ముడి బియ్యము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముడి బియ్యము

దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రదేశంలో సాధారణంగా అందరూ తినే ముఖ్యమైన ఆహారం వరి బియ్యం. అంటే దానిలోని పోషక విలువల గురించీ ఆలోచించం. సాధారణంగా అందరూ ఆలోచించేది అన్నం అందంగా, తెల్లగా, విడివిడిలాడుతూ కనబడుతోందా లేదా అని మాత్రమే. అయితే కంటికి ఇంపుగా అన్నాన్ని తయారుచేస్తే అందులో ఉన్న పోషక విలువలు పోతున్నాయి. ముడి బియ్యం (దంపుడు బియ్యం) తో వండిన అన్నం కంటికి ఇంపుగా ఉండదు.[1] కానీ ఒంటికి మాత్రం కచ్చితంగా మంచిది. బియ్యాన్ని పాలిష్ చేసి, ఆకర్షణీయంగా చేసే పద్ధతిలో అందులోని జీవ పదార్థం, ఆరోగ్య రక్షణకి ఎంతగానో అవసరమైన బీ-కాంప్లెక్స్ విటమిన్లు పోతున్నాయి. అయితే పట్టణాలలో దంపుడు బియ్యం దొరకడం కష్టం. పాలిష్ చెయ్యని గోధుమలతో తయారైన బ్రౌన్ బ్రెడ్ మాత్రం దొరుకుతోంది. దాని విలువని ప్రజలు గుర్తిస్తున్నారు.[2][3]

ముడిబియ్యంతో ప్రయోజనాలు

[మార్చు]

గోధుమరంగు బియ్యంలో ఉన్న సెలీనియం పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుందని తెలుస్తుంది. బియ్యంలో పెద్ద మొత్తంలో ఉన్న పీచు, జీర్ణవాహికలో క్యాన్సర్ కారక రసాయనాలను బయటకు పంపుతుంది, ఈ రకంగా పెద్ద ప్రేగు క్యాన్సర్ నుండి కాపాడుతుంది. గోధుమ రంగు బియ్యంలో ఉండే ఫైటోన్యూట్రిఎంట్ లిగ్నాన్ రొమ్ము క్యాన్సర్, గుండెజబ్బులను అడ్డుకోవడంలో సహాయపడుతుంది. వయసు మళ్ళిన మహిళలపై జరిపిన అధ్యయనంలో ముడి బియ్యాన్ని తినడం వలన ఎంటరోల్యాక్టోన్ స్థాయిని పెంచుతుందని, దీని వలన రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని తెలుస్తుంది.[4][5]

ముడి బియ్యపు ఊకనుండి లభ్యమయ్యే నూనె, కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుందని పేరు పొందింది. ముడిబియ్యంలో ఉండే పీచు కూడా ఎల్ డి ఎల్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పీచు సమృద్ధిగా ఉండటం వలన ముడిబియ్యం గుండె జబ్బులు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. టె౦పుల్ విశ్వవిద్యాలయంలోని పరిశోధకులు ముడిబియ్యం తిన్నందున రక్తపోటును తగ్గించటంతో పాటుగా ధమనులలో ఫలకం చేరే స్థాయిని తగ్గించి, గుండె జబ్బులు వృద్ది చెందకుండా కాపాడుతుందని కనుగొన్నారు.

ముడిబియ్యంలో పీచు సమృద్ధిగా ఉన్నందున, అదనపు క్యాలరీలు తీసుకోకుండా చూడటమే కాక ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉన్నట్లుగా అనిపించేట్టుగా చేసి ఎక్కువగా తినే అవకాశాలను తగ్గిస్తుంది. హార్వర్డ్ పరిశోధకుల అధ్యయనాలలో తేలిందేమిటంటే పీచు ఎక్కువగా ఉండే బియ్యం తినే మహిళల శరీర బరువు దాదాపుగా సాధారణంగా ఉంటుంది. పీచు సమృద్ధిగా ఉన్నందున జీర్ణవ్యవస్థకు ముడిబియ్యం ఎంతో ప్రయోజనకారి. ఇది ప్రేగులలో ఆరోగ్యకర కదలికలను ప్రోత్సహించి మలబద్దకాన్ని నివారిస్తుంది.

