Jump to content

ముష్ఫికర్ రహీమ్

వికీపీడియా నుండి
ముష్ఫికర్ రహీమ్
2018 లో ముష్ఫికర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ముష్ఫికర్ రహీమ్
పుట్టిన తేదీ (1987-05-09) 1987 మే 9 (వయసు 37)
బోగ్రా, బంగ్లాదేశ్
మారుపేరుMushi,[1] Musfiq[2]
ఎత్తు5 అ. 3[3] అం. (1.60 మీ.)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఆఫ్ బ్రేక్
పాత్రవికెట్-కీపర్-బ్యాటరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 41)2005 మే 26 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు2023 జూన్ 14 - Afghanistan తో
తొలి వన్‌డే (క్యాప్ 81)2006 ఆగస్టు 6 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 6 - పాకిస్తాన్ తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.15 (formerly 9)
తొలి T20I (క్యాప్ 6)2006 నవంబరు 28 - జింబాబ్వే తో
చివరి T20I2022 సెప్టెంబరు 1 - శ్రీలంక తో
T20Iల్లో చొక్కా సంఖ్య.15
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006, 2008–Rajshahi Division
2007Sylhet Division
2012Duronto Rajshahi, Nagenahira Nagas
2013Sylhet Royals
2015Sylhet Super Stars
2016కరాచీ కింగ్స్, Barisal Bulls
2017Rajshahi Kings
2018నంగన్‌హర్ లెపర్డ్స్
2019/20Khulna Tigers
2020Beximco Dhaka
2023Sylhet Strikers
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ట్వంటీ20 ఫక్లా
మ్యాచ్‌లు 86 251 102 134
చేసిన పరుగులు 5,553 7,257 1,500 8,218
బ్యాటింగు సగటు 38.29 37.21 19.48 38.76
100లు/50లు 10/26 9/45 0/6 16/40
అత్యుత్తమ స్కోరు 219* 144 72* 219*
క్యాచ్‌లు/స్టంపింగులు 110/15 217/54 42/30 177/23
మూలం: ESPNcricinfo, 2023 మార్చి 11

ముష్ఫికర్ రహీమ్ (జననం 1987 మే 9) బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వైస్ కెప్టెన్. అతను కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటరు, వికెట్ కీపరు.

ముష్ఫికర్ తన అంతర్జాతీయ కెరీర్‌ను, 2005లో 16 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌పై ప్రారంభించాడు. అతని కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్‌లో స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా ఆడించారు. తద్వారా లార్డ్స్ క్రికెట్ స్టేడియంలో ఆడిన అతి పిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. అతను బంగ్లాదేశ్ స్పిన్ దాడికి మద్దతుగా నిల్చిన సమర్థుడైన కీపరు. 2010లో భారత్‌తో జరిగిన టెస్టులో అతని ఖ్యాతి వచ్చింది. అతను 11,000 పరుగులు చేసి, 400+ అవుట్‌లు చేసిన వికెట్ కీపర్‌గా అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకడు.[4]

బంగ్లాదేశ్ మాజీ కోచ్ జామీ సిడాన్స్ ప్రకారం, ముష్ఫికర్ రహీమ్ బ్యాటింగ్ చాలా బహుముఖంగా ఉంట్యుంది. అతను టాప్ ఆర్డర్‌లో ఒకటి నుండి ఆరు వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అతన్ని బంగ్లాదేశ్ అభిమానులు "మిస్టర్ డిపెండబుల్" అని పిలుస్తారు. ప్రతి ఫార్మాట్‌లోనూ 1000+ పరుగులు చేసిన కొద్దిమంది కీపర్‌లలో ఒకడు.[5] అతను టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ తరపున అత్యధిక వ్యక్తిగత స్కోరరు.[6] టెస్టు క్రికెట్ చరిత్రలో రెండు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్.[7][8][9][10][11] టెస్టుల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ కూడా.[12] 150 అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచిన ఏకైక బంగ్లాదేశ్ ఆటగాడు ముష్ఫికర్.[13]

ప్రారంభ జీవితం

[మార్చు]

