముఖ కవులు వ్రాసిన పాటలను స్వయంగా పాడినారు. వీరు ఎన్నో కచేరీలలో పాటలు పాడటమేగాక, క్యారంస్ క్రీడలో తన ప్రతిభతో 1952లో నిర్వహించిన జాతీయస్థాయి పోటీలలో బహుమతి సాధించినారు. గుంటూరున్ హిందూ కళాశాలలో చాలా రోజులు పనిచేసినారు. వీరు 2001,సెప్టెంబరు-8న కాలధర్మం చెందినారు. [ఆంధ్రజ్యోతి దినపత్రిక; 2016,నవంబరు-28; 2వపేజీ]