ముహమ్మద్ ఆలీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముహమ్మద్ అలీ (Muhammad Ali)
Muhammad Ali NYWTS.jpg
1967 లో ముహమ్మద్ ఆలీ
గణాంకాలు
ఇతర పేర్లుది గ్రేటెస్ట్
ది పీపుల్స్ ఛాంపియన్
ది లూస్విల్లే లిప్
Rated atహెవీ వెయిట్
ఎత్తు6 ft 3 in (1.91 m)
Reach80 in (203 cm)
జననము (1942-01-17) 1942 జనవరి 17 (వయస్సు: 77  సంవత్సరాలు)
లూస్విల్లే, కెంటకీ, అమెరికా
మరణము2016 జూన్ 3 (2016-06-03)(వయసు 74)
ఫీనిక్స్, ఆరిజోనా, అమెరికా
StanceOrthodox
బాక్సింగ్ రికార్డ్
పాల్గొన్న పోరాటాలు61
విజయాలు56
నాకౌట్ విజయాలు37
పరాజయాలు5
డ్రా లు0
No contests0

మహమ్మద్ అలీ విశ్వ విఖ్యాత బాక్సర్. మూడు సార్లు హెవీవెయిట్ బాక్సింగ్ ప్రపంచ విజేతగా నిలిచిన శక్తిశాలి. ఇతని అసలు పేరు క్లాషియస్ క్లే. తరువాత ఇస్లాం మతాన్ని స్వీకరించి తనపేరును మార్చుకున్నాడు. ఇతని కూతురు లైలా అలీ కూడా మహిళా విభాగంలో ప్రపంచ విజేత. ఇతను కొన్ని చిత్రాలలో కూడా నటించాడు.

జీవితవిశేషాలు[మార్చు]

ఇతడు 1942,జనవరి 17వ తేదీన కెంటకీలో జన్మించాడు. ఇతని అసలు పేరు కాసియస్ మార్సెలస్ క్లే జూనియర్. ఇతడు తన 12వ ఏట నుండి బాక్సింగ్ శిక్షణ పొందాడు. 1960లో రోమ్‌ ఒలింపిక్స్‌లో స్వర్ణపతకం సాధించడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. అదే సంవత్సరం ప్రొఫెషనల్‌గా మారి 21 సంవత్సరాల పాటు బాక్సింగ్‌లో తిరుగులేని విజయాలను సాధించాడు. ఇతడు 1964లో ఇస్లాం మతం స్వీకరించి తన పేరును ముహమ్మద్ అలీగా మార్చుకున్నాడు. తాను ఆచరించిన ధర్మం కోసం నేరుగా అమెరికా ప్రభుత్వంతోనే తలపడ్డాడు. అప్పటి నిబంధనల ప్రకారం ఆలీ కూడా సైన్యంలో చేరి వియత్నాం యుద్ధానికి వెళ్లాల్సి ఉండగా తాను నమ్మిన ఇస్లాం అమాయకులను చంపనీయదంటూ సైన్యంలో చేరడానికి వ్యతిరేకించాడు.దానితో అమెరికా ప్రభుత్వం అతని హెవీవెయిట్ టైటిల్స్ అన్నీ రద్దు చేసి అరెస్ట్ కూడా చేసి జైలుకు పంపింది. దీనిపై కోర్టులో పోరాటం తర్వాత ఇతడికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇతడు 1964లో సోంజి రాయ్‌ను, 1967లో బెలిండా బాయ్డ్‌ను,1977లో వెరోనికా పోర్షేను వివాహం చేసుకుని వారికి విడాకులు ఇచ్చి 1986లో లోనీ విలియమ్స్‌ను నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇతనికి తొమ్మిది మంది సంతానం. వీరిలో లైలా అలీ బాక్సర్ కాగా, హనా అలీ రచయిత్రిగా పేరు పొందింది.

