మార్స్ ఆర్బిటర్ మిషన్
మిషన్ రకం | మార్స్ ఆర్బిటర్ |
---|---|
ఆపరేటర్ | ఇస్రో |
COSPAR ID | 2013-060A |
SATCAT no. | 39370 |
వెబ్ సైట్ | MOM |
మిషన్ వ్యవధి | 300 days |
అంతరిక్ష నౌక లక్షణాలు | |
తయారీదారుడు | ఇస్రో |
లాంచ్ ద్రవ్యరాశి | 1,350 కి.గ్రా. (2,980 పౌ.)[1] |
డ్రై ద్రవ్యారాశి | 500 కి.గ్రా. (1,100 పౌ.) |
పే లోడ్ ద్రవ్యరాశి | 15 కి.గ్రా. (33 పౌ.) |
శక్తి | సౌర ఘటకాలు |
మిషన్ ప్రారంభం | |
ప్రయోగ తేదీ | 5 November 2013 09:08[2] | UTC
రాకెట్ | PSLV-XL C25[1] |
లాంచ్ సైట్ | Satish Dhawan FLP |
కాంట్రాక్టర్ | ఇస్రో |
కక్ష్య పారామితులు | |
రిఫరెన్స్ వ్యవస్థ | Areocentric |
Periareon altitude | 377 కి.మీ. (234 మై.) |
Apoareon altitude | 80,000 కి.మీ. (50,000 మై.) |
వాలు | 17.864 degrees [3] |
ఎపోచ్ | Planned |
అంగారకుడు orbiter | |
Orbital insertion | 24 సెప్టెంబరు 2014 |
అంగారక గ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ అంగారకయాన్ లేదా మార్స్ ఆర్బిటర్ మిషన్. 2013 నవంబరు 5, మంగళ వారం శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రము నుండి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. మంగళ వారం మధ్యాహ్నం షార్ అంతరిక్ష కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక ద్వారా ‘అంగారక్‌యాన్’ మొదలైంది. ‘మామ్’ రోదసిలోకి దూసుకెళ్లింది. ఇది మూడు వందల రోజుల పాటు.. దాదాపు 40 కోట్ల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించి అంగారక గ్రహాన్ని చేరుకుంది. అంగారక గ్రహం చుట్టూ కొన్ని నెలల పాటు పరిభ్రమిస్తూ జీవాన్వేషణ, ఆ గ్రహం నిర్మాణం, ఖనిజాల మిశ్రమం తదితరాలను శోధిస్తుంది. అంగారక గ్రహంపై విజయవంతంగా ప్రయోగాలు నిర్వహించిన నాలుగో దేశంగా భారత్ అవతరించింది. ప్రయోగించిన మొట్టమొదటిసారే విజయం సాధించిఒన మొట్టమొదటి దేశం భారతే. నందిని హరినాథ్ రాకెట్ శాస్త్రవేత్త డిప్యూటీ డైరెక్టర్ ఆపరేషన్స్ గా వ్యవహరించారు.
నేపథ్యం
[మార్చు]45 మీటర్ల ఎత్తున్న పీఎస్‌ఎల్‌వీ సీ25 ఉపగ్రహ వాహకనౌక, 1,337 కిలోల బరువున్న మార్స్ ఆర్బిటర్ మిషన్‌ను మోసుకుంటూ 2013 నవంబరు 5, మధ్యాహ్నం 2.38 గంటలకు నింగిలోకి దూసుకెళ్ళింది. సుమారు రూ.455 కోట్ల వ్యయంతో ఈ ప్రయోగాన్ని చేపట్టారు. దీన్ని అక్టోబరు 28నే నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ ఇబ్బందికరంగా మారడంతో నవంబరు 5కు వాయిదా వేశారు. అంగారకుడి పైకి వెళ్లాలంటే 30 కోట్ల నుంచి 35 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంది. దాంతో రాకెట్ గమనాన్ని నిర్దేశించే రాడార్ ట్రాకింగ్ వ్యవస్థ కోసం బెంగళూరు ఇస్‌ట్రాక్ సెంటర్‌లో 32 డీప్‌స్పేస్ నెట్‌వర్క్, అండమాన్ దీవుల్లోని మరో నెట్‌వర్క్‌తో పాటు నాసాకు చెందిన మాడ్రిడ్ (స్పెయిన్), కాన్‌బెర్రా (ఆస్ట్రేలియా), గోల్డ్‌స్టోన్ (అమెరికా) ల్లోని మూడు డీప్ స్పేస్ నెట్‌వర్క్‌లతో పాటు మరో నాలుగు నెట్‌వర్క్‌ల సాయం కూడా తీసుకున్నారు. నాలుగో దశలో రాకెట్ గమనాన్ని తెలిపేందుకు దక్షిణ ఫసిపిక్ మహాసముద్రంలో రెండు నౌకలపై తాత్కాలిక రాడార్ ట్రాకింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి అద్దెకు తీసుకున్న నలంద, యుమున నౌకలు ఆస్ట్రేలియా-దక్షిణ అమెరికా మధ్యలో నిర్దేశిత స్థలానికి చేరుకుని సిద్ధంగా ఉంచారు. నాలుగో దశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను 2013 నవంబరు 3 ఆదివారం రాత్రి, రెండు దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను నవంబరు 4 సోమవారం పూర్తి చేశారు. రాకెట్‌లోని అన్ని దశల్లో హీలియం, హైడ్రోజన్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిల్ వ్యవస్థలన్నింటినీ ప్రయోగానికి ఆరు గంటల ముందు జాగృతం చేశారు.
