Jump to content

మురుగన్ విగ్రహం (బటు గుహలు)

వికీపీడియా నుండి
మురుగన్ విగ్రహం
முருகன் சிலை
బాటూ గుహల ప్రధాన ద్వారం వద్ద మురుగన్ విగ్రహం
ప్రదేశంబాటూ గుహలు,సెలంగూర్, మలేసియా
రకంవిగ్రహం
నిర్మాన పదార్థం250 టన్నుల స్టీలు కడ్డీలు, 1,550 ఘనపు మీటర్ల కాంక్రీటు, 300 లీటర్ల బంగారు పూత
ఎత్తు42.7 m (140 ft)
నిర్మాణం ప్రారంభం2004
పూర్తయిన సంవత్సరం2006
ప్రారంభ తేదీజనవరి 2006 (తైపూసం పండగ సందర్భంగా)
అంకితం చేయబడినదిమలేసియా తమిళులు, మలేసియా హిందువులు

మురుగన్ విగ్రహం (முருகன் சிலை) ఇది మలేసియా దేశంలోని బటుగుహలలో ఉన్న అతి పెద్ద హిందూ విగ్రహం [1] [2][3] ఇది ప్రపంచంలోని హిందూ దేవతల భారీ విగ్రహాలలో రెండవది. మలేసియాలో అతి ఎత్తైన విగ్రహం. దీని ఎత్తు 42.7 మీటర్లు (140 అడుగులు). ఇది బాటు గుహల అడుగు భాగాన గల శ్రీ ముగుగన్ కోవిల్ వద్ద ఉంది.[4] దీని నిర్మాణానికి 3 సంవత్సరాల కాలం పట్టింది. దీనిని జనవరి 2006 న "తైపూసం" పండగ సందర్భంగా ఆవిష్కరించారు.

ప్రాముఖ్యత

[మార్చు]
  • ఈ విగ్రహ నిర్మాణానికి మలేసియా 2.5 మిల్ రింగిట్ లను వ్యయం చేసింది.
  • 250 టన్నుల స్టీలు కడ్డీలు, 1,550 ఘనపు మీటర్ల కాంక్రీటు, 300 లీటర్ల బంగారు పూత లను ఈ విగ్రహానికి వినియోగించారు.
  • భారత దేశం నుండి 15 శిల్పాలు.
  • 100,000 మంది హిందువులు ప్రారంభ వేడుకలను వీక్షించారు.

ప్రఖ్యాత సంస్కృతి

[మార్చు]
  • ఈ విగ్రహాన్ని 2007 లో విడుదలైన భారతీయ చలన చిత్రం బిల్లాలో చూపించారు.

మూలాలు

[మార్చు]
  1. "Batu Caves Sri Subramaniar Swamy Devasthanam". Murugan.org. Archived from the original on 25 జూన్ 2012. Retrieved 15 February 2012.
  2. "Lord Murugan statue in Malaysia". Etawau.com. Archived from the original on 30 డిసెంబరు 2011. Retrieved 15 February 2012.
  3. "Thanneermalai Murugan: Second Tallest Lord Murugan statue in the world". Murugar.com. 1 February 2009. Archived from the original on 24 ఫిబ్రవరి 2012. Retrieved 15 February 2012.
  4. "BATU CAVES Kuala Lumpur". Etawau.com. Archived from the original on 24 ఫిబ్రవరి 2012. Retrieved 15 February 2012.

ఇతర లింకులు

[మార్చు]