సినిమాలలో[మార్చు]

అలీ జీవితం ఓ సినిమాకథ లాంటిది. అందుకే ఆయనపై హాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చాయి. కొన్నిటిలో తనపాత్ర తానే ధరించడం విశేషం. 1977లో తీసిన గ్రేటెస్ట్‌లో అలీ తనపాత్ర తానే పోషించి మెప్పించాడు. 2001లో తీసిన అలీ సినిమాలో విల్‌స్మిత్ మహమ్మదలీ పాత్ర వేస్తే ఆస్కార్ నామినేషన్ దక్కింది. హోవర్డ్ ఫాస్ట్ నవల ఆధారంగా 1979లో తీసిన ఫ్రీడంరోడ్‌లో అలీయే హీరో. ఆటలో మెడల్స్ లాగే ఇంకా కొంచెం గట్టిగా పట్టుబడితే ఆస్కార్ కూడా వచ్చేదేమో అంటారు. కొన్ని సినిమాలు ఇండియాలో కూడా విడుదలై బాగానే ఆడాయి. అందుకే ఎలాగైనా బాక్సింగ్ లెజెండ్‌ను బాలీవుడ్ సినిమాల్లోకి దించాలనే ఆలోచనలు కూడా జరిగాయి. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ 1980లలో లాస్ ఏంజిల్స్‌కు వెళ్లి మహమ్మద్ అలీని కలిశారు. ఆయన వెంట దర్శక నిర్మాత ప్రకాశ్ మెహ్రా కూడా ఉన్నారట. అలీని, తనను పెట్టి సినిమా తీయాలని మెహ్రా అనుకున్నారని బిగ్‌బీ ట్విట్టర్‌లో వెల్లడించారు. 1980లో ఇండియా వచ్చినప్పుడు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో ఎగ్జిబిషన్ ఫైట్ ఏర్పాటైంది. ఆ సందర్భంగా స్టేడియంకు వచ్చిన తమిళనాడు సినీ, పొలిటికల్ సూపర్‌స్టార్ ఎమ్జీ రామచంద్రన్‌తో అలీ చేతులు పైకెత్తినప్పుడు స్టేడియం హర్షధ్వానాలతో దద్దరిల్లడం చాలామంది ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు.[1]

బాక్సింగ్ ప్రస్థానము[మార్చు]

12వ ఏట బాక్సింగ్ లో శిక్షణ ప్రారంభించిన అలీ, 22 ఏళ్లకే ప్రపంచ హెవీ వెయిట్ ఛాంపియన్ గా ఎదిగారు. 1964లో దిగ్గజ బాక్సర్ సోనీలిస్టన్ పై గెలుపుతో ప్రపంచ ఛాంపియన్ గా మహ్మద్ అలీ నిలిచారు. తర్వాత ఇస్లాం మతం స్వీకరించి మహ్మద్ అలీగా పేరు మార్చుకున్నారు. 1967లోనూ హెవీవెయిట్ టైటిల్ సొంతం చేసుకున్నారు. 1964, 1974, 1978ల్లో ప్రపంచ హెవీవెయిట్ ఛాంపియన్ గా నిలిచారు.గొప్ప ఛాంపియన్ గా, మానవతావాదిగా పేరొందినప్పటికీ ఆయన కెరీర్ వివాదాస్పదంగా కొనసాగింది. 1967లో అమెరికా-వియత్నాం యుద్ధ సమయంలో అలీని అమెరికా ఆర్మీలో పనిచేయడానికి ఎంపిక చేశారు. కానీ, ఆర్మీ ఆఫర్ ను అలీ తిరస్కరించారు. శక్తివంతమైన అమెరికా కోసం పేద ప్రజలపై పోరాడనని తేల్చి చెప్పారు. మరికొన్ని వివాదాలతో అలీ బాక్సింగ్ టైటిల్ వదులుకున్నారు. ఐదేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించారు.

