మానసి గిరిశ్చంద్ర జోషి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానసి గిరిశ్చంద్ర జోషి
Mansi Joshi in 2020.jpg
వ్యక్తిగత సమాచారం
జననం (1989-06-11) 1989 జూన్ 11 (వయసు 33)[1]
ఎత్తు171 cm
బరువు66 kg[2]
దేశం భారతదేశం

మానసి గిరిశ్చంద్ర జోషి 2019లో స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలుచుకున్న భారతీయ పారా-బ్యాడ్మింటన్ అథ్లెట్. తన తోటి భారతీయ క్రీడాకారిణి పరుల్ పర్మార్‌ను ఓడించి బంగారు పతకం సాధించింది.

వృత్తి రీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆమె దురదృష్టవశాత్తు 2011లో జరిగిన కారు ప్రమాదంలో ఒక కాలును కోల్పోయింది. ఆ సమయంలో ఆమె కోలుకునేందుకు బ్యాడ్మింటన్ ఒక సాధనంగా మారింది. చివరికి అది మరో ఆశయం సాధించేందుకు నాంది అయింది.   

వ్యక్తిగత జీవితం, నేపథ్యం[మార్చు]

ఆమె తన ఆరేళ్ళ వయసులో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) లో పని చేసి పదవీ విరమణ పొందిన శాస్త్రవేత్త అయిన తన తండ్రితో బ్యాడ్మింటన్ ఆడటం ప్రారంభించింది. చిన్నతనం నుంచే అన్ని రకాల ఆట పాటల్లో ఆమె చురుగ్గా ఉండేది. తనకు ఇష్టమైన బ్యాడ్మింటన్‌లో ఆమెకు మొదటి కోచ్ ఆమె తండ్రే. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపిస్తున్నప్పటికీ ఇంట్లో వాళ్లు మాత్రం తమ బిడ్డపై పూర్తిగా చదువుపైనే దృష్టి పెట్టాలని భావించేవారు. ఉన్నత చదువులు చదవాలన్నది ఆమె తండ్రి కోరిక.  జోషి కంప్యూటర్ సైన్స్‌లో పట్టా సాధించి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయింది.[8] 2010లో ముంబై విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న కె.జె. సౌమ్య ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో పట్టా పొందిన ఆమె వెంటనే ఉద్యోగంలో చేరింది.

ఆమె 2011 డిసెంబర్‌లో తన మోటారు బైకు పై  ఆఫీసుకు వెళుతుండగా రాంగ్ రూట్లో వస్తున్న లారీ ఆమెను  ఢీకొట్టి కాలుపై నుంచి వెళ్లింది.[9] అంబులెన్స్ రావడానికి గంటలు పట్టింది, స్టెచర్‌పై నైనా తనను ఆసుపత్రికి తీసుకెళ్లాలని పోలీసులను బలవంతం చేయాల్సి వచ్చింది.  ప్రమాదం జరిగిన తొమ్మిది గంటల తరువాత మాత్రమే ఆమెకు సరైన వైద్యం లభించింది. ఆమె కాలును తొలగించకుండా ఉండేందుకు వైద్యులు శతవిథాల ప్రయత్నించడంతో సమారు 45 రోజుల పాటు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చింది. ప్రతి ఐదు నుంచి పది రోజులకు శస్త్ర చికిత్స చేయించుకోక తప్పేది కాదు. కానీ ఆ యుద్ధంలో ఆమె ఓడిపోక తప్పలేదు. చివరకు కాలును తీసేయాల్సి వచ్చింది. ఆమె కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. మొదట కృత్రిమ కాలు సాయంతో నడవటం ప్రారంభించింది. కోలుకోవడంలో భాగంగా ఆమె తిరిగి బ్యాడ్మింటన్ ప్రారంభించింది. అలా పారా బ్యాడ్మింటన్ విషయంలో కఠోర శిక్షణ తీసుకొంది. చివరకు భారత జట్టులో సభ్యురాలయింది.

