మిన్ను మణి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మిన్ను మణి 1999 మార్చి 24 న కేరళ లోని వాయినాడ్ లో జన్మించింది. భారత మహిళా క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక భారతీయ అంతర్జాతీయ క్రికెటర్. ఆమె మహిళల ప్రీమియర్ లీగ్‌ (WPL) లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతోంది. దేశీయ క్రికెట్‌లో, ఆమె కేరళ క్రికెట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆమె భారత్ తరఫున ఆడిన తొలి కేరళ మహిళా క్రికెట్ క్రీడాకారిణి.

జీవిత విశేషాలు[మార్చు]

మిన్ను స్వస్థలం కేరళలోని వాయనాడ్ జిల్లా చోయిమూల. ఆమె తండ్రి CK మణి రోజువారీ కూలీ. ఆమె తల్లి వసంత, గృహిణి. ఆమె వాయనాడ్‌లోని షెడ్యూల్డ్ తెగలలో ఒకటైన కురిచియా తెగకు చెందినది.[1] ఆమెకు మిమిత అనే చెల్లెలు ఉంది.[2] ఆమె 8వ తరగతి వరకు ఎడప్పాడిలోని మనంతవాడి ప్రభుత్వ ఒకేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో, 10వ తరగతి వరకు తోడుపుజాలోని సెయింట్ సెబాస్టియన్ హైస్కూల్‌లో చదివింది. ఆమె తన ఉన్నత, మాధ్యమిక విద్యను సుల్తాన్ బతేరిలోని సర్వజన హయ్యర్ సెకండరీ పాఠశాలలో పూర్తి చేసింది. మిన్ను తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాల నుండి పట్టభద్రురాలైంది.[3] 2023 నాటికి, ఆమె దూరవిద్య ద్వారా సోషియాలజీలో బి ఏ చదువుతోంది.[4]

మిన్ను మణి
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ24 మార్చ్ 1999
చోయిమూల, వయనాడ్, కేరళ, భారత దేశము
ఎత్తు5 ft 6 in (1.68 m)
బ్యాటింగుఎడమ చేతి వాటము
బౌలింగుకుడి చేతి ఆఫ్ బ్రేక్
పాత్రఆల్ రౌండర్
బంధువులుతండ్రి: CK మణి; తల్లి: వసంత: చెల్లి: మిమిత
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి T20I (క్యాప్ 74)2023 9 జులై - బంగ్లాదేశ్ తో
చివరి T20I2023 13 జులై - బంగ్లాదేశ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2014/15కేరళ జట్టు
2023WPL - ఢిల్లీ క్యాపిటల్స్

క్రికెట్ విశేషాలు[మార్చు]

ఆమె 10 సంవత్సరాల వయస్సులో వరి పొలాల వద్ద అబ్బాయిలతో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. మొదట్లో, ఆమె క్రికెట్ ఆడాలనే ఆలోచనకు ఆమె కుటుంబం ప్రోత్సాహం ఇవ్వలేదు. ఆమె ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్, ఎల్సమ్మ ఆమె నైపుణ్యాన్ని గమనించి, ఆమెను వయనాడ్ జిల్లా అండర్-13 జట్టు ఎంపిక ట్రయల్స్‌కు తీసుకెళ్లింది. మరుసటి సంవత్సరం, ఆమె కేరళ U-16 జట్టులో ఆడింది, 16 సంవత్సరాల వయస్సులో సీనియర్ స్థాయిలో కేరళకు ప్రాతినిధ్యం వహించింది. మిన్నూ క్రికెట్ అభ్యాసం కోసం తన ఇంటి నుండి సమీపంలోని స్టేడియానికి చేరుకోవడానికి నాలుగు బస్సులు మారుతూ రోజూ గంటన్నర ప్రయాణం చేయాల్సి వచ్చేది.[4][5]

దేశీయ జట్టు[మార్చు]

