Jump to content

మాయల ఫకీరు

వికీపీడియా నుండి

మాయల ఫకీరు అనే పేరు తెలుగు సాహిత్యంలో మాంత్రికుడికి సంబంధించింది. బాలనాగమ్మ కథలో మాయలఫకీరు పాత్ర కనిపిస్తుంది. ఇతను తన ప్రాణాన్ని ఒక చిలుకలో దాచుకుంటాడు. బాలనాగమ్మని ఇతను తనచెరలో ఉంచుకుంటాడు. బాలనాగమ్మ కుమారుడు బాలవర్ధిరాజు చిలుకలో ఉన్న మాయలఫకీరు ప్రాణాన్ని హరించి తల్లిని అతని చేరనుంచి విడిపించుకుంటాడు. ఇదోక జానపదకథ.[1] సురభి సంస్థ బాలనాగమ్మ నాటకాన్ని ఇప్పటికీ ప్రదర్శిస్తోంది. ఇదే కథ 1942లో, 1959లో సినిమాగా కూడా వచ్చింది.

బాలనాగమ్మ కథ

[మార్చు]

పానుగంటి వంశీకుడైన కార్యవర్ధిరాజు కమ్మ ప్రభువు. బాలనాగమ్మకు ఆయన బావ (మేనమామ కుమారుడు). ఆమెను పెళ్ళి చేసుకుంటాడు. మాయల ఫకీరు ఆమెను మోహించి పానుగంటి కోటలో ఎవరూ లేని సమయం చూసి జంగందేవర వేషంలో భిక్షకై వచ్చి బాలనాగమ్మను తన మాయమంత్రాల సాయంతో ఒక నల్ల కుక్కపిల్లగా మార్చి తనతో తీసుకెళ్ళి గుహలో బంధిస్తాడు.[2]

సినిమాలు

[మార్చు]

1942లో జెమిని సంస్థ ఆధ్వర్యంలో నిర్మితమైన బాలనాగమ్మలో మాయల ఫకీరు పాత్రను గోవిందరాజు సుబ్బారావు పోషించాడు.[3] 1959లో వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో అదే పేరుతో వచ్చిన సినిమాలో మాయల ఫకీరు పాత్రను ఎస్. వి. రంగారావు పోషించాడు. ఇందులో కార్యవర్ధి రాజుగా ఎన్. టి. రామారావు, బాలనాగమ్మగా అంజలీదేవి నటించారు.[4]

మూలాలు

[మార్చు]
  1. Telugu sāhitya kōśamu: Prācīna sāhityamu. Telugu Akāḍami. 1980.
  2. Ravīndranāth, Muttēvi (2007). Tenāli Rāmakr̥ṣṇa kavi: śāstrīya pariśīlana. Pīkāk Buks.
  3. Narasimham, M. L. (26 November 2011). "Balanagamma (1942)". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 25 February 2018.
  4. "Balanagamma (Vedantam Raghavaiah) 1959". Indiancine.ma. Retrieved 25 February 2018.

మూలాలు

[మార్చు]