ముష్ఫికర్ రహీమ్ 1987 మే 9న బంగ్లాదేశ్‌లోని బోగ్రాలో మహబూబ్ హబీబ్, రహీమా ఖాతున్ దంపతులకు జన్మించాడు.[14] అతను బోగ్రా జిల్లా పాఠశాలలో తన మాధ్యమిక పాఠశాల విద్యను పూర్తి చేశాడు. క్రికెట్ ఆడుతూ, మధ్యలో జహంగీర్‌నగర్ విశ్వవిద్యాలయంలో చరిత్రను అభ్యసించాడు.[15] అతను, 2012లో మాస్టర్స్ డిగ్రీ పరీక్షలు రాశాడు. 2014లో జన్నతుల్ కిఫాయెత్ మొండిని వివాహం చేసుకున్నాడు[16] మొండి మహ్మదుల్లా భార్య జన్నతుల్ కౌసర్ మిష్తీ సోదరి. ముష్ఫికర్ రహీమ్‌కు, 2018లో మయన్ అనే కుమారుడు కలిగాడు.

అంతర్జాతీయ కెరీర్

[మార్చు]

ముష్ఫికర్ రహీమ్, 2005లో బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికయ్యాడు. ఇది బంగ్లాదేశ్ ఇంగ్లండ్‌లో చేసిన మొదటి పర్యటన. వారికి అక్కడ పరిస్తితులు కొత్త. సిరీస్ అంతటా సీమ్ బౌలింగును అసమాన బౌన్స్‌నూ ఎదుర్కొని బ్యాటర్లు కష్టపడ్డారు. ముష్ఫికర్ తన బ్యాటింగ్ శైలిని సన్నాహక మ్యాచ్‌లలో స్వీకరించాడు, విస్డెన్ ప్రకారం "ఎప్పుడూ ఆలస్యంగా, సూటిగా ఆడతాడు". సస్సెక్స్‌పై 63 పరుగులు చేసాడు. వార్మప్ మ్యాచ్‌లలో నార్తాంప్టన్‌షైర్‌పై 115 నాటౌట్ చేశాడు.[17]

మొదట్లో పార్ట్‌టైమ్ వికెట్ కీపర్‌గా జట్టులో పేరున్నప్పటికీ, వార్మప్ మ్యాచ్‌లలో అతని ప్రదర్శనలు లార్డ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌కు స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌గా కూడా ఎంపికయ్యేందుకు దారితీసింది. 17 ఏళ్ల ముష్ఫికర్ మొదటి ఇన్నింగ్స్‌లో 19 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ 108 పరుగులకే ఆలౌటైంది. రెండంకెల స్కోరు సాధించిన ముగ్గురు బ్యాట్స్‌మెన్‌లలో అతనొకడు. తన చీలమండ నొప్పితో, ఆ పర్యటనలో అతను ఇక ఆడలేదు.[18]

2006లో ఐదు వన్డేల కోసం జింబాబ్వేలో పర్యటించే బంగ్లాదేశ్ జట్టులో ముష్ఫికర్ రహీమ్‌ను తీసుకున్నారు. ఆల్ రౌండర్లు ఫర్హాద్ రెజా, షకీబ్ అల్ హసన్‌లతో పాటు జట్టులో చేరిన ముగ్గురు కొత్త వన్‌డే ఆటగాళ్లలో అతను ఒకడు.[19] అతను జింబాబ్వేపై హరారేలో తన తొలి అర్ధ సెంచరీని సాధించాడు.[20]

అతని మంచి ప్రదర్శన కారణంగా వెస్టిండీస్‌లో జరిగే ప్రపంచ కప్‌కు ఖలీద్ మషూద్ కంటే ముందుగా వికెట్-కీపర్‌గా ఎంపికయ్యేందుకు దారితీసింది.[21]