మిన్నూ 16 ఏళ్ల వయసులో కేరళ జట్టు తరఫున క్రికెట్ పోటీలలో ఆడడం మొదలు పెట్టింది. కేరళ U-23 మహిళల జట్టు, 2018 జాతీయ T20 ఛాంపియన్‌షిప్‌లో 188 పరుగులు చేసి, 11 వికెట్లతో గెలిచినప్పుడు ఆమె కీలక ప్రదర్శన చేసింది. 2019లో, ఆమె అండర్-23 ఒక రోజు ఛాలెంజర్ ట్రోఫీలో ఇండియా బ్లూకు ప్రాతినిధ్యం వహించింది. బంగ్లాదేశ్‌లో పర్యటించే భారతదేశం A జట్టుకు ఆమెకు తొలిసారిగా పిలుపు వచ్చింది. అదే సంవత్సరంలో ACC ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్‌కు కూడా పిలిచారు.[6]

మహిళల ప్రీమియర్ లీగ్‌[మార్చు]

2023 ఫిబ్రవరిలో, 2023 మహిళల ప్రీమియర్ లీగ్‌కి (WPL) రు.30 లక్షలకు వేలంతో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడింది.[7]

WT20I[మార్చు]

2023 జూలైలో, ఆమె బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత జట్టుకు పిలిచారు. ఆమె కేరళ నుండి భారతదేశానికి కాల్-అప్ పొందిన మొదటి మహిళా క్రికెట్ క్రీడాకారిణి.[8] ఆమె 2023 జూలై 9న బంగ్లాదేశ్ మహిళ క్రికెట్ జట్టుతో భారత మహిళల తరపున మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ క్రికెట్ (WT20I) ఆడడం మొదలు పెట్టింది.[9] ఆమె మూడు మ్యాచ్‌లలో 5 వికెట్లు తీసి సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా నిలిచింది.[10] 2023 జూలై 15న, ఆమె 19వ ఆసియా క్రీడల కోసం భారత జట్టులో ఎంపికైంది.[11]

గౌరవాలు[మార్చు]

మిన్నూ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడటం మొదలు పెట్టిన తర్వాత, 2023 జూలైలో ఆమె సొంత జిల్లా వాయనాడ్‌లోని మనంతవాడి పంచాయతీలోని తలస్సేరి -వల్లియూర్కావు జంక్షన్‌కు ఆమె పేరు పెట్టారు.[12]

ప్రస్తావనలు[మార్చు]

 1. "Minnu Mani, Labourer's Daughter, Becomes First From Kerala to Make Indian Women's Cricket Team". Outlook India. Retrieved 6 July 2023.
 2. "'സ്‌പെഷ്യല്‍ ക്ലാസുണ്ടെന്നുവരെ പറഞ്ഞ് ക്രിക്കറ്റ് കളിക്കാന്‍ പോയിട്ടുണ്ട്' - മിന്നുമണി". Mathrubhumi (in మలయాళం). Retrieved 6 July 2023.
 3. "മിന്നുകയാണു കേരളത്തിന്റെ പൊന്നുമണി". Madhyamam (in మలయాళం). Retrieved 6 July 2023.
 4. 4.0 4.1 "Meet Minnu Mani, tribal woman cricketer from Kerala who's set to play for India". The News Minute. Retrieved 6 July 2023.
 5. "WPL Auction: Tribal girl Minnu Mani reaps rich rewards for her sacrifices". The Times of India. Retrieved 6 July 2023.
 6. "Wielding the willow, this tribal girl from Wayanad chases a dream". OnManorama. Retrieved 6 July 2023.
 7. Sudarshanan, S (13 February 2023). "Bid-by-bid updates - 2023 WPL auction". ESPNcricinfo. Retrieved 6 July 2023.
 8. "India's tour of Bangladesh: Minnu Mani becomes the first from Kerala to get picked in Indian women's squad". The Hindu. Retrieved 6 July 2023.
 9. "1st T20I, Mirpur, July 09, 2023, India Women tour of Bangladesh". ESPN Cricinfo. Retrieved 9 July 2023.
 10. "India Women tour of Bangladesh- Records". ESPN Cricinfo. Retrieved 13 July 2023.
 11. "Ruturaj Gaikwad, Harmanpreet Kaur to lead as BCCI announces India men's and women's squads for 19th Asian Games". The Indian Express. Retrieved 23 July 2023.
 12. "Mananthavady honours Minnu Mani by renaming major junction after her". The New Indian Express. Retrieved 23 July 2023.