మానస వారణాసి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మానస వారణాసి
అందాల పోటీల విజేత
జననము (1997-03-21) 1997 మార్చి 21 (వయసు 27)
హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
పూర్వవిద్యార్థివాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్
వృత్తిమోడల్
జుత్తు రంగునలుపు
కళ్ళ రంగుబ్రౌన్
బిరుదు (లు)
 • ఫెమినా మిస్ తెలంగాణ 2020
 • ఫెమినా మిస్ ఇండియా 2020
ప్రధానమైన
పోటీ (లు)
 • ఫెమినా మిస్ తెలంగాణ 2019
  (టాప్ 3)
 • ఫెమినా మిస్ తెలంగాణ 2019
  (విజేత)
 • ఫెమినా మిస్ ఇండియా 2020
  (విజేత)
 • మిస్ వరల్డ్ 2021
  (10వ స్థానం)

మానస వారణాసి, తెలంగాణకు చెందిన మోడల్, అందాల పోటీ విజేత. ఫెమినా మిస్ ఇండియా 2020 అందాల కిరీటాన్ని అందుకుంది.[1][2] ప్యూర్టో రికోలోని శాన్ జువాన్, కోకాకోలా మ్యూజిక్ హాల్‌లో 2021, డిసెంబర్ 20న జరగబోయే మిస్ వరల్డ్ 2021 పోటీలో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించి, 10వ స్థానంలో నిలిచింది.

జననం, విద్యాభ్యాసం[మార్చు]

మానస వారణాసి 1997, మార్చి 27న హైదరాబాదులో జన్మించింది. తండ్రి ఉద్యోగం కారణంగా మలేషియాకు వెళ్ళిన మానస 2011-12 బ్యాచ్‌లో జిఐఐఎస్ మలేషియా క్యాంపస్ నుండి గ్రేడ్ 10 పూర్తి చేసింది. ఆ తర్వాత హైదరాబాదుకి వచ్చి ఎఫ్ఐఐటి జెఈఈలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో కంప్యూటర్ సైన్స్ చదువును పూర్తిచేసి, ఫాక్ట్ సెట్ లో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ఛేంజ్ (ఫిక్స్) విశ్లేషకురాలిగా పనిచేసింది.[3]

పోటీ[మార్చు]

2019లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ పోటీలో పాల్గొన్న మానస టాప్ 3 ఫైనలిస్టుల్లో ఒకరిగా నిలిచింది. 2020లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ టైటిల్ కోసం ఆడిషన్ చేసి, అందులో విజేతగా నిలిచింది. 202లో జరిగిన ఫెమినా మిస్ ఇండియా 2020 పోటీలో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించింది. 2021, ఫిబ్రవరి 10న ముంబైలోని హయత్ రీజెన్సీలో అవుట్ గోయింగ్ టైటిల్ హోల్డర్ సుమన్ రావు చేత ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020గా కిరీటం అందుకుంది. పోటీకి సంబంధించిన ముందస్తు పోటీ కార్యక్రమంలో ఆమె 'మిస్ రాంప్‌వాక్' అవార్డును గెలుచుకుంది.[4][5]

సినిమాలు[మార్చు]

 1. అశోక్‌ గల్లా2[6]

మూలాలు[మార్చు]

 1. "Meet Manasa Varanasi, the 24 Year Old Miss India 2020 Winner From Telangana". makers.yahoo.com.
 2. "Miss India 2020 Manasa Varanasi talks about her win". deccanchronicle.com.
 3. "Who is Manasa Varanasi, winner of Miss India 2020?". indianexpress.com.
 4. "Telangana's Manasa Varanasi crowned VLCC Femina Miss India World 2020". thehindu.com.
 5. Namasthe Telangana (20 March 2022). "ప్ర‌పంచ సుంద‌రి కాలేక‌పోయినా.. మ‌న‌సు మాత్రం బంగారం". Archived from the original on 20 March 2022. Retrieved 20 March 2022.
 6. Namasthe Telangana (31 August 2023). "మిస్ ఇండియాతో జోడీ కడుతున్న అశోక్‌ గల్లా". Archived from the original on 31 August 2023. Retrieved 31 August 2023.

బయటి లింకులు[మార్చు]

Awards and achievements
అంతకు ముందువారు
{{{before}}}
ఫెమినా మిస్ ఇండియా
ఫెమినా మిస్ ఇండియా 2020
తరువాత
అంతకు ముందువారు
{{{before}}}
ఫెమినా మిస్ తెలంగాణ
ఫెమినా మిస్ ఇండియా 2020
తరువాత