మాధురి ఆర్. షా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాధురి రతిలాల్ షా (મધુરી શાહ) (1919 డిసెంబరు 13 – 1989 జూన్ 29) భారతీయ విద్యావేత్త, రచయిత్రి, మాజి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఛైర్‌పర్సన్.[1] 1985లో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయ వ్యవస్థ పై యు.జి.సి. సమీక్ష కమిటీ కి ఆమె అధ్యక్షురాలు. ముంబై నగరపాలక సంస్థ విద్యా అధికారిగా కూడా పనిచేశారు. 1936లో ఆమె రతిలాల్ షా ను వివాహం చేసుకుంది.

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె 1919 డిసెంబరు 13న గుజరాత్ లోని రాన్పూర్ లో జన్మించింది. తండ్రి చోటలాల్ కోఠారి, తల్లి సమతాబెన్ కోఠారి. ఆమె నియత విద్యకు ముందు ఇంట్లో పార్సీ ఉపాధ్యాయుడి నుండి అనియత విద్యను పొందారు. 1934లో ఆమె ముంబైలోని అలెగ్జాండ్రా ఇంగ్లీష్ స్కూలు నుంచి మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. 1938లో సెయింట్ జేవియర్స్ కళాశాల (ముంబయి విశ్వవిద్యాలయం) నుంచి గణితం, ఆంగ్లం తో బీ.ఏ. పూర్తి చేశింది.[2]

విద్యావేత్తగ

[మార్చు]

1939 నుండి 1943 వరకు ది న్యూ ఎరా స్కూల్లో (ముంబై), తరువాత ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (అహ్మదాబాద్) మాధ్యమిక పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేశింది. 1942లో ముంబైలోని సెకండరీ టీచర్స్ ట్రైనింగ్ కాలేజీలో బి.టి. (ఆంగ్లం, గణితం (స్పెషల్ మెతడస్)) పట్టా పొందింది. 1944 నుండి 1950 వరకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ముంబయి విశ్వవిద్యాలయం)లో రిజిస్ట్రార్ గా, సెకండరీ టీచర్స్ ట్రైనింగ్ కాలేజ్ (ముంబై)లో మాస్టర్ ఆఫ్ మెథడ్, ప్రొఫెసర్గా పనిచేశింది. ఆమె అధ్యాపకురాలిగా పనిచెస్తు 1949లో ముంబయి విశ్వవిద్యాలయంలో ఎం.ఎడ్. పరీక్షలో ప్రథమ స్థానంలో నిలిచింది. 1950 నుండి 1954 వరకు ఇండియన్ జర్నల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ సంపాదకుడిగా పనిచేశారు. బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్ షిప్ తో 1954లో లండన్ విశ్వవిద్యాలయంలో పీహెచ్.డి. పొందారు.[3]

1955లో ముంబై పురపాలక సంస్థ విద్యా విభాగంలో రీసెర్చ్ ఆఫీసర్గా చేరింది. 1961లో విద్యా అధికారిగా పదోన్నతి పొందిన తరువాత, ఆమె బలహీన విద్యార్థులకు సెలవు శిక్షణను ప్రారంభించి స్కాలర్షిప్లను అందించింది. ఆమె విజ్ఞాన శాస్త్రం, గణిత శాస్త్రంపై దృష్టి సారించి కొత్త పాఠ్య ప్రణాళిక నిర్మాణాన్ని కూడా అభివృద్ధి చేసింది. 1960లో ఆమె తన పరిశోధన కోసం స్మిత్-మండ్ట్ గ్రాంట్, ఫుల్బ్రైట్ ఫెలోషిప్ అందుకుంది. అంతేకాకుండా, ఆమె భాషా అభివృద్ధి ప్రాజెక్టును అభివృద్ధి చేసింది, దీని కోసం ఆమె ఫోర్డ్ ఫౌండేషన్ నుండి ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్ పొందింది.[3]

ఎస్. ఎన్. డి. టి. విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ ఉద్యోగంలో చేరడం ద్వారా ఆమె ఉన్నత విద్యలో పనిచేయడం ప్రారంభించింది. కొత్త కళాశాలలు, వాణిజ్య, సాంకేతిక విద్యాశాఖలు, విశ్వవిద్యాలయాలను ప్రారంభించారు. అనధికారిక విద్య అనే భావనతో ఆమె ఓపెన్ యూనివర్సిటీని ప్రారంభించారు. వికలాంగ విద్యార్థులకు బోధించడానికి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ కోసం భారతదేశంలో మొట్టమొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సును ఆయన ప్రారంభించారు. ఫోర్డ్ ఫౌండేషన్ నుండి వంద యాభై వేల డాలర్ల గ్రాంట్ తో, ఆమె విశ్వవిద్యాలయంలో తన పరిశోధనా కేంద్రాన్ని స్థాపించింది.[3]

1981లో ఆమె యుజిసి చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. విశ్వవిద్యాలయాలకు మంజూరు చేసిన నిధుల కోసం ఆమె జవాబుదారీతనం యంత్రాంగాన్ని సృష్టించారు. ఆమె విశ్వవిద్యాలయాలలో కొత్త కోర్సులను ప్రోత్సహించింది, నిధులు సమకూర్చింది. 1984 మార్చిలో "కంటిృవైడ్ క్లస్స్ రుామ్" విద్యా కార్యక్రమాన్ని ప్రారంభించారు.[4] ఆమె ఇండియన్ అసోసియేషన్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ (Indian Association for Women’s Studies) మొదటి అధ్యక్షురాలు.[1]

రచయిత్రిగ

[మార్చు]

విద్యపై అనేక పుస్తకాలు రాశారు. "రేడియంట్ ఇంగ్లీష్ వర్క్ బుక్" (Radiant English Workbook) పుస్తక సిరీస్ ఆమె గుర్తించదగిన రచనలలో ఒకటి. ఆమె జీవితాన్ని "హార్మోనీ: గ్లింప్స్ ఇన్ ది లైఫ్ ఆఫ్ మాధురీ ఆర్ షా" (Harmony: glimpses in the life of Madhuri R. Shah) లో క్లుప్థంగ వివరించబడినది, ఇందులో ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి.

గౌరవాలు, పురస్కరలు

[మార్చు]

1977 లో వైస్ ఛాన్సలర్ ఉన్న సమయంలో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆంధ్ర (1981), కాశ్మీర్ (1981), బనారస్ (1982), పట్నా (1984) విశ్వవిద్యాలయాల నుండి ఆమెకు డి.లిట్. (D.Litt.) గౌరవ బిరుదు లభించింది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Mazumdar, Vina (2018-02-22). "Women's studies in India and the role of the University Grants Commission". Centre for Women's Development Studies (in ఇంగ్లీష్).[permanent dead link]
  2. "People on the Hills – Late Dr Madhuriben Shah – The Voice of Malabar Hills" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-02-03.
  3. 3.0 3.1 3.2 "શાહ, મધુરીબહેન – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (in గుజరాతి). Retrieved 2024-02-03.
  4. Chitnis, E.V. (1989), "COUNTRYWIDE CLASSROOM: THE USE OF SPACE FOR EDUCATION", Space and Humanity (in ఇంగ్లీష్), Elsevier, pp. 203–208, doi:10.1016/b978-0-08-037877-0.50028-4, ISBN 978-0-08-037877-0, retrieved 2024-02-03