Jump to content

మినిషా లాంబా

వికీపీడియా నుండి
మినిషా లాంబా
మినిషా లాంబా (2019)
జననం (1985-01-18) 1985 జనవరి 18 (వయసు 39)
వృత్తినటి
క్రియాశీల సంవత్సరాలు2005–2018
జీవిత భాగస్వామి
ర్యాన్ థామ్‌
(m. 2015; div. 2020)
భాగస్వామిఆకాష్ మాలిక్‌ (2021–ప్రస్తుతం)

మినిషా లాంబా, ఢిల్లీకి చెందిన సినిమా నటి, పోకర్ ప్లేయర్.[1] హిందీ, పంజాబీ సినిమాలలో నటించింది.[2][3] 2005లో వచ్చిన యహాన్ సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది. 2007లో హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లిమిటెడ్, 2008లో బచ్నా ఏ హసీనో, 2010లో వెల్ డన్ అబ్బా, 2011లో భేజా ఫ్రై 2 మొదలైన సినిమాలలో నటించింది.[4] 2014లో కలర్స్ టీవీలో ప్రసారమైన బిగ్ బాస్ 8లో కూడా పాల్గొన్నది.

జననం, విద్య

[మార్చు]

మినిషా లాంబా 1985, జనవరి 18న కావెల్ లాంబా - మంజు లాంబాల దంపతులకు న్యూ ఢిల్లీలోని జాట్ కుటుంబంలో జన్మించింది. చెన్నైలోని చెట్టినాడ్ విద్యాశ్రమ పాఠశాలలో ఒక సంవత్సరం చదువుకున్న మినిషా, శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు మార్చబడి, అక్కడ తన పాఠశాల విద్యను పూర్తిచేసింది. మిరాండా హౌస్, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నుండి ఇంగ్లీష్ (ఆనర్స్) పట్టా అందుకుంది.[5][6]

వృత్తిరంగం

[మార్చు]

ఢిల్లీ యూనివర్శిటీలో చదువుతున్నప్పుడు, వివిధ బ్రాండ్ల ప్రకటనలకు మోడల్‌గా పనిచేసింది.[7] క్యాడ్‌బరీ కోసం ఒక యాడ్ షూట్ చేస్తున్న సమయంలో బాలీవుడ్ దర్శకుడు షూజిత్ సిర్కార్ ఆమెను సంప్రదించి, 2005లో యహాన్ సినిమాలో అవకాశం ఇచ్చాడు.[5] ఆ తరువాత కార్పోరేట్, రాకీ: ది రెబెల్, ఆంథోనీ కౌన్ హై, హనీమూన్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్, అనామిక", శౌర్య, దస్ కహానియన్వంటి సినిమాలలో నటించింది.

2008లో, యాష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన బచ్నా ఏ హసీనోలో నటించింది. అదే సంవత్సరంలో సంజయ్ గధ్వి తీసిన కిడ్నాప్‌ సినిమాలో నటించి గుర్తింపు పొందింది.[8] 2010లో దర్శకుడు శ్యామ్ బెనెగల్ తీసిన వెల్ డన్ అబ్బా సినిమాలో ముస్కాన్ అలీ పాత్రలో నటించి తన నటనకు ప్రశంసలు అందుకుంది[5]