న్యాయ పోరాటం తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్ లోకి దిగిన మహ్మద్ అలీ 1974లో ఫ్రేజియర్ పై గెలుపొంది ఛాంపియన్ షిప్ సొంతం చేసుకున్నారు. ప్రపంచ ఛాంపియన్ షిప్ తో పాటు మరెన్నో పోటీల్లో అద్భుత విజయాలు సాధించారు. తన బాక్సింగ్ కెరీర్ లో ఐదుసార్లు మాత్రమే మహ్మద్ అలీ ఓటమి చవిచూశారు.[2]

56 విజయాలు (37 నాకౌట్స్, 19 ఫలితాలు), 5 పరాజయాలు (4 ఫలితాలు, 1 TKO), 0 డ్రాలు[3]
ఫలితము. రికార్డు ప్రత్యర్థి రకము రౌండ్, సమయము తేదీ వయస్సు ప్రాంతము ఇతర వివరాలు
ఓటమి 56-5 ట్రెవెర్ బెర్బిక్ ఫలితము (ఏకాభిప్రాయము) 10 (10) 01981-12-11 డిసెంబరు 11, 1981 39 years, 328 days నస్సావ్, బహమాస్ "డ్రామా ఇన్ ద బహమాస్"[4]
ఓటమి 56-4 లారీ హోమ్స్ TKO (Corner Stoppage) 10 (15) 01980-10-02 అక్టోబరు 2, 1980 38 years, 259 days లాస్ వెగాస్ వాలీ ది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్
చేజార్చుకున్నాడు. కానీ WBC ప్రపంచ హెవీవెయిట్ పోటీల విజేత
గెలుపు 56-3 లియోన్ స్పింక్స్ ఫలితము (ఏకాభిప్రాయము) 15 (15) 01978-09-15 సెప్టెంబరు 15, 1978 36 years, 241 days న్యూ ఓర్లియేన్స్ ది రింగ్ మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ పోటీల విజేత;
1979-09-06 న WBA టైటిల్ వదిలేశాడు
ఓటమి 55-3 లియోన్ స్పింక్స్ ఫలితము (విడిగా) 15 (15) 01978-02-15 ఫిబ్రవరి 15, 1978 36 years, 29 days లాస్ వెగాస్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ ఓడిపోయాడు.
గెలుపు 55-2 ఎర్నీ షేవర్స్ ఫలితము (ఏకాభిప్రాయము) 15 (15) 01977-09-29 సెప్టెంబరు 29, 1977 35 years, 255 days న్యూయార్క్ సిటీ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 54-2 అల్ఫ్రేడో ఎవాంజలిస్టా ఫలితము(ఏకాభిప్రాయము) 15 (15) 01977-05-16 మే 16, 1977 35 years, 119 days లాండ్ ఓవర్. మేరీ లాండ్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 53-2 కెన్ నార్టన్ ఫలితము(ఏకాభిప్రాయము) 15 (15) 01976-09-28 సెప్టెంబరు 28, 1976 34 years, 255 days ద బ్రాంక్స్, న్యూయార్క్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 52-2 రిచర్డ్ డన్ TKO 5 (15) 01976-05-24 మే 24, 1976 34 years, 128 days మ్యూనిచ్, పశ్చిమ జర్మనీ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 51-2 జిమ్మీ యంగ్ ఫలితము(ఏకాభిప్రాయము) 15 (15) 01976-04-30 ఏప్రిల్ 30, 1976 34 years, 104 days లాండ్ ఓవర్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 50-2 జీన్ పియర్రీ కూప్‌మాన్ KO 5 (15) 01976-02-20 ఫిబ్రవరి 20, 1976 34 years, 34 days సాన్ జువాన్, పూర్టోరికో ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 49-2 జో ఫ్రేజియర్ TKO 14 (15), 0:59 01975-10-01 అక్టోబరు 1, 1975 33 years, 257 days క్విజోన్ నగరము, ఫిలిప్పీన్స్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 48-2 జో బగ్నర్ ఫలితము(ఏకాభిప్రాయము) 15 (15) 01975-06-30 