వృత్తిపరమైన విజయాలు[మార్చు]

2014లో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్‌లో అడుగుపెట్టినప్పటి నుంచీ ఎన్నో జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లలో విజయం సాధించింది. ఆమె కెరియర్లో 2015 సంవత్సరం అత్యంత కీలకమని చెప్పవచ్చు. పారా బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ షిప్‌లోని మిక్సడ్ డబుల్స్ విభాగంలో ఆమె రజత పతకం సాధించింది.  ఆపై 2017 సింగిల్స్‌ విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకుంది. [10] 2016లో జరిగిన ఆసియా పారా బ్యాడ్మింటన్  షిప్‌లో మహిళల సింగిల్స్, డబుల్స్ విభాగాలలో కాంస్యం సాధించింది. 2017లో జరిగిన పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో కూడా ఆమె కాంస్య పతకం పొందింది. [11] 2018లో థాయ్‌లాండ్‌లో జరిగిన ఏసియన్ పారా గేమ్స్‌లో కాంస్యం సాధించింది. అదే ఏడాది ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ ఆధ్వర్యంలో నడుస్తున్న అకాడమీలో శిక్షణలో చేరింది. అతని ప్రోత్సాహంతో తన జీవితం కొత్త మలుపు తిరిగిందని ఆమె అంటుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్‌లోని బసెల్‌లో జరిగిన పారా బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్ షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. [12] 2020 నవంబర్‌ 23న బీబీసీ విడుదల చేసిన ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబితాలో మానసి ఒకరుగా నిలిచింది. అంతకు ముందు ఇదే ఏడాదిలో స్పోర్ట్స్ వుమెన్ ఆఫ్ ది ఇయర్‌కు నామినేట్ అయిన ఐదుగురులో ఆమె కూడా ఒకరు. [13] అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా 2020 అక్టోబర్ 11న మానసి గౌరవార్థం ఆమెను పోలి ఉండే బార్బీ బొమ్మను విడుదల చేశారు.

మూలాలు:[మార్చు]

 1. "BWF Para-Badminton Classification Master List" (PDF). BWF. Archived from the original (PDF) on 2018-08-11.
 2. "Manasi Joshi-Indian Para-athlete" (PDF). Maharashtra Badminton Association.
 3. "Indian Para badminton team wins 11 medals at World Championships - Firstpost". www.firstpost.com. Retrieved 2018-08-11.
 4. "India win 10 medals in Para-Badminton World Championships". www.sportskeeda.com. 26 November 2017. Retrieved 2018-08-11.
 5. "Parul Parmar Makes India Proud, Wins Two Gold Medals At Para World Championships". www.indiatimes.com. 27 November 2017. Retrieved 2018-08-11.
 6. "BWF - Thailand Para-Badminton International 2018 - Winners". bwf.tournamentsoftware.com. Retrieved 2018-08-11.
 7. "BWF - Asian Para Games 2018 - Winners". bwf.tournamentsoftware.com. Retrieved 2018-08-11.
 8. "Manasi Joshi: The accident that created a world champion". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-02-04. Retrieved 2021-02-20.
 9. "Manasi Joshi: The accident that created a world champion". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2020-02-04. Retrieved 2021-02-20.
 10. "Who is Manasi Joshi, who won gold at BWF Para Badminton World Championships?". The Week (in ఇంగ్లీష్). Retrieved 2021-02-20.
 11. "Manasi Girishchandra J". Wikipedia.{{cite web}}: CS1 maint: url-status (link)
 12. सिंह, दीपक; षर्मा, गुंजन; लोधी, प्रज्ञा सिंह; कश्यप, सुभाष; जोशी, भानू प्रकाश (2019-01-31). "स्वाध्याय का किशोरियों की संवेगात्मक बुद्धिमत्ता पर प्रभाव का अध्ययन।". Dev Sanskriti Interdisciplinary International Journal. 13: 69–77. doi:10.36018/dsiij.v13i.114. ISSN 2582-4589.
 13. "BBC Women". BBC Women.{{cite web}}: CS1 maint: url-status (link)