మిసోగి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుబాకి గ్రాండ్ పుణ్యక్షేత్రం వద్ద జలపాతం కింద రాత్రి మిసోగి

మిసోగి(Misogi (禊)) అనేది జపనీస్ షింటోలు శరీరాన్ని మొత్తం కడగడం ద్వారా కర్మ శుద్దీకరణ చేసుకునే అభ్యాసం. ఈ మిసోగి మరొక షింటో శుద్దీకరణ ఆచారమైన హరేయ్(Harae )కు సంబంధించిన అభ్యాసం – ఈ రెండింటిని కలిపి సమిష్టిగా మిసోగిహరేయ్(misogiharae (禊祓)) గా వ్యవహరిస్తారు.

నేపథ్యం[మార్చు]

ప్రతి సంవత్సరం, అనేక మంది ప్రజలు పవిత్ర జలపాతాలు, సరస్సులు, నదులకి ఒంటరిగా లేదా చిన్న సమూహాలుగా మిసోగి నిర్వహించడానికి తీర్థ యాత్రలు చేస్తారు. కియీ పర్వత శ్రేణి లోని ఒంటాక్ పర్వతం, యోషినో పర్వతాలు, జపాన్‌లోని మిసోగికి సంబంధించిన పురాతన, ప్రసిద్ధ ప్రాంతాలకు కొన్ని ఉదాహరణలు. క్యోటోలో , ప్రజలు కియోమిజు దేవాలయపు ఒటోవా నో టాకీ (సౌండ్-ఆఫ్-వింగ్స్) జలపాతం కింద తమను తాము శుద్ధి చేసుకుంటారు. అయితే ఎక్కువ మంది సందర్శకులు నీటిలో మునగకుండా, ఆ నీటిని తాగుతారు. [1] యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతిరోజూ ఉదయం కొన్ర్యు మైయోజిన్ నో టాకీ జలపాతం వద్ద ఉన్న సుబాకి గ్రాండ్ ష్రైన్ ఆఫ్ అమెరికా వద్ద మిసోగిని ప్రదర్శన జరుగుతుంది. [2]

మిసోగిని ఆచరించే ముందు, సాధారణంగా వారు ప్రార్థనలు, ఉపవాసం లేదా కొన్ని రకాల శారీరక శ్రమలు వంటి మరికొన్ని ప్రాథమిక శుద్దీకరణలను ఆచరిస్తారు. సాధారణంగా, స్త్రీలు ప్రత్యేకమైన తెల్లటి కిమోనో ( వస్త్రం )ని, తలకుపట్టీ (హెడ్‌బ్యాండ్‌)ను ధరిస్తారు. పురుషులు ఫండోషి ( నడుము వస్త్రం ), తల పట్టీని ధరిస్తారు. అప్పుడు వారు తమ కడుపు ముందు భాగంలో రెండుచేతులను బిగించి వాటిని పైకి క్రిందికి ఊగిస్తూ, ఎగువ మొండెపు భాగాన్ని వణికిస్తూ ఫ్యూరిటమా (降り魂) లేదా "స్పిరిట్ షేకింగ్"నుప్రారంభిస్తారు. దీని ఉద్దేశ్యం లోపల ఉన్న ఆత్మ ఉనికిని తెలుసుకోవడం/ఏకీకృతం చేయడం. ఇది "వార్మ్-అప్" లేదా కాలిస్టెనిక్స్ ( టోరి-ఫ్యూన్鳥船 లేదా "బర్డ్ బోట్" రోయింగ్) అనుసరణ . పైన పేర్కొన్న ఈ రెండు అభ్యాసాలు కొన్నిసార్లు ప్రత్యేక ప్రార్థనలు లేదా మంత్రాలతో కూడి ఉంటాయి. తరువాత, వారి నాయకుడు ఆత్మను చేతన్యవంతం చేయటానికి ఆవాహన/ ప్రార్థనా ప్రారంభిస్తాడు. అనుచరులు సాధారణంగా అతనితో వారం కలుపుతారు, తద్వారా తమ ఆత్మను జాగృతం చేసి తద్వారా వారి చుట్టూ ఉన్న కామితో వారు ఏకీకృతం అవుతారు.

