అక్షాంశ రేఖాంశాలు: 16°16′20″N 80°16′46″E / 16.272321°N 80.279519°E / 16.272321; 80.279519

మునగపాడు (ఫిరంగిపురం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మునగపాడు, గుంటూరు జిల్లా, ఫిరంగిపురం మండలానికి చెందిన గ్రామం.

మునగపాడు
—  రెవిన్యూ గ్రామం  —
మునగపాడు is located in Andhra Pradesh
మునగపాడు
మునగపాడు
అక్షాంశరేఖాంశాలు: 16°16′20″N 80°16′46″E / 16.272321°N 80.279519°E / 16.272321; 80.279519
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ఫిరంగిపురం
ప్రభుత్వం
 - సర్పంచి కంచర్ల శాంతకుమారి
పిన్ కోడ్ 522 529
ఎస్.టి.డి కోడ్

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల

[మార్చు]
  • ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుచున్న కట్టా మానస, గంపా వంశీకృష్ణ, అండర్-17 విభాగంలో జాతీయ స్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎన్నికైనారు. డిసెంబరు/2013 మొదటి వారంలో కలకత్తాలో జరుగు జాతీయ స్థాయి అండర్-17, ఫుట్ బాల్ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున వీరు పాల్గొంటారు.[1]
  • ఈ పాఠశాలలో చదువుచున్న గౌసియా, షర్మిల, మానస, షమీనా అను నలుగురు విద్యార్థినులు, పల్లెటూరు బాలికలైనా బాలురకు దీటుగా ఫుట్ బాల్ క్రీడలో రాణిస్తామని బరిలోనికి దిగినారు. పాఠశాలలో ఈ క్రీడకు తగిన సదుపాయాలు లేకపోయినా, ఉన్న వనరులతోనే కసిగా సాధనచేసి అంచెలంచెలుగా రాణించుచూ, పల్లెనుండి ఢిల్లీకి వెళ్ళినారు. వీరు 2014, డిసెంబరు-26వ తేదీనాడు, గోవాలో, నేషనల్ స్కూల్ గేంస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్-19 జాతీయస్థాయి ఫుట్ బాల్ పోటీలకు ఎంపికైనారు. ఇంతకు ముందు వీరు పలు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని, మొదటి, రెండవ స్థానాలు పొందినారు. 2012లో జరిగిన ఇండో-నేపాల్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ టోర్నమెంటులో భారతదేశం తరఫున ఆడి, తమ ప్రతిభ కనబరచారు.
  • ఈ పాఠశాల విద్యార్థులు 2014, డిసెంబరు-19 నుండి 21 వరకు, అనంతపురంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్, రాష్ట్రస్థాయి ఫుట్ బాల్ పోటీలలో, తమ ప్రతిభ ప్రదర్శించి ప్రథమస్థానంలో నిలిచి, జాతీయస్థాయి పోటీలకు ఎంపికైనారు. 13 జట్లు పాల్గొన్న ఈ పోటీలలో వీరు విజేతగా నిలిచారు. ఈ విజయంతో వీరు, రాష్ట్రస్థాయిలో రెండుసార్లు ప్రథమ బహుమతి, రెండుసార్లు ద్వితీయ బహుమతి సాధించారు. 2015,జనవరి-1 నుండి 5 వరకు, కర్ణాటక రాష్ట్రంలోని బళ్ళారిలో నిర్వహించు జాతీయస్థాయి పోటీలలో ఈ పాఠశాలకు చెందిన మానస, మరియరాణి, ఖాదర్ జిలానీ, ఆంధ్రప్రదేశ్ జట్టు తరపున పాల్గొంటారు.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, షేక్ ఫాతిమూన్ బీ, సర్పంచిగా ఎన్నికైంది.

దర్శనీయప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ ఆంజనేయస్వామివారి దేవాలయం.

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు గుంటూరు(రూరల్), 18 నవంబరు, 2013. 2వ పేజీ.