2007 జులైలో శ్రీలంకతో జరిగిన రెండో టెస్టుకు మషూద్ స్థానంలో ముష్ఫికర్ రహీమ్‌ను తీసుకున్నారు.[22] బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 90 తేడాతో ఓడిపోయింది.మహ్మద్ అష్రాఫుల్‌తో కలిసి ముష్ఫికర్ రహీం ఆరో వికెట్ భాగస్వామ్యానికి రికార్డు స్థాయిలో 191 పరుగులు చేసాడు.[23][24] 2007 డిసెంబరులో, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ముష్ఫికర్ రహీమ్‌కు ఒక సంవత్సరం గ్రేడ్ B (మూడవ శ్రేణి) కాంట్రాక్ట్‌ను మంజూరు చేసింది. ఆ సమయంలో బోర్డ్‌ చేసుకున్న 22 సెంట్రల్ కాంట్రాక్ట్‌లలో ఇది ఒకటి.[25]

2007 ICC క్రికెట్ ప్రపంచ కప్ తరువాత, ముష్ఫికర్ రహీమ్ పేలవమైన ఫామ్‌ ఎదుర్కొన్నాడు. ఐదు ఇన్నింగ్స్‌లలో అతను మొత్తం నాలుగు పరుగులు చేశాడు.[26] ఫలితంగా, దక్షిణాఫ్రికా మూడు వన్‌డేల కోసం మార్చిలో పర్యటించినప్పుడు, మరుసటి నెలలో బంగ్లాదేశ్, ఐదు వన్‌డేల కోసం పాకిస్తాన్‌కు వెళ్లినప్పుడు, ముష్ఫికర్ రహీమ్‌ను తీసేసి ధీమన్ ఘోష్‌ను తీసుకున్నారు.[27]

ముష్ఫికర్‌ను పాకిస్తాన్, భారత్‌లతో ట్రై-సిరీస్‌కు, 2008 ఆసియా కప్‌కూ జట్టులోకి తిరిగి తీసుకున్నారు.[28] 2009 ఏప్రిల్లో 17 కాంట్రాక్టులను ప్రకటించినపుడు, ముష్ఫికర్ రహీమ్ కాంట్రాక్టును పునరుద్ధరించారు.[29] ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ మొదటి ఎంపిక 'కీపర్‌గా గుర్తింపు పొందాడు.

పదవీ విరమణ

[మార్చు]

స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ ముష్ఫికర్ రహీమ్ 2022 సెప్టెంబరు 4 న T20Iలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక వన్డేలు, టెస్టులపై దృష్టి పెడతానని నొక్కి చెప్పాడు. ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం కావడానికి నెల రోజుల ముందు ముష్ఫికర్ రహీమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.[30]

అంతర్జాతీయ సెంచరీల జాబితా

[మార్చు]

ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ తరపున మొదటి టెస్టు డబుల్ సెంచరీ సాధించాడు, [31] [32] టెస్టు మ్యాచ్‌లలో తొమ్మిది సందర్భాలలోను, వన్‌డేలలో తొమ్మిది సందర్భాలలోనూ సెంచరీలు సాధించాడు.