జూన్ 30, 1975 33 years, 164 days కౌలాలంపూర్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 47-2 రాన్ లైల్ TKO 11 (15) 01975-05-16 మే 16, 1975 33 years, 119 days లాస్ వెగాస్ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 46-2 చక్ వెప్నర్ TKO 15 (15), 2:41 01975-03-24 మార్చి 24, 1975 33 years, 66 days రిచ్‌ఫీల్డ్, ఓహియో ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 45-2 జార్జ్ ఫోర్మాన్ KO 8 (15), 2:58 01974-10-30 అక్టోబరు 30, 1974 32 years, 286 days కింషసా, జైర్ "ద రంబుల్ ఇన్ ది జంగిల్";
ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ విజేత
గెలుపు 44-2 జో ఫ్రేజియర్ ఫలితము (ఏకాభిప్రాయము) 12 (12) 01974-01-28 జనవరి 28, 1974 32 years, 11 days న్యూయార్క్ సిటీ "ఆలీ - ఫ్రేజియర్ II"
NABF హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు, 1974 లో వదిలేశాడు
గెలుపు 43-2 రూడీ లబ్బర్స్ ఫలితము(ఏకాభిప్రాయము) 12 (12) 01973-10-20 అక్టోబరు 20, 1973 31 years, 276 days జకార్తా
గెలుపు 42-2 కెన్ నార్టన్ ఫలితము (విడిగా) 12 (12) 01973-09-10 సెప్టెంబరు 10, 1973 31 years, 236 days ఇంగిల్ వుడ్, కాలిఫోర్నియా NABF హెవీవెయిట్ టైటిల్ విజేత.
ఓటమి 41-2 కెన్ నార్టన్ ఫలితము (విడిగా) 12 (12) 01973-03-31 మార్చి 31, 1973 31 years, 73 days శాండియాగో NABF హెవీవెయిట్ టైటిల్ ఓడిపోయాడు.
గెలుపు 41-1 జో బగ్నర్ ఫలితము(ఏకాభిప్రాయము) 12 (12) 01973-02-14 ఫిబ్రవరి 14, 1973 31 years, 28 days లాస్ వెగాస్
గెలుపు 40-1 బాబ్ ఫోస్టర్ KO 8 (12), 0:40 01972-11-21 నవంబరు 21, 1972 30 years, 309 days స్టాటెలీన్, నెవెడా NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 39-1 ఫ్లాయెడ్ పాటర్సన్ TKO 7 (12) 01972-09-20 సెప్టెంబరు 20, 1972 30 years, 247 days న్యూయార్క్ సిటీ NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 38-1 ఆల్విన్ లూయీస్ TKO 11 (12), 1:15 01972-07-19 జూలై 19, 1972 30 years, 184 days డబ్లిన్
గెలుపు 37-1 జెర్రీ క్వారీ TKO 7 (12), 0:19 01972-06-27 జూన్ 27, 1972 30 years, 162 days లాస్ వెగాస్ NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 36-1 జార్జ్ చువాలో ఫలితము(ఏకాభిప్రాయము) 12 (12) 01972-05-01 మే 1, 1972 30 years, 105 days వాంకోవర్ NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 35-1 మాక్ ఫోస్టర్ ఫలితము(ఏకాభిప్రాయము) 15 (15) 01972-04-01 ఏప్రిల్ 1, 1972 30 years, 75 days టోక్యో
గెలుపు 34-1 జర్గెన్ బ్లిన్ KO 7 (12), 2:12 01971-12-26 డిసెంబరు 26, 1971 29 years, 343 days జూరిచ్
గెలుపు 33-1 బస్టర్ మతిస్ ఫలితము (ఏకాభిప్రాయము) 12 (12) 01971-11-17 నవంబరు 17, 1971 29 years, 304 days హొస్టన్, టెక్సాస్ NABF హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 32-1 జిమ్మీ ఎలిస్ TKO 12 (12), 2:10 01971-07-26 జూలై 26, 1971 29 years, 190 days హూస్టన్, టెక్సాస్ NABF హెవీవెయిట్ టైటిల్ విజేత.