తినదగని పొట్టులో ఆఫ్రికన్ బియ్యం (విత్తన బియ్యం, మొలకెత్తుతుంది
అదే బియ్యం, పొట్టు (మొత్తం బ్రౌన్ రైస్) (రంగు రకాన్ని బట్టి మారుతుంది)
తెల్ల బియ్యాన్ని తయారు చేయడానికి దాదాపు అన్ని ఊక, క్రిములను తొలగించి అదే బియ్యం

ముడిబియ్యంలో ఉన్న పీచు రక్తంలో చక్కర స్థాయిని నియంత్రించి టైపు 2 రకం డయాబెటిస్ ను నిర్వహించడంలో సహాయం చేస్తుంది.

ఎముకల ఆరోగ్యాన్ని నిర్వహించడానికి అవసరమైన మెగ్నీషియం ముడిబియ్యంలో సమృద్ధిగా ఉంది. ఒక కప్పు ముడిబియ్యంలో దాదాపు 21% మెగ్నీషియం దొరుకుతుంది. మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి, వేరొక అత్యవసర పోషకం కాల్షియాన్ని గ్రహించడానికి కూడా అవసరం. ముడిబియ్యంలో మెగ్నీషియం సమృద్ధిగా ఉన్నందున, ఉబ్బసం వచ్చే లక్షణాలను తగ్గించడంలో సహాయం చేస్తుంది. అనేక అధ్యయనాలలో తేలిందేమిటంటే ముడిబియ్యం లోని మెగ్నీషియం ఉబ్బసంతో బాధపడే వారిలో దాని తీవ్రతను తగ్గిస్తుంది. ముడిబియ్యం లోని సెలీనియం కూడా ఉబ్బసానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది.

ముడిబియ్యం పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తుంది ఒక అమెరికా పత్రికలో జీర్ణాశయాంతర వైద్య శాస్త్రంపై ప్రచురించిన అధ్యయనం ప్రకారం ముడిబియ్యం వంటి కరగని పీచు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు స్త్రీలలో పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడే అవకాశాలను తగ్గించడంలో సహాయం చేస్తాయని తేలింది. ముడిబియ్యంలో ఆరోగ్యకరమైన నాడీవ్యవస్థకు అవసరమైన మాంగనీసు సమృద్ధిగా ఉంది. ఈ పోషకం కొవ్వు ఆమ్లాలు సంశ్లేషణ, కొలెస్ట్రాల్ ఉత్పత్తి చేయడం ద్వారా సెక్స్ హార్మోనుల ఉత్పత్తికి కూడా సహాయ పడుతుంది.

రోజుకు 3 సార్లు ధాన్యాహారం తీసుకోనవలసినదిగా సిఫార్సు చేయబడింది. ప్రతి ½ కప్పు ముడిబియ్యం ఈ మూడు కప్పులకు సమానం, కాబట్టి ముడిబియ్యం తినడం మీ రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చేందుకు మంచి మార్గమౌతుంది.[6][7][8][9]


మూలాలు

[మార్చు]
  1. Superstore, Sadda (2021-06-25). "Types of Rice - Know about Different Types of Rice". Sadda Online (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2021-12-28.
  2. "USDA ARS Online Magazine Vol. 50, No. 5".
  3. Manickavasagan, Annamalai (2017-08-22). Brown Rice. Springer. p. 33. ISBN 9783319590110.
  4. Nutrition, Center for Food Safety and Applied. "Metals - Arsenic in Rice and Rice Products".
  5. Agency, Food Standards. "Arsenic in rice - Food Standards Agency".
  6. Ware, Lauren (2012-03-14). "Dartmouth Medicine — Research raises concerns about arsenic in rice". Retrieved 2015-03-27.
  7. Consumer Reports (2014-01-11). "How much arsenic is in your rice?". Retrieved 2015-03-27.
  8. Sohn, Emily (2014-10-20). "Contamination: The toxic side of rice". Nature. 514 (7524): S62–S63. doi:10.1038/514S62a.
  9. Yandell, Kate (2014-10-04). "How Rice Overcomes Arsenic". Retrieved 2015-03-27.