Jump to content

ముకుట్ పర్బత్

అక్షాంశ రేఖాంశాలు: 30°57′08″N 79°34′13″E / 30.95222°N 79.57028°E / 30.95222; 79.57028
వికీపీడియా నుండి
ముకుట్ పర్బత్
ముకుట్ పర్బత్ is located in Uttarakhand
ముకుట్ పర్బత్
ముకుట్ పర్బత్
ఉత్తరాఖండ్ పటంలో ముకుట్ పర్బత్ స్థానం
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు7,242 మీ. (23,760 అ.)[1]
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్840 మీ. (2,760 అ.)
జాబితాఅల్ట్రా
నిర్దేశాంకాలు30°57′08″N 79°34′13″E / 30.95222°N 79.57028°E / 30.95222; 79.57028
భౌగోళికం
స్థానంచమోలి , ఉత్తరాఖండ్
పర్వత శ్రేణిగఢ్వాల్ హిమాలయాలు
అధిరోహణం
మొదటి అధిరోహణతొలిసారిగా 1951 లో న్యూజీలాండ్ బృందం దీన్ని అధిరోహించింది. కాటర్, పసంగ్ దావా లామా, రిడ్డిఫోర్డ్

ముకుట్ పర్బత్ ఉత్తరాఖండ్‌లో గఢ్వాల్ హిమాలయాల్లోని పర్వత శిఖరం. పూర్తిగా భారతదేశంలోనే ఉన్న అత్యంత ఎత్తైన పర్వత శిఖరాల్లో ఇది 20 వ స్థానంలో ఉంది. నందాదేవి మొదటి స్థానంలో ఉంది. ముకుట్ పర్బత్, ప్రపంచంలో 96 వ ఎత్తైన శిఖరం. దీనికి రెండు శిఖరాలు ఉన్నాయి, మొదటిది 7,242 మీ. (23,760 అ.) ఎత్తున, మరొకటి 7,130 మీ. (23,392 అ.) ఎత్తున ఉంటాయి. ఇది కామెట్ జస్కర్ శ్రేణి లోకి వస్తుంది.[2]

అధిరోహణ చరిత్ర

[మార్చు]

ముకుట్ పర్బత్‌ను మొదటిసారిగా 1951 లో న్యూజిలాండ్‌కు చెందిన బృందం దాని నిటారుగా ఉన్న పశ్చిమ శిఖరం గుండా అధిరోహించింది.[3] ఎడ్మండ్ కాటర్, పసాంగ్ దావా లామా, ఎర్లే రిడ్డిఫోర్డ్ లు తూర్పు నుండి సరస్వతిని కలిపే దఖినీ చామ్రావ్ హిమానీనదం నుండి దాని శిఖరాన్ని చేరుకున్నారు.[4] ముకుట్ పర్బత్ జస్కర్ శ్రేణిలో ఉంది. ఈ శ్రేణిలో రుతుపవన వర్షాలు భారీగా కురియవు.

ఇరుగు పొరుగు శిఖరాలు

[మార్చు]

ముకుట్ పర్బత్ చుట్టూ మూడు ప్రధానమైన పొరుగు లేదా అనుబంధ శిఖరాలు ఉన్నాయి:

హిమానీనదాలు, నదులు

[మార్చు]

పశ్చిమ (పస్చిమి) కామెట్ గ్లేసియర్. వెస్ట్ కామెట్ గ్లేసియర్ శాఖలు కామెట్, అబి గామిన్, ముకుట్ పర్బత్, దఖినీ చామ్రావ్ హిమానీనదపు పశ్చిమ వాలులపై ఉన్నాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Error".
  2. High Asia
  3. "Mukut Parbat Attempt". American Alpine Journal. American Alpine Club. 1990. Retrieved 18 June 2020.
  4. "The HJ/56/10 FIRST ASCENT OF MUKUT PARVAT EAST, 1999".