ఓటమి 31-1 జో ఫ్రేజియర్ ఫలితము (ఏకాభిప్రాయము) 15 (15) 01971-03-08 మార్చి 8, 1971 29 years, 50 days న్యూయర్క్ సిటీ "ఈ శతాబ్దపొ పోరాటము";
WBA మరియు WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్
కోసము
ది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ కోల్పోయాడు
గెలుపు 31-0 ఆస్కార్ బోనవేనా TKO 15 (15), 2:03 01970-12-07 డిసెంబరు 7, 1970 28 years, 324 days న్యూయార్క్ సిటీ ది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 30-0 జెర్రీ క్వారీ TKO 3 (15) 01970-10-26 అక్టోబరు 26, 1970 28 years, 282 days అట్లాంటా ది రింగ్ ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ నిలబెట్టుకున్నాడు.
Suspended
గెలుపు 29-0 జోరా ఫోలీ KO 7 (15), 1:48 01967-03-22 మార్చి 22, 1967 25 years, 64 days న్యూయార్క్ సిటీ ది రింగ్, WBC మరియు WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు;
04-28-1967 న ఈ టైటిల్స్ వదిలేశాడు.
గెలుపు 28-0 ఎర్నీ టెర్రెల్ ఫలితము (ఏకాభిప్రాయము) 15 (15) 01967-02-06 ఫిబ్రవరి 6, 1967 25 years, 20 days హూస్టన్, టెక్సాస్ ది రింగ్ మరియు WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు
WBA ప్రపంచ హెవీవెయిట్ టైటిల్ గెలుచుకున్నాడు.
గెలుపు 27-0 క్లెవెలాండ్ విలియమ్స్ TKO 3 (15) 01966-11-14 నవంబరు 14, 1966 24 years, 301 days హూస్టన్ ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 26-0 కార్ల్ మిల్డెన్‌బర్గర్ TKO 12 (15) 01966-09-10 సెప్టెంబరు 10, 1966 24 years, 236 days ఫ్రాంక్‌ఫర్ట్ ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 25-0 బ్రియాన్ లండన్ KO 3 (15) 01966-08-06 ఆగస్టు 6, 1966 24 years, 201 days లండన్ ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 24-0 హెన్రీ కూపర్ TKO 6 (15), 1:38 01966-05-21 మే 21, 1966 24 years, 124 days లండన్ ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 23-0 జార్జ్ చువాలో ఫలితము (ఏకాభిప్రాయము) 15 (15) 01966-03-29 మార్చి 29, 1966 24 years, 71 days టొరంటో ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 22-0 ఫ్లాయ్డ్ పాటర్సన్ TKO 12 (15), 2:18 01965-11-22 నవంబరు 22, 1965 23 years, 309 days లాస్ వెగాస్ ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 21-0 సొన్నీ లిస్టన్ KO 1 (15), 2:12 01965-05-25 మే 25, 1965 23 years, 128 days లెవిస్టన్ "ఆలీ vs. లిస్టన్ (II)"
ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ నిలబెట్టుకున్నాడు.
గెలుపు 20-0 సొన్నీ లిస్టన్ TKO 7 (15) 01964-02-25 ఫిబ్రవరి 25, 1964 22 years, 39 days మియామీ బీచ్, ఫ్లోరిడా "క్లే లిస్టన్ I",
ది రింగ్ & WBC ప్రపంచ హెవీవెయిట్ టైటిల్స్ విజేత.
;
06-19-1964 న WBA టైటిల్ వదిలేశాడు.