ముష్ఫికర్ రహీమ్ చేసిన టెస్టు సెంచరీలు [33]
No. స్కోర్ ప్రత్యర్థులు వేదిక Date Result Ref
1 101  భారతదేశం జోహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చటోగ్రామ్ 17 January 2010 బంగ్లాదేశ్ ఓడిపోయింది [34]
2 200  శ్రీలంక గాలే అంతర్జాతీయ స్టేడియం, గాలే 8 March 2013 డ్రా [35]
3 116  వెస్ట్ ఇండీస్ అర్నోస్ వేల్ స్టేడియం, కింగ్‌స్టౌన్ 5 September 2014 బంగ్లాదేశ్ ఓడిపోయింది [36]
4 159  న్యూజీలాండ్ బేసిన్ రిజర్వ్, వెల్లింగ్టన్ 12 January 2017 బంగ్లాదేశ్ ఓడిపోయింది [37]
5 127  భారతదేశం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం, హైదరాబాద్ 9 February 2017 బంగ్లాదేశ్ ఓడిపోయింది [38]
6 219  జింబాబ్వే షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 11 November 2018 బంగ్లాదేశ్ గెలిచింది [39]
7 203 నాటౌట్  జింబాబ్వే షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 22 February 2020 బంగ్లాదేశ్ గెలిచింది [40]
8 105  శ్రీలంక జోహుర్ అహ్మద్ చౌదరి స్టేడియం, చటోగ్రామ్ 15 May 2022 డ్రా [41]
9 175 నాటౌట్  శ్రీలంక షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 23 May 2022 బంగ్లాదేశ్ ఓడిపోయింది [42]
10 126  ఐర్లాండ్ షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 4 April 2023 బంగ్లాదేశ్ గెలిచింది [43]
One Day International centuries scored by Mushfiqur Rahim[44]
No. Score Opponents Venue Date Result Ref
1 101  జింబాబ్వే Harare Sports Club, Harare 16 August 2011 Bangladesh lost [45]
2 117  భారతదేశం Khan Shaheb Osman Ali Stadium, Fatullah 26 February 2014 Bangladesh lost [46]
3 106  పాకిస్తాన్ షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 17 April 2015 Bangladesh won [47]
4 107  జింబాబ్వే షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 7 November 2015 Bangladesh won [48]
5 110 not out  దక్షిణాఫ్రికా De Beers Diamond Oval, Kimberly 15 October 2017 Bangladesh lost [49]
6 144  శ్రీలంక Dubai International Cricket Stadium, Dubai 15 September 2018 Bangladesh won [50]
7 102 not out  ఆస్ట్రేలియా Trent Bridge, Nottingham 20 June 2019 Bangladesh lost [51]
8 125  శ్రీలంక షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం, ఢాకా 25 May 2021 Bangladesh won [52]
9 100 not out  ఐర్లాండ్ Sylhet International Cricket Stadium, Sylhet 20 March 2023 No result [53]

రికార్డులు, విజయాలు

[మార్చు]
  • 2020 ఫిబ్రవరిలో, జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో, ముష్ఫికర్ అజేయంగా 203 పరుగులు చేసి, టెస్టు క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన మొదటి బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.[54] 2018 నవంబరులో అదే జట్టుపై రెండు టెస్టు డబుల్ సెంచరీలు నమోదు చేసిన తొలి వికెట్ కీపర్‌గా నిలిచాడు. [55] అతను తన ఇన్నింగ్స్‌ను 219 * పరుగులతో ముగించాడు, ఇది టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మన్ చేసిన అత్యధిక వ్యక్తిగత స్కోరు . [11] ఇన్నింగ్స్ సమయంలో క్రీజులో 589 నిమిషాలు గడిపిన 421 బంతులు ఎదుర్కొన్నారు, ఇది ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా రికార్డు. [56]
  • 2018 నవంబరులో ముష్ఫికర్, టెస్టుల్లో 4,000 పరుగులు చేసిన రెండో బంగ్లాదేశ్ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. [57]
  • 2022 జనవరిలో వార్షిక ICC అవార్డులలో, అతను 2021 సంవత్సరానికి ICC పురుషుల వన్‌డే టీమ్ ఆఫ్ ది ఇయర్‌లో స్థానం పొందాడు.[58]

క్రమశిక్షణా సమస్యలు

[మార్చు]

బంగబంధు T20 కప్ ఎలిమినేటర్‌లో ముష్ఫికర్ రహీమ్, నసుమ్ అహ్మద్‌ ఇద్దరూ ఒకే క్యాచ్‌ కోసం ప్రయత్నించిన సంఘటన తర్వాత, నసుమ్‌ను కొట్టడానికి ప్రయత్నించాడు. ఫీల్డర్లిద్దరూ ఢీకొనకుండా తప్పించుకోగా, ముష్ఫికర్ రహీమ్ క్యాచ్ పట్టాడు. బెక్సిమ్‌కో ఢాకా కెప్టెన్‌గా ఉన్న ముష్ఫికర్ రహీమ్, అతని సహచరుడిపై కోపగించి, కొడతానని బెదిరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో, ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది. [59] ముష్ఫికర్ రహీమ్ అతని సహచరుడికి క్షమాపణలు చెప్పాడు. BCB ముష్ఫికర్ రహీమ్‌కు అతని మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించి, అతనికి ఒక డీమెరిట్ పాయింట్‌ను జారీ చేసింది. [60]

