Jump to content

మునవర్‌ఖాన్ 1

వికీపీడియా నుండి
మునవర్‌ఖాన్ 1
పరిపాలన1752–1792
మరణం1792
ఇంతకు ముందున్నవారుహిమాయత్‌ఖాన్
తరువాతి వారుఅలూఫ్‌ఖాన్
రాజకుటుంబముకర్నూలు నవాబులు
తండ్రిదావూద్ ఖాన్

మునవర్‌ఖాన్ 1 (మ.1792) కర్నూలు నవాబులలో రెండవ వారు. ఆయన కర్ణాటక యుద్ధాల సమయంలో జరిగిన కర్నూలు ముట్టడి వల్ల రాజ్యపాలనలోకి వచ్చారు.

రాజకీయ నేపథ్యం

[మార్చు]

మునవర్‌ఖాన్ 1 తండ్రి దావూద్ ఖాన్ 17వ శతాబ్దంలో కర్నూలు ప్రాంతాన్ని జాగీరుగా పొందగా, అతని అన్న హిమాయత్‌ఖాన్ దానికి నవాబుగా ప్రకటితుడయ్యారు. హిమాయత్ ఖాన్ 1748లో జరగిని కర్ణాటక నవాబు వారసత్వ వివాదంలో తలదూర్చి బ్రిటీష్ వారు, ఫ్రెంచి వారి నడుమ శిబిరాలు మారుస్తూ ఒక్కోసారి ఒక్కొక్కరికి సన్నిహితం కావడంతో ఫ్రెంచి సేనాని బుస్సీ 1750లో కర్నూలును ముట్టడించారు. ఈ ముట్టడిలో హిమాయత్ ఖాన్ బుస్సీ చేతిలో ఓటమి పాలుకావడంతో 1752లో అతని తమ్ముడైన మునవర్‌ఖాన్ 1ను నవాబును చేశారు.[1]

యుద్ధాలు

[మార్చు]

1755లో అప్పుడే మైసూరు సామ్రాజ్యంలోని సైనిక పదవుల్లో ఎదుగుతున్న సైనికనేత హైదర్ అలీ కర్నూలును ముట్టడించారు. ఈ యుద్ధంలో కర్నూలు ఓటమిపాలైంది. రాజ్యంలో తన హోదాను పెంపొందించుకుంటున్న హైదర్ ఈ యుద్ధం ద్వారా భారీ ఆర్థిక సంపత్తిని కోరి పొందారు. యుద్ధానంతరం నవాబు నుంచి రెండు లక్షలు కప్పంగా స్వీకరించారు. 1752లో రాజ్యాన్ని ఇప్పించడంతో ఫ్రెంచి వారికి ఆనుకూల్యతతో ఉన్న రాజ్యం ఈ యుద్ధంతో మైసూరు సామ్రాజ్యానికి సామంత రాజ్యమయ్యింది.

మరణం

[మార్చు]

మొత్తంగా 40 సంవత్సరాల పాటు రాజ్యాన్ని పరిపాలించి 1792లో మునవర్ ఖాన్ 1 మరణించాడు. ఆయన మరణానంతరం కుమారుడు ఆలూఫ్ ఖాన్ నవాబు అయ్యాడు.

మూలాలు

[మార్చు]
  1. వెంకట శివరావు, దిగవల్లి (1944). కథలు-గాథలు (కందనూరు నవాబు రాజరికం) (1 ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. pp. 127–140.


ఇంతకు ముందు ఉన్నవారు:
హిమాయత్‌ఖాన్
కర్నూలు నవాబులు
17521792
తరువాత వచ్చినవారు:
అలూఫ్‌ఖాన్