గెలుపు 19-0 హెన్రీ కూపర్ TKO 5 (10), 2:15 01963-06-18 జూన్ 18, 1963 21 years, 152 days లండన్
గెలుపు 18-0 డగ్ జోన్స్ ఫలితము (ఏకాభిప్రాయము) 10 (10) 01963-03-13 మార్చి 13, 1963 21 years, 55 days న్యూయార్క్ సిటీ
గెలుపు 17-0 చార్లీ పోవెల్ KO 3, 2:04 01963-01-24 జనవరి 24, 1963 21 years, 7 days పిట్స్‌బర్గ్
గెలుపు 16-0 అర్చీ మూర్ TKO 4 (10), 1:35 01962-11-15 నవంబరు 15, 1962 20 years, 302 days లాస్ ఎంజెలస్
గెలుపు 15-0 అలెగ్జాండ్రో లావొరంటే KO 5 (10), 1:48 01962-07-20 జూలై 20, 1962 20 years, 184 days లాస్ ఎంజెలస్
గెలుపు 14-0 బిల్లీ డానియేల్ TKO 7 (10), 2:21 01962-05-19 మే 19, 1962 20 years, 122 days న్యూయార్క్ సిటీ
గెలుపు 13-0 జార్జ్ లోగాన్ TKO 4 (10), 1:34 01962-04-23 ఏప్రిల్ 23, 1962 20 years, 96 days న్యూయార్క్ సిటీ
గెలుపు 12-0 డాన్ వార్నర్ TKO 4, 0:34 01962-03-28 మార్చి 28, 1962 20 years, 70 days మియామీ బీచ్
గెలుపు 11-0 సొన్నీ బాంక్స్ TKO 4 (10), 0:26 01962-02-10 ఫిబ్రవరి 10, 1962 20 years, 24 days న్యూయార్క్ సిటీ
గెలుపు 10-0 విల్లీ బెస్మనాఫ్ TKO 7 (10), 1:55 01961-11-29 నవంబరు 29, 1961 19 years, 316 days లూస్విల్లే, కెంటకీ
గెలుపు 9-0 అలెక్స్ మిటెఫ్ TKO 6 (10), 1:45 01961-10-07 అక్టోబరు 7, 1961 19 years, 263 days లూస్వెల్లీ
గెలుపు 8-0 అలోంజో జాన్సన్ ఫలితము (ఏకాభిప్రాయము) 10 (10) 01961-07-22 జూలై 22, 1961 19 years, 186 days లూస్విల్లే
గెలుపు 7-0 డూక్ సెబెడాంగ్ ఫలితము (ఏకాభిప్రాయము) 10 (10) 01961-06-26 జూన్ 26, 1961 19 years, 160 days లాస్ వెగాస్
గెలుపు 6-0 లామార్ క్లార్క్ KO 2 (10), 1:27 01961-04-19 ఏప్రిల్ 19, 1961 19 years, 92 days లూస్విల్లే
గెలుపు 5-0 డానీ ఫ్లీమాన్ TKO 7 (8) 01961-02-21 ఫిబ్రవరి 21, 1961 19 years, 35 days మియామీ బీచ్
గెలుపు 4-0 Jజిమ్‌ రాబిన్సన్ KO 1 (8), 1:34 01961-02-07 ఫిబ్రవరి 7, 1961 19 years, 21 days మియామీ బీచ్
గెలుపు 3-0 టోనీ ఎస్పెర్టీ TKO 3 (8), 1:30 01961-01-17 జనవరి 17, 1961 19 years, 0 days మియామీ బీచ్
గెలుపు 2-0 హెర్బ్ సిలెర్ KO 4 (8) 01960-12-27 డిసెంబరు 27, 1960 18 years, 345 days మియామీ బీచ్
గెలుపు 1-0 టన్నీ హన్‌సెకెర్ ఫలితము (ఏకాభిప్రాయము) 6 (6) 01960-10-29 అక్టోబరు 29, 1960 18 years, 286 days లూస్విల్లే

మరణం[మార్చు]

ఇతడు పార్కిన్సన్స్ మరియు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతూ 2016, జూన్ 4వ తేదీన అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[5]

మూలాలు[మార్చు]

  1. మహాబలి నిష్క్రమణ.
  2. 'ది గ్రేటెస్ట్' అలీ కన్నుమూత
  3. "Muhammad Ali – Boxer". Boxrec.com. Retrieved September 5, 2011. Cite web requires |website= (help)
  4. Steen, Rob (October 29, 2006). "Obituary: Trevor Berbick". The Guardian. UK. Retrieved September 25, 2011.
  5. సాక్షి దినపత్రిక, 5 జూన్,2016, 16వ పేజీ ఫోకస్

బయటి లింకులు[మార్చు]