ముకుల్ రాయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముకుల్ రాయ్
ముకుల్ రాయ్


శాసనసభ్యుడు
పదవీ కాలం
2 మే 2021 – ప్రస్తుతం
ముందు అబానీ మోహన్ జోఆర్దర్
నియోజకవర్గం కృష్ణానగర్ ఉత్తర్

పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, చైర్మన్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
14 జులై 2021
నియమించిన వారు బిమన్ బెనర్జీ
ముందు శంకర్ సింఘా

క్యాబినెట్ మంత్రి, భారత ప్రభుత్వం
పదవీ కాలం
20 మార్చ్ 2012 – 21 సెప్టెంబర్ 2012
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
ముందు దినేష్ త్రివేది
తరువాత సి. పి. జోషి

రైల్వేశాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
19 మే 2011 – 12 జులై 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్
నియోజకవర్గం పశ్చిమ బెంగాల్
పదవీ కాలం
2009 - 2011
ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్

పదవీ కాలం
3 ఏప్రిల్ 2006 – 11 అక్టోబర్ 2017
తరువాత అబీర్ బిస్వాస్

వ్యక్తిగత వివరాలు

జననం (1954-04-17) 1954 ఏప్రిల్ 17 (వయసు 70)[1]
కంచరపరా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్(1998–2017)
( జూన్ 2021 నుండి ప్రస్తుతం)
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ (until 1998)
భారతీయ జనతా పార్టీ (2017–2021)
జీవిత భాగస్వామి కృష్ణ రాయ్
సంతానం సుబ్రాన్షు రాయ్
నివాసం న్యూఢిల్లీ
కోల్‌కాతా
పూర్వ విద్యార్థి కలకత్తా యూనివర్సిటీ
మదురై కామరాజ్ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

ముకుల్ రాయ్ పశ్చిమ బెంగాల్ కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో రైల్వేశాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ముకుల్ రాయ్ యూత్ కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1998లో స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒక్కడు. ఆయన 2001లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. ముకుల్ రాయ్ 2006లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2009లో రేవులు, నౌకాయానం, జలరవాణా శాఖ మంత్రిగా, రైల్వేశాఖ సహాయ మంత్రిగా అనంతరం 20 మార్చి 2012 నుండి 21 సెప్టెంబర్ 2012 వరకు రైల్వేశాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పని చేశాడు.

ముకుల్‌ రాయ్‌ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుండి ఆరేళ్లపాటు బహిష్కరణకు గురయ్యాడు.[2] ఆయన తనపై పార్టీ వేటు వేసిన మరుక్షణమే రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ముకుల్‌ రాయ్‌ 2017 నవంబరులో భారతీయ జనతా పార్టీ లో చేరి బీజేపీ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[3] ఆయన 2017, 2021లో జరిగిన అసీంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున కృష్ణానగర్ (ఉత్తర) నియోజకవర్గం నుండి పోటీ చేసి వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. ముకుల్ రాయ్ 2021 జూన్ 11న బీజేపీని వీడి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Detailed Profile – Shri Dinesh Trivedi – Members of Parliament (Lok Sabha) – Who's Who – Government: National Portal of India". India.gov.in. 12 December 1977. Retrieved 24 February 2012.
  2. Sakshi (25 September 2017). "తృణమూల్‌ షాక్‌.. ఆ ఎంపీపై ఆరేళ్ల నిషేధం". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  3. Sakshi (4 November 2017). "బీజేపీలోకి ముకుల్‌ రాయ్‌". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.
  4. 10TV (11 June 2021). "బీజేపీకి బిగ్ షాక్..టీఎంసీలో చేరిన ముకుల్ రాయ్" (in telugu). Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)
  5. Eenadu (11 June 2021). "సొంతగూటికి ముకుల్‌ రాయ్‌". Archived from the original on 14 March 2022. Retrieved 14 March 2022.