Jump to content

మాళవిక ఆనంద్

వికీపీడియా నుండి
మాళవిక ఆనంద్
జననండిసెంబర్ 8, 1999
హైదరాబాదు, భారతదేశము
సంగీత శైలిభారతీయ క్లాసిక్ సంగీతం
వృత్తిగాయకురాలు
వెబ్‌సైటుమాళవిక ఆనంద్ జాలగూడు

మాళవిక ఆనంద్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన కర్ణాటక సంగీత విద్వాంసురాలు.[1]

జననం

[మార్చు]

మాళవిక 1999, డిసెంబర్ 8న వివేకానంద, సుచిత వి.ఆనంద్‌ దంపతులకు హైదరాబాదులోని బర్కత్‌పురలో జన్మించింది.

సంగీత ప్రస్థానం

[మార్చు]

మాళవిక తల్లివైపువారు వయోలిన్ విద్వాంసులవడంతో మాళవికకి చిన్ననాటి నుంచే కర్నాటక సంగీతం పట్ల మక్కువ పెరిగింది. ఆమెకున్న ఆసక్తిని గమనించిన తల్లితండ్రులు మాళవికను ప్రోత్సాహాన్ని అందించారు. చిరుప్రాయంలోనే నాలుగు భాషలలో ఆల్బమ్‌లు రూపొందించిన మాళవిక, అనేక కచేరీలు చేసింది.

కచేరీలు

[మార్చు]

రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో సుమారు 70కి పైగా సంగీత కచేరీలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో చేసింది.

  1. కర్నాటకలో ప్రతిష్టాత్మకమైన మైసూరు దసరా ఉత్సవాల్లో కచేరి
  2. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో కచేరి
  3. తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో కచేరి

విజయాలు

[మార్చు]
  1. 9 నుండి 11 సంవత్సరాల వయసులోనే భక్తిగీతాలతో కూడిన సీడీ, రామదాసు కీర్తనలతో కూడిన సీడీలను రూపొందించింది
  2. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం దేవాలయంలో ఇచ్చిన సంగీత కచేరి సందర్భంగా గవర్నర్‌ నరసింహన్‌ దంపతుల చేతులమీదుగా శాలువా కప్పించుకుని దీవెనలు పొందింది
  3. మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా యునిక్‌ వరల్డ్‌ రికార్డును అందుకుంది

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ మ్యాగజైన్. "కర్నాటక సంగీత సాగరంలో ఎగిసిపడే కెరటం మాళవిక". magazine.telangana.gov.in. Retrieved 4 January 2018.