మాల (కులం)
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
తెలుగు పర్యాయపద నిఘంటువు మాల అనే కులం మల్ల అనే పదం నుండి వచ్చింది. మల్లయుద్ధం లో మహా యోధులు మల్ల లే నాటి మల్ల నేటి వాడుకలో మాలగా మారింది.రాజ్యపాలన చేసి మహా యోధులు గా వున్న మల్ల యోధులు తరువాతి కాలంలో యుద్ధంలో నష్టపోవడం తో ముస్లిం రాజులు మాలలను అణిచివేసందుకు అనేక ప్రయత్నాలు చేసి సమాజానికీ దూరంగా ఉంచారు లేనిచో మాలలు ఎక్కడ రాజ్యాన్ని పాలిస్తారో అని భయం వారిని వెంటాడింది. అలా నష్టపోయిన మల్ల వారు నైపుణ్యమైన వస్త్రాలు తయారీ దారులుగా, గ్రామ రక్షక భటులు గా, కావలి కారు, నీరాటి గాలు,మాల వారుగా మారి అనంతరం అంతరానివారు గా మారారు. అప్పటికి కులాలు ఏర్పడలేదు వృత్తి రీత్యా చూస్తే వీరు అగ్ర కులస్తులే యుద్ధ విద్యలను బోధించేవారు.పల్లవుల కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మల్లయుద్ధం వీరు సృష్టించినదే , మల్లయుద్ధంలో వీరు అందరికి శిక్షణ కూడా ఇచ్చేవారు. ఆ మల్లయుద్ధం తరువాతి తరాలకు అందించటానికి విశేష కృషి చేశారు. దీన్ని మాలల స్వర్ణయుగ కాలంగా చెప్పవచ్చు , ఈ కాలంలో మల్లయుద్ధంలో వీరిని ఓడించేవారేలేరు , మనసులు మలినం పడిన రోజున ఓర్వలేని వారు చేసిన తప్పుల వలన అనగారిన వర్గాలు ఏర్పడడానికి దారితీసింది , అంతే కాదు అనచివేయబడకుంటే ఎక్కడ రాజ్యాధికారం చేపడతారో అనే భయంతో అట్టడుగుకి తొక్కేసారు. లేకపోయుంటే వీరు రాజులుగా వెలుగొందేవారు. అదే సమయంలో చాలా కులాల వారిని అనచివేసి అనగారిన వర్గాలు ఏర్పడడానికి కారణం అయ్యారు. దీన్ని అలాగే కొనసాగిస్తూ వచ్చారు. అప్పుటి సమాజంలో ఈ నీచపు దురహంకారానికి చాలా వృత్తుల వారు బలయ్యారు. ఆ వృత్తులే కుల వృత్తులుగా మారాయి , ఇదే సమాజంలో అసమానతలు ఏర్పడడానికి దారితీసింది. చరిత్రలో ఒక్క ముస్లిం ప్రాంతంలో నేగాకుండా అన్ని ప్రాంతాలలో కూడా వారిని ఊరిబయట ఉంచి పాలేరులు గాను, తోట మాలిగాను పెట్టుకొని వారి శరీరదారుడ్యాన్ని శారరక శ్రమ కోసం ఈ సమాజం వాడుతూ వచ్చింది .
- "మంచి అన్నది మాల అయితే మాల నేనగుదున్" అన్నారు గురజాడ అప్పారావు.
మాల-మాదిగల అనైక్యత
[మార్చు]కలదమ్మా వ్రణ మంటరానితన మాకర్ణింపుమీ యిండియా
పొలమందుం గల మాలమాదిగలకున్ భూతేశుడే కాదు కృ
ష్ణులు కృష్ణున్నిరసించు దైవములు క్రీస్తుల్ మస్తుగా బుట్టినన్
కలుపన్నేరరు రెండుజాతులను వక్కాణింప సిగ్గయ్యెడిన్ _ గుర్రం జాషువా