అక్షాంశ రేఖాంశాలు: 30°22′00″N 79°59′40″E / 30.36667°N 79.99444°E / 30.36667; 79.99444

తూర్పు నందాదేవి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తూర్పు నందాదేవి
సునందాదేవి
తూర్పు నందాదేవి (కుడి చివరి శిఖరం)
అత్యంత ఎత్తైన బిందువు
ఎత్తు7,434 మీ. (24,390 అ.)[1]
list of highest mountains
టోపోగ్రాఫిక్ ప్రామినెన్స్260 మీ. (850 అ.)[2][3]
నిర్దేశాంకాలు30°22′00″N 79°59′40″E / 30.36667°N 79.99444°E / 30.36667; 79.99444[1][4]
భౌగోళికం
తూర్పు నందాదేవి is located in India
తూర్పు నందాదేవి
తూర్పు నందాదేవి
భారతదేశంలో శిఖరం స్థానం
స్థానంచమోలి జిల్లా, ఉత్తరాఖండ్
పర్వత శ్రేణిగఢ్వాల్ హిమాలయాలు
అధిరోహణం
మొదటి అధిరోహణ1939 లో జాకబ్ బుజాక్, జానస్ క్లార్నర్.[5]
సులువుగా ఎక్కే మార్గందక్షిణ శిఖరం, లావన్ గ్యాడ్ నుండి లాంగ్‌స్టాఫ్ కల్ మీదుగా: రాయి/మంచు/ఐసు అధిరోహణ

తూర్పు నందాదేవి ఉత్తరాఖండ్‌లోని ఎత్తైన పర్వతం, భారతదేశం లోని రెండవ ఎత్తైన పర్వతం. పక్కపక్కనే ఉన్న నందాదేవి జంటశిఖరాలలో చిన్నది; రెండవది, దానికంటే ఎత్తైన నందాదేవి. తూర్పు నందాదేవిని స్థానికంగా సునందాదేవి అని అంటారు. నందాదేవి, తూర్పు నందాదేవి రెండూ తూర్పు గఢ్వాల్ హిమాలయాలలో భాగం. ఈ రెండు శిఖరాలు కుమావోన్‌లో దాదాపు ఎక్కడి నుండి చూచినా కనిపిస్తాయి. తూర్పు నందాదేవి శిఖరాన్ని మొదటగా అధిరోహించినది బహుశా 1939 లో జాకుబ్ బుజాక్, జానస్ క్లార్నర్‌లు. ఈ శిఖరం ఎత్తు 7,434 మీ. (24,390 అ.), దాని ప్రామినెన్స్ 260 మీ. (850 అ.).

మతపరమైన ప్రాముఖ్యత

[మార్చు]

తూర్పు నందాదేవి అనేది నందాదేవి జంట శిఖరాలలో చిన్నది. రెండు-శిఖరాలు కలిపిన మాసిఫ్ 2-కిలోమీటర్ల పొడవు గల శిఖరాన్ని ఏర్పరుస్తుంది. ఇది తూర్పు-పడమరలుగా ఉంటుంది. పశ్చిమ శిఖరం తూర్పు శిఖరం కంటే ఎత్తుగా ఉంటుంది. తూర్పు నందాదేవి అనే తూర్పు శిఖరాన్ని స్థానికంగా సునందాదేవి అని కూడా అంటారు. ఈ శిఖరాలను నంద, సునంద దేవతల శిఖరాలుగా సూచిస్తారు. ఈ దేవతలు ప్రాచీన సంస్కృత సాహిత్యంలో భాగం.[6]

అధిరోహణ చరిత్ర

[మార్చు]

ఆడమ్ కార్పిన్స్కీ నేతృత్వంలోని నలుగురు సభ్యుల పోలిష్ బృందం 1939 లో తూర్పు నందాదేవి శిఖరాన్ని లాంగ్‌స్టాఫ్ కోల్ నుండి అధిరోహించింది. ఇది ఈ శిఖరారోహణకు ప్రామాణిక మార్గం. జాకుబ్ బుజాక్, జానస్జ్ క్లార్నర్‌లు శిఖరాన్ని చేరుకున్నారు.

1951 లో ఒక ఫ్రెంచ్ బృందం మొదటిసారిగా, నందాదేవి, తూర్పు నందాదేవి మధ్య ఉన్న ఎత్తు మీదుగా ఎక్కేందుకు ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఇద్దరు సభ్యులు మరణించారు. వారి సహాయక బృందంలో టెన్జింగ్ నార్గే ఒక భాగం; అతను, లూయిస్ డుబోస్ట్‌లు తప్పిపోయిన జంట కోసం వెతకడానికి తూర్పు నందాదేవి ఎక్కారు. ఇది తన జీవితంలో అత్యంత కష్టతరమైనదని, ఎవరెస్ట్ కంటే కూడా చాలా కష్టమని టెన్జింగ్ ఆ తరువాత చెప్పాడు.[7]

ఆ తరువాత 1975 లో ఇండో-ఫ్రెంచ్ బృందం శిఖరాన్ని చేరుకుంది. బహుశా 1981 లో భారత సైన్యం కూడా యాత్ర జరిపింది. అయితే ఈ యాత్రలో విశేషాలు చెప్పేందుకు పర్వతారోహకులెవరూ జీవించలేదు. దక్షిణ శిఖరం మార్గంలో తూర్పున ఉన్న మిలామ్ లోయ నుండి లావాన్ హిమానీనదం లాంగ్‌స్టాఫ్ కల్ గుండా వెళుతుంది. ఈ ట్రెక్ సుందరమైన మున్సియారి భడేలిగ్వార్ గ్రామాల గుండా వెళుతుంది.

