Jump to content

మార్జొరీ గాడ్‌ఫ్రే

వికీపీడియా నుండి
మార్జొరీ గాడ్‌ఫ్రే
5వ లోక్‌సభ సభ్యురాలు
In office
1971–1977
వ్యక్తిగత వివరాలు
జననం(1919-03-29)1919 మార్చి 29
హైదరాబాదు, బ్రిటీషు ఇండియా
మరణం2003 అక్టోబరు 27(2003-10-27) (వయసు 84)
హైదరాబాదు
కళాశాలఉస్మానియా విశ్వవిద్యాలయం


మార్జొరీ గాడ్‌ఫ్రే (29 మార్చి 1919 – 27 అక్టోబర్ 2003) 5వ లోక్‌సభలో మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆంగ్లో ఇండియన్ నియమిత ప్రతినిధి.[1]

అంకుర జీవితం

[మార్చు]

మార్జొరీ, 1919, మార్చి 29న హైదరాబాదు రాజ్యంలో జన్మించింది. ఈమె తండ్రి విక్టర్ కాల్లిన్స్.[1] మార్జొరీ బొంబాయిలోని మార్గరెట్ కళాశాలలో,[1] ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య పూర్తిచేసుకుని బి.ఏ పట్టభద్రురాలైంది.[2]

వ్యాసంగం

[మార్చు]

విద్యావేత్తగా, మార్జొరీ 17 సంవత్సరాల పాటు పరీక్షలు మరియు ఉద్యోగ ఎంపికల బాధ్యతలు ఉన్న సూపరింటెండెంటుగా పనిచేసింది.[3] ఈమె హైదరాబాదు కేథలిక్ సంఘాన్ని ఏర్పాటు చేసింది.[4] 1971లో లోక్‌సభకు నియమించబడిన ఇద్దరు ఆంగ్లో ఇండియన్ సభ్యులలో మార్జొరీ ఒకర్తె.[5][6] అంతకు పూర్వం, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు నియమిత సభ్యురాలిగా 1957 నుండి 19621 వరకు నాలుగేళ్లు పనిచేసింది. ఈమె అఖిల భారత ఆంగ్లో ఇండియన్ సంఘపు పాలనా విభాగానికి ఉపాధ్యక్షురాలిగా కూడ పనిచేసింది.[3]

గాడ్‌ఫ్రే కేంద్ర సాంఘీకసంక్షేమ సలహాసంఘంలో కూడా పనిచేసి, అంతర్‌రాష్ట్ర ఆంగ్లో ఇండియన్ విద్యా బోర్డులో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించింది.[2]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1949 జనవరి 10 న మార్జొరీ, ఆలెన్ గాడ్ఫ్రేను వివాహం చేసుకున్నది. వీరికి ఇద్దరు సంతానం. ఒక కుమారుడు, ఒక కుమార్తె.[2][1] ఈమె భర్త, ఆలెన్ గాడ్ఫ్రే, నిజాం ప్రభుత్వం యొక్క నాణేల ముద్రణాశాలలో ఇంజనీరుగా పనిచేశాడు.[6] ఈమె 2003, అక్టోబర్ 27న హృదయ స్థంబనంతో మరణించింది. ఆంధ్రప్రదేశ్ చర్చిల సమాఖ్య మరియు హైదరాబాదు కేథలిక్ సంఘం ఈమెకు నివాలులర్పించాయి.[4]

ఈమె కుమార్తె డెల్లా గాడ్‌ఫ్రే కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిగా నియమించబడింది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 Women of Andhra Pradesh at a Glance. State Level Committee, Andhra Pradesh, India. 1975. p. 35. Retrieved 22 July 2024.
  2. 2.0 2.1 2.2 "Members Bioprofile: Godfrey, Shrimati Marjorie". Lok Sabha. Retrieved 6 November 2017.
  3. 3.0 3.1 "Thirteenth Loksabha: Session 14 Date: 05-12-2003". Lok Sabha. Retrieved 6 November 2017.
  4. 4.0 4.1 4.2 "Marjorie Godfrey dies". The Hindu (in Indian English). 2003-10-28. ISSN 0971-751X. Retrieved 2021-05-24.
  5. Careers Digest. Vol. 8. 1971. p. 622.
  6. 6.0 6.1 "Della Godfrey dies after cardiac arrest". Deccan Chronicle. 24 April 2019. Retrieved 31 October 2019.