నామిని ఇస్కూలు పుస్తకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నామిని ఇస్కూలు పుస్తకం[మార్చు]

పుస్తకం రచయిత అందరెరిగిన నామిని సుబ్రమణ్యం నాయుడు. ఈ పుస్తకం కూడా అయిదు చిన్న పుస్తకాల సంకలనము. ఈ పుస్తకాన్ని టామ్ సాయర్ బుక్స్, తిరుపతి (నామిని వారి అబ్బాయి పేరు టామ్ సాయ్) సంస్దద్వారా పాఠకలోకం ముందుకు తీసుకురాబడింది. ఈపుస్తకం ప్రథమముద్రణ మే, 2010లో జరిగింది. పుస్తకంలో బొమ్మలను ప్రసిద్ధ చలనచిత్ర దర్శకుడు, చిత్రకారుడు బాపు గారందించారు. ఈ పుస్తకంలో రచయిత సంగటి ముద్దలు అంటూ మొందు మాట రాసాడు. నిజానికి మనిసి సంఘజీవి. కాని ఆ నిజాన్ని మరచిపోయ్యి ఎన్నో ఏళ్లయ్యినాయి. ఉదయం లేచింది మొదలుకొని, రాత్రి నిద్రపోయ్యే వరకు ప్రతిమనిసి అంతో, ఇంతో తోటివాడి నుండి సహాయ, సహకారాలను అందుకుంటుంటాడు. కాని ఆ సంగతి గుర్తుండదు. కాదూ కాదూ..గుర్తులేనట్లు నటిస్తాం. కాని నామిని తన ముందుమాట సంగటి ముద్దలు లో తను రచయితగా ఎదుగుటకు కారణమైన వాళ్లను, ఇన్నాళ్ళు తనకు ఆర్థికసహయం చేసిన వారిని పేరుపేరున ప్రస్తావించాడు. మంచిచేసే వాళ్లు కరువైపోయిన ఈ కాలంలో స్వంతలాభం కొంతమానుకొని సహాయ హస్తం అందించిన వారి గురించి పదిమందికి చెప్పడం ఉత్తమ సంప్రదాయం. "పుస్తకం చదివే ముందర ఒక చిన్న మాట"-అంటూ ఈపుస్తకం తనెందుకు వ్రాయవలసివచ్చిందో వ్రాసాడు. సరళమైన భాషలో మనస్సుకు హత్తుకొనేలావుంది రచన.

పుస్తక ముఖచిత్రం

రచయిత గురించి[మార్చు]

నామిని సుబ్రహమణ్యం గారు రాయలసీమ ప్రాంతానికిచెందిన చిత్తూరు జిల్లా లోని రామచంద్రపురము మండలంకుచెందిన మిట్టూరువాసి.తిరుపతిలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎమ్మేసి చదివాడు.కథలరచనలో తనకంటూ ఒకప్రత్యేక శైలి కలిగివున్నరచయిత.ఇతనికథలు ఉహల్లోంచి కాక వాస్తవాలనుంచి పుట్టుకొచ్చాయి. చుట్టూవున్న సమాజంలోని వాస్తవాలనుండి కథాలు అల్లుకొన్నాయి.కథ్లలోని భాష సరళమైన గ్రామీణ భాష.అనగా నిత్యజీవితంలో పల్లెజనులు ఎలాతమలో మాట్లాడుకుంటారో అ భాషలోనే రాసాడు. జగమేరిగిన బ్రాహ్మణునికి జంధ్యమేలా అన్నట్లుగా నామిని గురించి ప్రత్యేకంగా ఏమి వ్రాయాలీ?!

పుస్తకంలో విషయాలు[మార్చు]

ఈ పుస్తకం గురించి ఎంతచెప్పిన తక్కువే? ఎంతవ్రాసిన కొరతే. ఇస్కూలులో పాఠాలు చెప్పే ప్రతి లెక్కల అయ్యవార్లు కొని చదువవలసిన పుస్తకమిది. ఇస్కూలను నడిపే యాజమానులు తమ అయ్యవాళ్ళచే చదించవలసిన పుస్తకమిది. ఇస్కూలు కెల్లే పిల్లలున్న ప్రతి అమ్మ, నాయిన ఈ బుక్కును కొని మరీ చదవాలబ్బా!!. ఇస్కూల్లకెల్లి చదువుకునే పిల్లలున్న స్నేహితులకు, హితులకు, చుట్టాలకు, పక్కాలకు, ఇరుగుపొరుగు అమ్మలక్కలకు, అన్నయ్యలకు బహుమతిగా ఇవ్వతగ్గ పుస్తకం. లక్షలకు లక్షలు డొనేసన్ను ఇచ్చాం. వేలకు వేలు ఫీజులు కట్తున్నాం.."బాగా చదవాలి, మంచి ర్యాంకుల పంట పండించాలి. ఇంజనీరో, డాక్టరో అవ్వాలని" పిల్లలను సతపోరే అమ్మనాన్నలు, అయ్యవార్లు స్కూల్లో పిల్లలకు లెక్కలంటే, ఇంగ్లీసంటే భయంలేని విధంగా చెప్తున్నారా? లేదా గుత్తంగా బట్టి పెట్టిస్తున్నారో, గమనించడం లేదు. నామిని ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు ఉహించి రాసినది కాదు. ఆయన అనుభవం నుండి, ఆలోచన నుండి, ఆచరణ నుండి పుట్టు కొచ్చినదీ పుస్తకము. తన అక్కకూతురు తులసి, - తన పిల్లలకు, కొన్నిరోజులు స్కూలు పిల్లలకు టిచరుగా పాఠాలు చెప్పిన అనుభవం నుండి, స్కూలుకెళ్ళె ప్రతి పిల్లాడికి లెక్కలన్నా, ఇంగ్లీసన్నా భయం పోవాలన్న తపనకు ప్రతిఫలమే ఈ పుస్తకము. ఈ మధ్య వార్తాపత్రికల్లో చూస్తున్నాం, చదువువత్తిడికి తట్టుకునే మానసికస్ధితి కోల్పొయి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్థుల గురించి. వాటికి సమాధానం ఈ పుస్తకంలోని "చదువులా? చావులా"

పుస్తకం విషయసూచిక[మార్చు]

ఈపుస్తకం ఐదు చిన్నపుస్తకాల సంపుటము.

  • ఇస్కూలు పిలకాయలకత
  • పిల్లలభాషలో Algebra
  • చదువులా?చావులా?
  • మా అమ్మ చెప్పిన కథలు
  • పిల్లల్తో మాట్లాడాల్సిన మాటలు.

ఇస్కూలు పిలకాయల కత వ్రాసింది 1999 లో.పిల్లలభాషలో Algebra 2000 లో, చదువులా?చావులా? వ్రాసింది 2001 లో.', అమ్మచెప్పిన కతలు 2002లో వ్రాశుడు.పిల్లలతో మాట్లాడాల్సిన మాటలు రాసింది మాత్రం ఏప్రిల్ 2010లో.