2014లో కలర్స్ టీవీలో బిగ్ బాస్ 8లో పాల్గొన్న మినిషా,[9] 6 వారాల తర్వాత 2014 నవంబరు 2న (42వ రోజు) తొలగించబడింది.[10] ధర్మేంద్ర, గిప్పీ గ్రేవాల్, గురుప్రీత్ ఘుగ్గీ, కుల్‌రాజ్ రంధావా, పూనమ్ ధిల్లాన్‌లతో కలిసి డబుల్ డి ట్రబుల్‌ సినిమాలో కూడా నటించింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జుహు నైట్‌క్లబ్ "ట్రైలాజీ" యజమాని ర్యాన్ థామ్‌తో 2015 జూలై6న మినిషా వివాహం జరిగింది.[11] నటి పూజా బేడికి ర్యాన్ థామ్‌ బంధువు.[12] 2020 ఆగస్టులో వారిద్దరు విడాకులు తీసుకున్నారు.[13] వ్యాపారవేత్త ఆకాష్ మాలిక్‌తో డేటింగ్ లో ఉన్నట్లు 2021 జూలైలో మినిషా ప్రకటించింది.[14]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2005 యహాన్ అదా
2006 కార్పొరేట్ మేఘా ఆప్టే
రాకీ: ది రెబెల్ ప్రియా
ఆంథోనీ కౌన్ హై జియా ఆర్.శర్మ
2007 హనీమూన్ ట్రావెల్స్ ప్రై.లి. జరా
దస్ కహానియన్ ప్రియా
2008 బచ్నా ఏ హసీనో మహి
కిడ్నాప్ సోనియా రైనా
శౌర్య కావ్య శాస్త్రి
అనామిక జియా రావు
2010 వెల్ డన్అబ్బా ముస్కాన్
2011 భేజా ఫ్రై 2 రంజిని
హమ్ తుమ్ షబానా షబానా
2012 జోకర్ అన్య
2013 జిల్లా ఘజియాబాద్ ఫౌజీ స్నేహితురాలు
హీర్ అండ్ హీరో మాహి పంజాబీ సినిమా
నల్ల కరెన్సీ ఇంటెలిజెన్స్ ఏజెంట్
2014 డబుల్ డి ట్రబుల్ హర్లీన్ పంజాబీ సినిమా
2017 భూమి ప్రుతీయ మోకో

మూలాలు

[మార్చు]
  1. "Minissha Lamba to Skydive on her Birthday". Archived from the original on 3 August 2017. Retrieved 2022-04-22.
  2. "I-have-dated-men-who-were-wrong-for-me-Minissha-Lamba". BCD. Archived from the original on 11 September 2018. Retrieved 2022-04-22.
  3. "Bachna Ae Haseeno Actress Minissha Lamba Is Professional Poker Player Now". NDTV.com. Archived from the original on 9 August 2020. Retrieved 2022-04-22.
  4. "Minissha Lamba". BCD. Archived from the original on 21 September 2013. Retrieved 2022-04-22.
  5. 5.0 5.1 5.2 "Minissha Lamba dating Andrew Symonds". BCD. Archived from the original on 9 May 2013. Retrieved 2022-04-22.
  6. "Minissha Lamba upcoming projects". BCD. Archived from the original on 9 September 2013. Retrieved 2022-04-22.
  7. "Minissha's Femina Ad". Archived from the original on 12 October 2020. Retrieved 2022-04-22 – via YouTube.
  8. "Minissha Lamba turns Sassy from Pretty". The Hindu.
  9. "Minissha Lamba on 'Bigg Boss': Won't create drama to get footage". The Indian Express. Press Trust of India. 22 September 2014. Archived from the original on 11 October 2014. Retrieved 2022-04-22.
  10. "'Bigg Boss 8': Minissha Lamba evicted from the house". Archived from the original on 3 November 2014. Retrieved 2022-04-22.
  11. "Inside pictures: Minissha Lamba – Ryan Tham's wedding". The Indian Express (in ఇంగ్లీష్). 7 July 2015. Retrieved 2022-04-22.
  12. Nikita, Wagh (18 January 2020). "Do you know Minissha Lamba is married to Pooja Bedi's cousin?". Mid-Day. Archived from the original on 25 March 2020. Retrieved 2022-04-22.
  13. "Minissha Lamba, Ryan Tham are officially divorced". The Indian Express (in ఇంగ్లీష్). 6 August 2020. Archived from the original on 6 August 2020. Retrieved 2022-04-22.
  14. "Bachna Ae Haseeno star Minissha Lamba makes her relationship public with businessman boyfriend, Akash Malik". Bollywood Hungama. 19 July 2021. Retrieved 2022-04-22.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.