మిద్దె తోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఉద్యానవనాలను నేలపై కాక భవనాలపై, ఇళ్ళ పైకప్పు పై పెంచే విధానమే మిద్దె తోట. దీన్నే టెర్రేస్ గార్డెన్ లేదా డాబా ఉద్యాన వనం అని కూడా అంటారు. ఈ విధానంలో సాధారణంగా పూల మొక్కలను, పంటలను పెంచుతారు.

చరిత్ర[మార్చు]

Dachgarten in HD

ప్రారంభం క్రీస్తు పూర్వమే నాలుగు వేల సంవత్సరాల నుండీ ఆరు వందల సంవత్సరం వరకూ మెసపటోమియా నాగరికత కాలంలో నే చూడొచ్చు. రోమీయుల కాలం లో చూస్తే పొంపిల్లి లోని అద్భుతాల భవంతి ఉదాహరణగా చెప్పొచ్చు. బైజాంటైన్ సామ్రాజ్య కాలంలో కైసరియ ప్రాంతం లో ప్రేక్షకులు కూర్చునే భవనంపైన ఉండేవని చరిత్ర చెబుతోంది.[1] డాబాపైన మొక్కలు పెంచడమనేది ఇప్పుడు కొత్తగా కనిపెట్టిన విషయమేమీ కాదు. క్రీస్తుపూర్వం మెసపొటేమియా నాగరికత నాటికే ఈ పద్ధతి ఉందట. భవనం అందంగా కనిపించడం కోసం రోమన్లు ముందువైపు ఇంటి పైకప్పు ప్రత్యేకంగా కట్టించి దాని మీద మొక్కలు పెంచి పూల తీగెలు కిందికి వేలాడేలా చేసేవారట. రోమ్‌, ఈజిప్టు లాంటి చోట్ల పురావస్తు తవ్వకాల్లో బయటపడిన పలు భవనాల్లో ఇలాంటి పైకప్పు తోటలు కన్పించాయని చరిత్ర చెబుతోంది. పురాతన ప్రపంచానికి చెందిన ఏడు వింతల్లో ఒకటైన హ్యాంగింగ్‌ గార్డెన్స్‌ కూడా ఎత్తైన భవనాల మీద పెంచిన తోటలే.

ఏఏ రకాలు[మార్చు]

నగరవాసులు రూఫ్‌ గార్డెన్లలో బోన్సాయ్ చెట్లను, టమోటా, వంకాయ, క్యాలీఫ్లవర్‌, క్యాబేజ్‌, ఉల్లి, దొడ, నేతి బీర, మిరప, మునగ, చామగడ్డ వంటి కూరగాయలను పండిస్తున్నారు. అలాగే కరివేపాకు, పుదీనా వంటి సుగంద ద్రవ్యాలు, తోట కూర, బచ్చలి, ఆకుకూరలు, సీతాఫలం, రామాఫలం, అల్లనేరేడు, జామ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ, పనస, సపోటా, బొప్పాయి, మామిడి ఇలా పళ్ల మొక్కలనూ పెంచుతున్నారు. ఇంటి కోళ్ల కోసం కొర్ర, సజ్జ, జొన్న వంటి పంటలను పండిస్తున్నారు. చామంతి, మల్లి, రంగు రంగుల మందారాల, గులాబీ, జాజి లాంటి పూల మొక్కలను పెంచుతున్నారు. మేడ స్థలంలో సమాంతరంగా సమతులంగానే కాక లంబంగా పైకి తీగల పందిరి సాకారంతో సాగుకు కొత్త అడుగులు వేయిస్తున్నారు. [2]

ప్రయోజనాలు[మార్చు]

నాణ్యమైన , ఆరోగ్యకరమైన కూరగాయలు, పండ్ల మొక్కలకు ఎటువంటి రసాయన ఎరువులు వాడకుండా మంచి ఫలసాయాన్ని పొందొచ్చు. రాబడికికి కూడా అవకాశముంది. ఇది ముఖ్యంగా పట్టణాలలో ఉన్న వారికి ఒక మంచి వ్యాపకంగా మారింది.

ప్రోత్సాహం[మార్చు]

ఆసక్తి కలిగించడానికి, ఔత్సాహికులకు ప్రోత్సహిస్తూ రైతుమిత్ర సంఘాలు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ద్వారానూ, క్షేత్ర స్థాయి అవగాహన సదస్సుల ద్వారా నూ ప్రచారం కల్పిస్తూ సందేహాలకు నివృత్తి చేస్తూ సహకరించుకొంటున్నారు. చీడ పీడల నివారణకు సహజ నివారణలో భాగంగా జీవామృతం, పంచగవ్యం వంటివి అందజేస్తున్నారు.మొక్కలకు పేనూ పురుగూ లాంటివి కన్పించగానే వాటిని వెంటనే చేత్తో తొలగించాలి. అదుపు తప్పిన స్థాయిలో ఉన్నదనుకుంటే కొద్దిగా వేపనూనెను నీళ్లలో కలిపి చల్లితే సరిపోతుంది.

‘మిద్దెతోట’ పేరుతో తన అనుభవాలను క్రోడీకరించి ఔత్సాహికులకు ఉపయోగపడేలా ఓ పుస్తకం రాశారు తుమ్మేటి రఘోత్తమరెడ్డి. ప్రభుత్వాలు ఉద్యానశాఖల ద్వారా ఆసక్తిగల వారికి శిక్షణ ఇచ్చి, కిట్లనూ సరఫరా చేస్తున్నాయి.

పట్టణాలలో తగ్గుతున్న పచ్చదనానికి ఈ మిద్దె తోటల ఒక సరైన సమాధానమని చెప్పొచ్చు.[3]

మూలాలు[మార్చు]