మిట్టూరోడి కతలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మిట్టూరోడి కతలు
కృతికర్త: నామిని సుబ్రహ్మణ్యం నాయుడు
బొమ్మలు: బాపు
ముఖచిత్ర కళాకారుడు: బాపు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథా సాహిత్యం
ప్రచురణ:
విడుదల:

మిట్టూరోడి కతలు నామిని సుబ్రహ్మణ్యం నాయుడు రాశారు. పూర్తిగా చిత్తూరు మాండలికంలో తన చిన్ననాటి అనుభవాలను నామిని మిట్టూరోడి కథలుగా మలిచారు.

రచన నేపథ్యం[మార్చు]

చిత్తూరు జిల్లాలోని గ్రామీణ పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన రచయిత బాల్యం ఈ కథల్లో చిత్రీకరించారు. చిన్నతనం ఆడిన ఆటలు, తిన్న తిళ్లు, చూసిన మనుష్యుల గురించి చెబుతూనే లోతైన సార్వజనీనమైన అంశాలను ఈ కథలు స్పృశిస్తాయి. రచయిత తన ఊళ్లోని వ్యక్తులను గురించి కథల్లో చిత్రీకరించారు. తన బాల్యం ఈ కథల్లో చూపించారు.

ఇతివృత్తాలు[మార్చు]

ఇతివృత్తాలన్నీ రచయిత తన జీవితంలోని పలు విశేషమైన అంశాలు, ఇరుగు పొరుగు, ఇతర విషయాలతో ఈ కథలు రచించారు. కథల్లో ముఖ్యపాత్రగా రచయితతో పాటు, రచయిత తల్లి పాత్ర కూడా ఉంటుంది. తన చిన్నతనం నుంచీ ఆమె కష్టం, ఇంటిని దిద్దుకునే తీరు, పిల్లలను పెంచడంలో తపన వంటివి సందర్భానుసారం చిత్రించారు.

కథనం[మార్చు]

శైలి,ఉదాహరణలు[మార్చు]

ఈ కథల్లో శైలి పూర్తిగా చిత్తూరు జిల్లాలోని మారు మూర పల్లెలోనిది. ఉదాహరణకు: మద్యానాలకు మకరాజవదామని.... అనే కథలో...... నేను ఆరో తరగతిని తపుసు జేసినా పాసయి వుండేవాడ్ని గాదు. ఆరో తరగతిలో చేరినా ఏ,భీ,శీ,డీలు నేర్చుకున్నాననుకో, సంవత్సరం పరీచ్చలను ఏ రీతిగా రాసుందును. ఏ రీతిగా పాసయ్యుందును? కాసు బ్రమ్మానంద రెడ్డి మా ఇస్కూలు పిలకాయల పాలిట దేముడు మాదిరిగా దిగొచ్చి, ఆరో తరగతికి, ఎనిమిదికి, తొమ్మిదికి ఫయులు అనేది లేకుండా చేసాడు. అటెండెంసు వుంటే చాలు, పరీచ్చలు రాసినా, సరిగ్గా రాయ క ... పిలకాయలందరు మొగలాయిలుగా పాసయి పోవాల్చిందేనని బ్రమ్మానంద రెడ్డి ఒక రూలు పాసు జేసి నడు. ఆ 'బి.పాసు.' దర్మాన నేను ఆరోతరగతిని గట్టెక్కేసినాను....... .... మునెమ్మ ఆరో తరగతిలోనే పెద్దమనిసై పోయిందట. ఆ పిల్లగూడ బ్రమ్మానందారెడ్డి దర్మాన పాసయి పూడ్సింది.

ఆర్య వ్యహారంబున దృష్టంబు గ్రాహ్యంబు. అనే కథలో .....

కయ్యలో పేడ తట్టలేసేసి నాక మాయమ్మ సినక్క కయ్య గెనిమ మింద గొంతు కూర్చొని నన్ను పక్కన బెట్టుకోని 'నేన్నీకు రెండు కథలు చెప్పాల సినబ్బా.. అని మొదలు బెట్టింది. ఒక రైతంట... ఆ రైతుకు ఒకపెళ్ళామంట. ఆ రైతు ఒట్టి ముండమోపి మొకమోడంట. రైతు పెళ్ళాం మాత్రం సివంగి అంట. ఉత్తర కొండను, దక్షిణ కొండను దొర్లించి పిండి జేసే రకమంట రైతు పెళ్ళాంది. రైతు మాత్రం... రెండు కాళ్ళు చాపేసి గురక పెట్టే దానికి ఇరవై నాలుగ్గంటలూ చాలేవి గాదంట. ఒక సారి రైతు చెరువుకింద ఎకరాను మొలగొలుకులు మడి చేసినాడంట. పంట ఇరగ పండిందంట. పంట నిండికి గువ్వలు చేరి పోయ్ నాయంట. పండిన పంటను కోసుకునే దానికి రైతుకు ఒళ్ళు బొలువైందంట. ఈ పొద్దు కోదాం రేపు కోద్దాం అంటానే వాయిదాలు పెడతా వుండాడంట. పంట మీద గువ్వలు మాత్రం పండగ చేసు కుంటా వుండాయంట. ఒక రోజు సందేళనంగా వచ్చిన తల్లి గువ్వలతో పిల్ల గువ్వలు అమ్మలాలా అమ్మలాలా.... మనం వేరే పంట చూసుకోవాల. ఈ రోజు మద్ద్యానం రైతు పట కాడికి వచ్చి రేపే కూలోళ్ళను బెట్టి కొయ్యించేస్తాను.... అని అంటా వుండినాడు. అని చెప్పినాయంట. పిల్ల గువ్వల మాటలకు పెద్ద గువ్వలు కీసు కీసుమన నవ్వి. ఆ రైతు మాటలను నమ్మ బాకండి. వాడి ముండ మొకాన ఎండ కాసిందిలే.... కానీండి. కూలోళ్ళతో మడి కోయిస్తాడంటావా? వాడి బయిసి ఆరిందిలే. మీరు బయపడ బోకండి. కూలోళ్ళు అంత తేలిగ్గారారు. ఆ రైతు అంత తేలిగ్గా కొయ్యడు. అని దైర్నం చెప్పినాయంట. గువ్వలు, పిల్లలు మళ్ళా పది దినాలు కేళీ విసాసంతో బియ్యపు గింజలను తింటా వుండినాయి. పదకొండో దినం తల్లి గువ్వలు రాంగానే.... అమ్మలాలా.... అమ్మలాలా... ఈ రోజు సందేళ రైతు పెళ్ళం మడికాడికి వచ్చింది....... అని చెప్పినాయో లేదో తల్లి గువ్వలు గుండెలు బాదుకుంటా, రైతు పెళ్ళాం వచ్చిందా..... అవితే బిలబిలాన లెయ్యండి. ఈ పంటకు మనకు రుణం తీరిపొయ్యింది. తెల్లారే కిందికి మనం వేరే పంట చూసుకోవాల, రైతు కూలోళ్ళను నమ్ముతాడు. రైతు పెండ్లాం సొంతంగా వుండే రెక్కల కష్టాన్ని నమ్ముతుంది. ఇంక లెయ్యిండి అనేసి ఎగురుకుంటా లేచి పోయ్ నాయంట.

ఇతరుల మాటలు[మార్చు]

మూలాలు[మార్చు]

నామిని సుబ్రమణ్యం నాయుడు గారి మిట్టూరోడి కథలు.

ఇవి కూడా చూడండి[మార్చు]