మామ్
[మార్చు]మార్స్ ఆర్బిటర్ మిషన్ (అంగారకయాన్) ను సంక్షిప్తంగా మామ్ అని వ్యవహరిస్తున్నారు ఇది అంగారక గ్రహం అన్వేషణకు ఉపగ్రహం పంపే పక్రియ, 2013 నవంబరు అయిదో తేదీన శ్రీహరికోటలో ఆరంభమైన 'మామ్' (మార్స్ ఆర్బిటర్ మిషన్) ప్రస్థానం మూడంచెల్లో సాగింది. అది భూగురుత్వాకర్షణ పరిధి దాటి ఆవలకు వెళ్ళాక డిసెంబరు మొదటివారంలో 300 రోజుల అంగారక యానం మొదలైంది. భూమినుంచి దాదాపు ఏడుకోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగారకుణ్ని చేరడానికి సుమారు 66 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించిన 'మామ్' 2014 సెప్టెంబరు 24 న గ్రహ కక్ష్యలోకి ప్రవేశించే సంక్లిష్ట దశను సజావుగా అధిగమించింది. మామ్' బరువు 1350 కేజీలు, పరికరాలు 15 కిలోలు. 2014 సెప్టెంబరు 24 ఉదయం 7.17.32 గంటలకు మార్స్ ఆర్బిటర్ మిషన్ ఉపగ్రహం అంగారక కక్ష్యలోకి ప్రవేశించింది. అనంతరం 8.15 గంటలకు భూమికి సమాచారాన్ని చేరవేసింది. అంగారకుడు 22 కోట్ల కి.మీ. దూరంలో ఉన్నందున మామ్ నుంచి సంకేతాలు భూమిని చేరేందుకు 12 నిమిషాలు పట్టింది.
పరికరాలు
[మార్చు]ఈ ఉపగ్రహంలో ఐదు పరికరాలు ఉన్నాయి
- మార్స్ కలర్ కెమెరా (ఎంసీసీ) : దీని బరువు 1.27 కిలోలు. ఇది అంగారక ఉపరితలాన్ని ఫొటోలు తీసి పంపుతుంది. దాని స్వభావ, స్వరూపాలను చూపుతుంది.
- థర్మల్ ఇన్‌ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెకో్ట్రమీటర్ (టీఐఎస్) : దీని బరువు 3.2 కిలోలు. అంగారక గ్రహంపై ఖనిజాలను, మట్టిరకాలను పరిశీలించేందుకు దీన్ని ఉపయోగిస్తారు. అలాగే, ఇది ఉపగ్రహంపై ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు నమోదు చేస్తూ ఉంటుంది.
- మీథేన్ సెన్సర్ ఫర్ మార్స్ (ఎంఎస్‌ఎం) : దీని బరువు 2.94 కిలోలు. ఇది అంగారక గ్రహంపై మీథేన్ వాయువు ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తుంది. మీథేన్ ఉన్న ప్రదేశాన్ని మ్యాప్ చేస్తుంది. గ్రహ వాతావరణ స్థితిగతులను, కుజుడిపై సూర్యకిరణాల వ్యాప్తిని అంచనా వేస్తుంది.
- మార్స్ ఎనోస్ఫియరిక్ న్యూట్రల్ కంపోజిషన్ అనలైౖజర్ (ఎంఈఎన్‌సీఏ) : దీని బరువు 3.56 కిలోలు. అంగారకుడి ఉపరితల వాతావరణాన్ని మూలకాల స్థాయిలో అధ్యయనం చేస్తుంది.
- లైమెన్ ఆల్ఫా ఫొటోమీటర్ (ఎల్‌ఏపీ) : దీని బరువు 1.97 కిలోలు. ఇది అంగారక ఉపగ్రహ ఉపరితలంవాతావరణంలోని హైడ్రోజన్, డ్యుటీరియం వాయువుల నిష్పత్తిని లెక్కిస్తుంది.
ప్రత్యేకతలు
[మార్చు]మామ్ బరువు 1,337 కిలోలు కాగా ఇందులో ఇంధనం బరువు 860 కిలోలు. తయారీకి అయిన ఖర్చు రూ.150 కోట్లు. నియంత్రణ ఖర్చు రూ.90 కోట్లు, పీఎస్‌ఎల్‌వీ తయారీకైన ఖర్చు రూ.110 కోట్లతో కలిపి మొత్తం 450 కోట్లు వ్యయం జరిగింది. 82 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించింది. అంగారక గ్రహానికి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆసియా దేశంగాను, ప్రపంచంలో ఈ విజయం సాధించిన నాలుగవ దేశంగా నిలిపింది. మొదటి ప్రయత్నంలోనే అంగారక కక్ష్యలోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన తొలిదేశంగా భారత్ గుర్తింపు పొందింది.
మంగళయాన్ ప్రయోగం లక్ష్యాలు
[మార్చు]అంగారకుడి ఉపరితలాన్ని, భౌగోళిక స్వరూపాన్ని అధ్యయనం చేయడం, అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడం, భవిష్యత్తులో భారీ ప్రయోగాలు, మానవసహిత అంగారక యాత్రకు వేదికను సిద్ధం చేయడం మంగళయాన్ ప్రయోగ లక్ష్యాలు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "12 must-know facts about India's mission to Mars". Economic Times. 11 October 2013. Retrieved 11 October 2013.
- ↑ "India to launch Mars Orbiter Mission on November 5". NDTV. 22 అక్టోబరు 2013. Retrieved 19 October 2013.
- ↑ "Mars Orbiter Mission (MOM) - Manglayaan (15 October 2013)". Archived from the original on 6 నవంబరు 2013. Retrieved 8 డిసెంబరు 2014.