మిలన్ గుప్తా
This పేజీకి ఏ ఇతర పేజీల నుండి లింకులు లేకపోవడం చేత ఇదొక అనాథ పేజీగా మిగిలిపోయింది. |
మిలన్ గుప్తా | |
---|---|
ఇతర పేర్లు | మిలన్ దా |
జననం | నవంబర్ 22 1930 కలకత్తా |
మరణం | ఫిబ్రవరి 18 1995 కలకత్తా |
వృత్తి | హార్మోనికా వాయిద్యకారుడు |
వాయిద్యాలు | హార్మోనికా |
క్రియాశీల కాలం | 1950 – 1995 |
మిలన్ గుప్తా భారతీయ హార్మోనికా వాద్యకారుడు. ఆయన హార్మోనికాలో స్పష్టంగా ప్రతి అక్షరాన్నీ పలికిస్తారు.[1] మిలన్ గుప్తా గారిని ఆయన అభిమానులు, మిత్రులు ప్రేమగా “ మిలన్ దా ” అని పిలుస్తారు.మిలన్ గుప్తా గారు పూర్తిగా పాశ్చాత్య సంగీత వాయిద్యమైన హార్మోనికా పై భారతీయ సంగీతాన్ని, లలిత సంగీతాన్ని, మోడరన్ బెంగాలీ సాంగ్స్ గా పిలవబడే రబీంద్ర సంగీత్ ను వీనుల విందుగా వాయించి శ్రోతల మన్ననలు అందుకోనడమే కాకుండా ఎందరో ఔత్సాహికులకు హార్మోనికా సంగీతాన్ని బోధించి భారతదేశంలో హార్మోనికాను ప్రాచుర్యం లోనికి తీసుకొచ్చారు.
జీవిత విశేషాలు
[మార్చు]మిలన్ గుప్తా కలకత్తాలో నవంబర్ 22 1930 న జన్మించాడు.[2] అతని తల్లి కలకత్తాలో ఒక ప్రముఖ గాయని. వీరు ఆల్ ఇండియా రేడియోలో పాడారు.[3]. ఆయన బాల్యంలో తాను నివసించే ప్రాంతంలో ఉన్న మెరైన్ ఇంజనీరు తనకు రెండు హోనెర్ క్రోమాటిక్ హార్మోనికాలు ఇచ్చే వరకు సాధారణ మౌత్ ఆర్గాన్స్ నే వాడేవారు. ఆయన ఈ వాద్యాన్ని స్వంతంగానే నేర్చుకున్నారు.
మూలాలు
[మార్చు]- ↑ "Harmonica Maestro : Milon Gupta". Archived from the original on 2016-04-10. Retrieved 2015-12-20.
- ↑ "Melody in his pocket". Archived from the original on 2016-03-10. Retrieved 2021-02-05.
- ↑ /musicain-rama-krishna-interview
ఇతర లింకులు
[మార్చు]- యూట్యూబ్ లో ఆయన మౌత్ ఆర్గాన్ సంగీతం
- యూట్యూబ్ లో ఆయన ఇంటర్వ్యూ
- Milon Gupta - Mouth Organ, ఆయన పాడిన పాటలు Archived 2016-03-13 at the Wayback Machine
- ఆయన మౌత్ ఆర్గాన్ పై పాడిన హిందీ గీతాలు Archived 2016-01-03 at the Wayback Machine
- Top Milon Gupta Albums
- HaLoH pays tribute to the Indian harmonica legend (Late) Shri Milon Gupta