1978 లో, డేవిడ్ హాప్కిన్స్ బ్రిటీష్ గఢ్వాల్ హిమాలయ యాత్రకు నాయకత్వం వహించాడు. ఇది నైరుతి ముఖం నుండి తూర్పు నందాదేవిని వైపుకు, ప్రధాన నందాదేవి శిఖరానికి అడ్డంగా, ప్రధాన శిఖరం యొక్క దక్షిణ ముఖంగా దిగేందుకు ప్రయత్నించింది.[8] ఈ యాత్రలో సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా బెన్ బీటీ మరణించాడు. అతను 1971 లో విషాదాంతమైన కైర్‌న్‌గార్మ్ పీఠభూమి విపత్తుకు యాత్రకు నాయకుడు.[9]

2005 లో మార్కో డల్లా లాంగా నాయకత్వంలో పెద్ద ఇటాలియన్ బృందం తూర్పు నందాదేవి అధిరోహణకు వెళ్ళింది. వారు మున్సియారి, మిలామ్ లోయల మీదుగా శిఖరారోహణ మొదలుపెట్టారు. 5400 మీటర్ల వరకు శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇటాలియన్ జట్టు తూర్పు నందాదేవి వైపు, తూర్పు ముఖంలో మధ్య స్తంభం ద్వారా మంచి పురోగతి సాధించింది. సెప్టెంబరు 9 నుండి 18 వరకు సుదీర్ఘమైన చెడు వాతావరణం కారణంగా వారు శిబిరాల వద్ద కూచోవలసి వచ్చింది. అప్పుడు నందాదేవిపై ఇటలీ జట్టులో విషాదం నెలకొంది. యాత్ర నాయకుడు మార్కో డల్లా లాంగా ఆకస్మికంగా మరణించాడు. అతను సెప్టెంబరు 24 న కోమా స్ట్రోక్‌తో మరణించాడు. బృంద వైద్యుడు, అది సెరిబ్రల్ ఎడెమా అని అనుమానించారు. లాంగా యువకుడు, ఫిట్‌గా ఉన్నాడు. అప్పటి వరకు యాత్రలో ఎటువంటి ఆరోగ్య సమస్యలేవీ ఏర్పడలేదు. సెప్టెంబరు 27 నుండి మొత్తం యాత్రను ముగించుకుని విమానంలో మున్సియారికి, మరుసటి రోజు ఢిల్లీకి విమానంలోనూ తరలించారు.

2019 జూన్ 27 న (తూర్పు నందాదేవికి మొదటి పోలిష్ యాత్ర జరిగిన 80వ వార్షికోత్సవం సందర్భంగా) పోలిష్ యాత్ర సభ్యులు - జరోస్లావ్ గావ్రిసియాక్, వోజ్సీచ్ ఫ్లాజిస్కీలు తూర్పు నందాదేవి ను అధిరోహించారు.

నందాదేవి జాతీయ వనం, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ వనం

[మార్చు]

నందాదేవి జాతీయ వనంతో పాటు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జాతీయ వనం హిమాలయాల్లోని అత్యంత అద్భుతమైన అరణ్య ప్రాంతాలు. భారతదేశంలోని రెండవ ఎత్తైన పర్వతం తూర్పు నందాదేవి, నందాదేవి శిఖరాలకు పక్కన ఉంది. ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టమైన కారణంగా ఈ వనంలో ఎవ్వరూ నివసించడం లేదు. అంచేతా దాదాపు చెక్కుచెదరకుండా ఉంది. ఇక్కడ చాలా వైవిధ్యమైన వృక్షసంపద కలిగి ఉంది. అనేక అంతరించిపోతున్న క్షీరదాలకు ఇది ఆవాసం. వాటిలో మంచు చిరుత, సెరో, హిమాలయన్ కస్తూరి జింక, భరల్ లు ఉన్నాయి. నందాదేవి జాతీయ వనం తూర్పు ఉత్తరాఖండ్‌లో, గఢ్వాల్ హిమాలయాలలో, ఢిల్లీకి ఈశాన్యంగా 300 కి.మీ. దూరంలో, టిబెట్ సరిహద్దుకు సమీపంలో ఉంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "High Asia I: The Karakoram, Pakistan Himalaya and India Himalaya (north of Nepal)". Peaklist.org. Retrieved 2014-05-28.
  2. Corrected DEM files for the Himalaya
  3. Garhwal-Himalaya-Ost, 1:150,000 scale topographic map, prepared in 1992 by Ernst Huber for the Swiss Foundation for Alpine Research, based on maps of the Survey of India.
  4. The Himalayan Index gives the coordinates of Nanda Devi as 30°22′12″N 79°58′12″E / 30.37000°N 79.97000°E / 30.37000; 79.97000.
  5. Harish Kapadia, "Nanda Devi", in World Mountaineering, Audrey Salkeld, editor, Bulfinch Press, 1998, ISBN 0-8212-2502-2, pp. 254–257.
  6. Srimad Bhagvatam
  7. Tenzing Norgay and James Ramsey Ullman Tiger of the Snows/Man of Everest
  8. "AAC Publications - Asia, India-Garhwal, Nanda Devi East Attempt and Tragedy". publications.americanalpineclub.org. Retrieved 2021-11-20.
  9. "The worst mountain disaster in British history". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2021-11-19. Retrieved 2021-11-20.