Jump to content

ముషీర్ ఖాన్

వికీపీడియా నుండి
ముషీర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీముంబై, మహారాష్ట్ర, భారతదేశం
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుఎడమ చేయి ఆర్థోడాక్స్ స్పిన్
పాత్రఆల్ రౌండర్
బంధువులుసర్ఫరాజ్ ఖాన్ (సోదరుడు)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2022/23–ప్రస్తుతంముంబై క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ FC
మ్యాచ్‌లు 7
చేసిన పరుగులు 710
బ్యాటింగు సగటు 64.54
100లు/50లు 3/1
అత్యుత్తమ స్కోరు 203*
వేసిన బంతులు 414
వికెట్లు 7
బౌలింగు సగటు 25.14
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/11
క్యాచ్‌లు/స్టంపింగులు 5/–
మూలం: ESPNcricinfo, 2024 8 సెప్టెంబరు

ముషీర్ ఖాన్ (జననం 2005 ఫిబ్రవరి 27) ముంబై క్రికెట్ జట్టులో ఆడే భారత క్రికెటర్. ఆయన 2022 డిసెంబరు 27న 2022-23 రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు.[1][2] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఆల్ రౌండర్ గా, ఆయన 2024 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ భారత అండర్-9 క్రికెట్ జట్టులో సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[3][4][5][6][7][8]

డిసెంబరు 2023లో, ఆయన భారత అండర్-19 యువ జట్టు కోసం 2024 ఐసిసి అండర్-9 క్రికెట్ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యాడు.[9] ఆయన రెండు సెంచరీలు సాధించి టోర్నమెంట్ భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. మార్చి 2024లో, రంజీ ట్రోఫీ ఫైనల్లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడైన ముంబై బ్యాటర్ గా సచిన్ టెండూల్కర్ రికార్డును ముషీర్ బద్దలు కొట్టాడు.[10]

సెప్టెంబరు 2024లో, ఆయన బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో ఇండియా ఎతో తలపడిన ఇండియా బి తరఫున దులీప్ ట్రోఫీతో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్ లో ముషీర్ ఖాన్ తన మూడవ ఫస్ట్-క్లాస్ సెంచరీని కొట్టాడు.[11][12]

ప్రారంభ జీవితం

[మార్చు]

ముషీర్ ఖాన్ 2005లో ఉత్తరప్రదేశ్ లోని ఆజంగఢ్ లో జన్మించాడు. ఆయన ముంబై శివార్లలో పెరిగాడు. ఆయన తన బాల్యంలో ఎక్కువ భాగం ఆజాద్ మైదాన్ లో తన తండ్రి, కోచ్ నౌషాద్ ఖాన్ తో గడిపాడు.[13] ముషీర్ తోటి ముంబై బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు.

మూలాలు

[మార్చు]
  1. "Ranji Trophy third round: A sweet first for Saurashtra, Pandey special 200, Parag Shaw". ESPN Cricinfo. Retrieved 31 December 2023.
  2. "Musheer Khan Breaks Sachin Tendulkar's 29-year-old Record With Sparkling Century in Ranji Trophy Final - News18". www.news18.com (in ఇంగ్లీష్). Retrieved 2024-03-12.
  3. हिंदी, क्विंट (2023-12-19). "Musheer Khan IPL Auction 2024 Live Updates: मुशीर खान आईपीएल 2024 में अनकैप्ड, जानें नीलामी में क्या हुआ?". TheQuint (in హిందీ). Retrieved 2024-02-16.
  4. "Musheer Khan Reacts After Brother Sarfaraz Khan's Memorable Test Debut For India, Instagram Post Goes Viral". TimesNow (in ఇంగ్లీష్). 2024-02-16. Retrieved 2024-02-16.
  5. Devaji, Amarnath (2024-02-05). "'Won't be satisfied until we win World Cup' – Musheer Khan puts title glory over personal achievements". www.icc-cricket.com (in ఇంగ్లీష్). Retrieved 2024-02-16.
  6. "सरफराज ने वीडियो कॉल पर छोटे भाई मुशीर खान से की बात, आप भी हो जाएंगे इमोशनल, बीसीसीआई ने शेयर किया वीडियो". Hindustan (in హిందీ). Retrieved 2024-02-16.
  7. "Sarfaraz Khan-Musheer Khan: सही खेल रहा था ना... पिता-पत्नी मैदान पर, फिर सरफराज ने वीडियो कॉल पर किससे पूछी ये बात, VIDEO". आज तक (in హిందీ). 2024-02-16. Retrieved 2024-02-16.
  8. "Emotional father gets ready to watch youngest son Musheer Khan make his debut in U-19 Asia Cup; eldest son Sarfaraz in South Africa with India A". The Indian Express (in ఇంగ్లీష్). 2023-12-07. Retrieved 2024-02-16.
  9. "Uday Saharan will lead India in the 2024 U-19 World Cup". ESPNCricinfo. Retrieved 12 December 2023.
  10. "Musheer Khan breaks Sachin Tendulkar's record". SportsTiger. Retrieved 12 March 2024.
  11. "Musheer Khan hits his third First-Class century". SportsTiger. Retrieved 2024-09-05.
  12. "Musheer Khan gets out on 181 on his Duleep Trophy debut; missed a well-deserved 200". FantasKhiladi. Retrieved 2024-09-06.
  13. "Musheer Khan is the rising star of the Indian cricket as he plays in World Cup". awazthevoice.in (in ఇంగ్లీష్). Retrieved 2024-02-16.