ముర్ల ఎర్రయ్య రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముర్ల ఎర్రయ్య రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1978 – 1985
ముందు మట్ట రామచంద్రయ్య
తరువాత కుంజా బొజ్జి
నియోజకవర్గం భద్రాచలం నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1945
జీడిగుప్ప, వి.అర్.పురం మండలం, తూర్పు గోదావరి జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ సిపిఎం
నివాసం హైదరాబాద్

ముర్ల ఎర్రయ్య రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు భద్రాచలం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ముర్ల ఎర్రయ్య రెడ్డి ఆదివాసి హక్కుల సాధనకోసం, హక్కుల పరిరక్షణకోసం పోరాటాల చేసి అనేక భూ పోరాటాలు నిర్వహించి భూమిలేని ఆదివాసులకు వేలాది ఎకరాల భూములు ఇప్పించాడు. ఆయన సిపిఎం వివిధ హోదాల్లో పని చేసి 1972లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసి ఓడిపోయాడు. ముర్ల ఎర్రయ్య రెడ్డి 1978లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సీపీఎం తరపున భద్రాచలం నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ముర్ల ఎర్రయ్య రెడ్డి 1983లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (26 November 2018). "కంచుకోట పదిలమేనా..?". Archived from the original on 22 April 2022. Retrieved 22 April 2022.
  2. Sakshi (8 November 2018). "భద్రాచలంలో ఈసారి ఎవరు?". Archived from the original on 23 April 2022. Retrieved 23 April 2022.