మూలాలు

[మార్చు]
  1. "Mushi enters 4k club". Daily Observer. 1 December 2018. Archived from the original on 8 జూన్ 2021. Retrieved 8 June 2021.
  2. "Bangladesh lose Mushfiq". Prothom Alo. 23 July 2015. Retrieved 6 January 2021.
  3. হাসান, মেহেদী. "ইরফান 'টাওয়ার' দেখার দিন..." Prothomalo (in Bengali). Retrieved 8 February 2023.
  4. "Outcry over Mushfiq's captaincy". Prothom Alo. 9 October 2017. Retrieved 17 April 2021.
  5. "We are not just about Ashraful anymore – Jamie Siddons". Khondaker Mirazur Rahman, ESPNcricinfo. 3 January 2010. Retrieved 22 September 2011.
  6. "RECORDS / BANGLADESH / TEST MATCHES / HIGH SCORES". ESPNcricinfo. Retrieved 8 June 2021.
  7. "Mushfiq first ever to score two double tons as keeper in Test history". Dhaka Tribune. 12 November 2018. Retrieved 17 April 2021.
  8. "Mushfiqur double tops legends". Cricket Australia. 13 November 2018. Retrieved 17 April 2021.
  9. "Bangladesh's Mushfiqur Rahim Becomes First Ever Wicketkeeper To Hit Two Double Centuries In Test Cricket". Outlook. 13 November 2018. Retrieved 17 April 2021.
  10. "An innings of true merit". The Daily Star (Bangladesh). 13 November 2018. Retrieved 8 June 2021.
  11. 11.0 11.1 "Twitter explodes as Mushfiqur Rahim races to second Test double-century in Dhaka". CricTracker. 12 November 2018. Retrieved 12 November 2018.
  12. "Third double 'the easiest'". The Daily Star (Bangladesh). 25 February 2020. Retrieved 17 April 2021.
  13. "150 int'l wins for Mushfiqur Rahim". Bdcrictime (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-05-26.{{cite web}}: CS1 maint: url-status (link)
  14. "Mushfiqur Rahim profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. Retrieved 9 May 2022.
  15. "Education matters for Mahmudullah". Daily Sun. 26 February 2011. Archived from the original on 14 July 2012. Retrieved 19 April 2012 – via Priyo.com.
  16. "Mushfiqur Rahim marries Jannatul Kifayet". The New Nation. 26 September 2014. Archived from the original on 14 November 2020. Retrieved 13 November 2020.
  17. "Bangladesh tour of England at Northampton, May 20-22 2005".
  18. Miller, Andrew (19 September 2006), England v Bangladesh 2005, Wisden Cricketers' Almanack, retrieved 14 February 2011
  19. Cricinfo staff (20 July 2006), Whatmore: 'Bangladesh are favourites', Cricinfo, retrieved 9 November 2010
  20. "Mushfiqur Rahim Profile".
  21. Mashud disappointed with lack of communication, Cricinfo, 29 September 2008, retrieved 22 September 2011
  22. Thawfeeq, Sa'adi (2 July 2007), Mushfiqur replaces Mashud for second Test, Cricinfo, retrieved 24 September 2011
  23. Austin, Charlie (18 March 2009), Sri Lanka v Bangladesh 2007, Wisden Cricketers' Almanac, retrieved 14 February 2011
  24. Austin, Charlie (18 March 2009), Second Test: Sri Lanka v Bangladesh 2007, Wisden Cricketers' Almanac, retrieved 14 February 2011
  25. Bangladesh board releases contracted players' list, Cricinfob, 6 December 2007, retrieved 22 September 2011
  26. Bangladesh drop Rahim for the one-dayers, ESPNcricinfo, 4 March 2008, retrieved 24 September 2011
  27. "Bangladesh drop Rahim for the one-dayers".
  28. Mushfiqur recalled to one-day side, ESPNcricinfo, 27 May 2008, retrieved 25 September 2011
  29. Saleh and Sajidul not handed contracts, Cricinfo, 11 April 2009, retrieved 22 September 2011
  30. "Mushfiqur Rahim, former Bangladesh captain, announces retirement from T20Is". MSN (in Indian English). Retrieved 2023-02-22.
  31. Ashraful, Mushfiqur in tremendous partnership, ESPNcricinfo, retrieved 10 March 2013
