Jump to content

మామిళ్ళపల్లి (సంతమాగులూరు)

అక్షాంశ రేఖాంశాలు: 16°1′2.964″N 79°54′55.944″E / 16.01749000°N 79.91554000°E / 16.01749000; 79.91554000
వికీపీడియా నుండి
మామిళ్ళపల్లి (సంతమాగులూరు)
గ్రామం
పటం
మామిళ్ళపల్లి (సంతమాగులూరు) is located in ఆంధ్రప్రదేశ్
మామిళ్ళపల్లి (సంతమాగులూరు)
మామిళ్ళపల్లి (సంతమాగులూరు)
అక్షాంశ రేఖాంశాలు: 16°1′2.964″N 79°54′55.944″E / 16.01749000°N 79.91554000°E / 16.01749000; 79.91554000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంసంతమాగులూరు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )


మామిళ్ళపల్లి, బాపట్ల జిల్లా, సంతమాగులూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఇదే పేరుగల ఇతర గ్రామాల కొరకు, మామిళ్ళపల్లి (అయోమయ నివృత్తి పేజీ) చూడండి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఈ గ్రామం వద్ద అద్దంకి బ్రాంచ్ కాలువపై 1.45 కోట్ల రూపాయల వ్యయంతో ఒక వంతెన నిర్మించుచున్నారు.

సామాజిక భవనం

[మార్చు]

నెల్లూరులో ఉన్న పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అను కంపెనీ వారు, కార్పొరేట్ సామాజిక బాధ్యతగా అందజేసిన 36 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి, 2015,డిసెంబరు-14వ తేదీనాడు శంకుస్థాపన నిర్వహించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కేంద్రాన్ని, 2016,అక్టోబరు-12న ప్రారంభించారు.

వ్యవసాయం, సాగునీటి సౌకర్యం

[మార్చు]

దశబంధం పంట చెరువు

[మార్చు]

196 ఎకరాలలో విస్తరించియున్న ఈ చెరువుకు ప్రక్కన ఉన్న కుందుర్రు గ్రామానికి గూడా కొంత వాటా ఉంది. ఈ చెరువుద్వారా ప్రతి సంవత్సరం 400 ఎకరాలకుపైగా భూములకు సాగునీరు అందుచున్నది. ఈ చెరువు గ్రామానికి ప్రధాన ఆదాయవనరు. ఈ చెరువులో ప్రతి సంవత్సరం, చేపలు పట్టుకునేటందుకు బహిరంగ వేలం నిర్వహించి, వచ్చిన ఆదాయాన్ని మూడు సమ భాగాలుగా చేసి, ఒక భాగాన్ని చెరువు అభివృద్ధికీ, ఒక భాగాన్ని, మామిళ్ళపల్లి గ్రామాభివృద్ధికీ, మూడవ బాగాన్ని కుందుర్రు గ్రామాభివృద్ధికీ పంచుచున్నారు. ఇలా గ్రామాభివృద్ధికి వచ్చిన ఆదాయాన్ని రెండు గ్రామాలలోనూ అభివృద్ధి కమిటీలు ఏర్పాటు చేసి, మెజారిటీ సభ్యుల ఆమోదంతో అవసరమైన పనులకు ఆ నిధులు వెచ్చించుచున్నారు. ఈ క్రమంలో మంచి ఫలితాలు రాబట్టి, మిగతా గ్రామాలవారికి ఆదర్శంగా నిలుచుచున్నారు. [2]

గ్రామ పంచాయతీ

[మార్చు]
  • 2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి చిమటా కంచమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.
  • ఈ గ్రామ పంచాయతీకి 13 లక్షల రూపాయల ఎన్.అర్.ఇ.జి.ఎస్. నిధులతో నూతనంగా నిర్మించుచున్న భవనం నిర్మాణం పూర్తి అయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కూరగాయలు

ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]