ముచ్చిమిల్లి
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ముచ్చిమిల్లి ఇది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మున్సిపాలిటీ లోని ఒక వార్డు.
సువర్చలాసమేత సన్మోహనాంజనేయ స్వామి వారి దేవాలయం
[మార్చు]చాలా అరుదైన శ్రీ సువర్చలాసమేత సన్మోహనాంజనేయ స్వామి వారి దేవాలయాలలో ఒక దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని తూర్పుగోదావరి జిల్లా లోని, రామచంద్రపురం పట్టణం లోని ముచ్చిమిల్లి గ్రామంలో ఉంది. ఈ దేవాలాయాన్ని 1952 సంవత్సరంలో గ్రామస్థులు, భక్తులు సహకారంతో శ్రీమాన్ సుదర్శనం నారాయణాచార్యులు గారిచే ప్రతిష్ఠించబడింది. నాటినుండి స్థానిక చెల్లూరి వంశీయులు ఆధ్వర్యంలోని "హనుమత్సేవా సంఘం" స్వామి వారి క్రుపతో భక్తుల సహకారంతో దేవాలయ నిర్వహణ చేస్తోంది. ప్రతీ సంవత్సరం స్వామి వారికి పుష్యమాసంలో వచ్చు బహుళ ఏకాదశి రోజున "కళ్యాణోత్సవం" నిర్వహించడం ఇక్కడ విశేషం. 2012 సంవత్సరం .ఫిబ్రవరి 6 న వార్షిక కళ్యణ మహొత్సవం జరిగింది. ప్రస్తుతం దేవాలయం జనావాసానికి దూరంగా ఉండటం, ఇతరత్రా కొన్ని అననుకూల పరిస్థితులవల్ల ఈ దేవాలయాన్ని జనావాసానికి దగ్గరగా తరలించే ఉద్దేశంతో కొత్త దేవాలయం నిర్మాణంలో ఉంది.
మూలాలు
[మార్చు]యితర లింకులు
[మార్చు]దేవాలయాలు