  32. Miller, Andrew, England v Bangladesh 2005, Wisden Cricketers' Almanack, retrieved 14 February 2011
  33. "Statistics / Statsguru / Mushfiqur Rahim / Test matches". ESPNcricinfo. Retrieved 20 October 2018.
  34. "1st Test, India tour of Bangladesh at Chattogram, Jan 17-21 2010", ESPNCricinfo, retrieved 9 November 2018
  35. "1st Test, Bangladesh tour of Sri Lanka at Galle, Mar 8-12 2013", ESPNCricinfo, retrieved 9 November 2018
  36. "1st Test, Bangladesh tour of West Indies at Kingstown, Sep 5-9 2014", ESPNCricinfo, retrieved 9 November 2018
  37. "1st Test, Bangladesh tour of New Zealand at Wellington, Jan 12-16 2017", ESPNCricinfo, retrieved 9 November 2018
  38. "Only Test, Bangladesh tour of India at Hyderabad, Feb 9-13 201", ESPNCricinfo, retrieved 9 November 2018
  39. "2nd Test, Zimbabwe tour of Bangladesh at Dhaka, Nov 11-15 2018", ESPNCricinfo, retrieved 9 November 2018
  40. "Only Test, Zimbabwe tour of Bangladesh at Dhaka, Feb 22-25 2020", ESPNCricinfo, retrieved 9 November 2018
  41. "1st Test, Chattogram, May 15 - 19, 2022, Sri Lanka tour of Bangladesh". ESPNcricinfo. Retrieved 19 May 2022.
  42. "1st Test, Chattogram, May 15 - 19, 2022, Sri Lanka tour of Bangladesh". ESPNcricinfo. Retrieved 23 May 2022.
  43. "1st Test, Dhaka, April 4 - 8, 2023, Ireland tour of Bangladesh". ESPNcricinfo. Retrieved 6 April 2022.
  44. "Statistics / Statsguru / Mushfiqur Rahim / One-Day Internationals". ESPNcricinfo. Retrieved 20 October 2018.
  45. "3rd ODI, Bangladesh tour of Zimbabwe at Harare, Aug 16 2011". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  46. "2nd Match (D/N), Asia Cup at Fatullah, Feb 26 2014". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  47. "1st ODI (D/N), Pakistan tour of Bangladesh at Dhaka, Apr 17 2015". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  48. "1st ODI (D/N), Zimbabwe tour of Bangladesh at Dhaka, Nov 7 2015". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  49. "1st ODI, Bangladesh tour of South Africa at Kimberley, Oct 15 2017". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  50. "1st Match, Group B, Asia Cup at Dubai, Sep 15 2018". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  51. "26th match, ICC Cricket World Cup at Nottingham, Jun 20 2019". ESPNcricinfo. Retrieved 22 June 2019.
  52. "1st ODI (D/N), Sri Lanka tour of Bangladesh at Dhaka, May 25 2021". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  53. "2nd ODI (D/N), Ireland tour of Bangladesh at Dhaka, March 20 2023". ESPNcricinfo. Retrieved 11 November 2018.
  54. "Musfiq records their double-ton". The Financial Express. 24 February 2020. Retrieved 17 December 2020.
  55. "Mushfiqur Double tops legends". Cricket Australia website. 13 November 2018. Retrieved 17 December 2020.
  56. "Mushfiqur devours records in historic innings". ESPNcricinfo. Retrieved 12 November 2018.
  57. "Mushfiqur becomes first Bangladesh man to 5000 Test runs". ESPNcricinfo. Retrieved 30 November 2018.
  58. "ICC Men's ODI Team of the Year revealed". International Cricket Council. Retrieved 21 January 2022.
  59. Satish, Prashanth (2020-12-14). "Twitter reacts as Mushfiqur Rahim loses cool and screams at teammate during Bangabandhu T20 Cup [Watch]". www.sportskeeda.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-25.
  60. "Mushfiqur Rahim apologises to Nasum Ahmed for misbehaving on the field; fined 25% of match fees". ESPNCricinfo. 15 December 2020.{{cite web}}: CS1 maint: url-status (link)