ముచికుందుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒక గుహ వద్ద ముచికుందునికి దర్శనమిస్తున్న మహా విష్ణువు

ముచికుందుడు లేదా ముచుకుందుడు ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు. మాంధాత కుమారుడు. అంబరీషుడు ఇతనికి సోదరుడు అవుతాడు. ఇక్ష్వాకు వంశాన్నే సూర్యవంశం అని కూడా అంటారు. హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘు చక్రవర్తి, శ్రీరాముడు కూడా సూర్యవంశానికి చెందిన రాజులు.

రాక్షసులతో యుద్ధం[మార్చు]

ఇతడు దేవతలకు మరియు రాక్షసులకు జరిగిన యుద్ధంలో దేవతలకు సహాయము చేశాడు. దేవతలు వరము కోరుకొమ్మన్నారు. ఇతడు మిక్కిలి అలసిపోవుటచే నిద్రవచ్చుచున్నది. కావున నిద్ర పోవాలని తన నిద్రాభంగమెవ్వరేని చేసిన వారిని చూడగనే భస్మము కావలెనని కోరెను. ఇతడొక గుహలో నిదురించెను. ఆ గుహలోనికే కాలయవనుడు అనే రాక్షసుడు వచ్చి ఇతనిని చూచి కృష్ణుడని భ్రమించి తన్నాడు. ముచికుందుడు లేచి వానిని చూడగా వాడు భస్మమైపోయాడు.

మూలాలు[మార్చు]

  • పూర్వగాథాలహరి, వేమూరి శ్రీనివాసరావు, వేంకట్రామ అండ్ కో., ఏలూరు, 2007.