పాల్గొనేవారి జీవక్రియను వేగవంతం చేయటానికే పై వ్యాయామాలు జరుగుతాయి, కొన్ని సమూహాలు ధీర్ఘ శ్వాసతో పాటుగా ఈ అభ్యాసాలు చేస్తాయి. వారు పవిత్రమైన ఉప్పు చల్లుకుని, బియ్యపు పానీయం(sake) పుక్కిలి తో మూడు సార్లు జలపాతం లోకి ఉమ్మి వేయడానికి ఉంచుకుని ఉండవచ్చు. కొన్నిసార్లు వారికి, జలపాతంలోకి ప్రవేశించినప్పుడు అందులోకి విసిరేందుకు ఉప్పు ఇస్తారు. కొన్ని సమూహాలలో, నాయకుడు తొమ్మిదికి లెక్కించి, గాలిని కోస్తున్నట్టు గా చేస్తూ, అశుద్ధతను పారద్రోలడానికి "యేయ్! " అని అరుస్తాడు. అప్పుడు పాల్గొనేవారు హరై తమై కీయోమె తమై రొక్కోన్ షోజో (harai tamae kiyome tamae rokkon shōjō ) అనే పదబంధాన్ని నిరంతరం పఠిస్తూ జలపాతంలోకి ప్రవేశిస్తారు. ఈ పదబంధం మానవుడి ఐదు ఇంద్రియాలు, మనస్సు తో కూడిన ఆరు అంశాల మలినాన్ని కడిగివేయమని కామిని అడిగే వేడికోలు . ఈ అభ్యాసం సమూహం నుండి సమూహానికి మారుతుంది, ప్రతి దానికి, ఒక స్వంత సంప్రదాయ లేదా పద్ధతి ఉంటుంది . [3]

మిసోగి అనేది కొన్ని రకాల మార్షల్ ఆర్ట్స్‌లలో కూడా ముఖ్యంగా, ఐకిడోలో, శిక్షణ కోసం మనస్సును సిద్ధం చేయడానికి, తమ డాంటియన్ లేదా శక్తి కేంద్రం ను ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. ఐకిడో వ్యవస్థాపకుడు, మోరిహీ ఉషిబా, తన శిక్షణకు, దానిలో పరిపూర్ణతా సాధనకు క్రమం తప్పకుండా ఈ రకమైన ధ్యానాన్ని అనుసరిస్తాడు. సూర్యోదయానికి ముందు చల్లటి నీటితో మిసోగీని ఆచరించే వ్యక్తులకు జపాన్‌లోని కి సొసైటీ ప్రధాన కార్యాలయంలో ఉన్న సేన్ షిన్ టీ మిసోగి బావి ప్రసిద్ధి చెందిది.

ఇది కూడ చూడు[మార్చు]

ప్రస్తావనలు[మార్చు]

1. నిషియోకా కజుహికో (మార్చి 31, 2007). "మిసోగి". ఎన్సైక్లోపీడియా ఆఫ్ షింటో. కొకుగాకుయిన్ విశ్వవిద్యాలయం. ఫిబ్రవరి 11, 2014న పునస్సంపాదన. 2. కియోమిజు-డేరా

3. "మిసోగి షుహో". సుబాకి గ్రాండ్ పుణ్యక్షేత్రం ఆఫ్ అమెరికా. ఫిబ్రవరి 11, 2014న పునస్సంపాదన. 

4. కామి నో మిచి: ది లైఫ్ అండ్ థాట్ ఆఫ్ ఎ షింటో ప్రీస్ట్. అనుబంధం సి: మిసోగి, ఆధ్యాత్మిక వ్యాయామాలు వేబ్యాక్ మెషిన్ వద్ద 2012-02-19 భద్రపరిచారు . గుజి యుకిటకా యమమోటో. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్శిటీ. 2011-11-14న పునస్సంపాదన.

మరింత చదవడానికి[మార్చు]

  • ఫిషర్, మేరీ పాట్. లివింగ్ రిలిజియన్స్, 5వ ఎడిషన్. ప్రెంటిస్ హాల్.
  1. Kiyomizu-dera
  2. "Misogi Shuho". Tsubaki Grand Shrine of America. Retrieved February 11, 2014.
  3. Kami no Michi: The Life and Thought of a Shinto Priest. Appendix C: Misogi and Spiritual Exercises Archived 2012-02-19 at the Wayback Machine. Guji Yukitaka Yamamoto. California State University. Retrieved 2011-11-14.
"https://te.wikipedia.org/w/index.php?title=మిసోగి&oldid=3426099" నుండి వెలికితీశారు