ముహమ్మద్ యూనుస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ముహమ్మద్ యూనుస్ (జననం 28 జూన్ 1940) బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బ్యాంకర్, ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు. ఆయన 8 ఆగస్టు 2024 నుండి బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నాడు.[1][2]

ముహమ్మద్ యూనుస్ ఆయన సూక్ష్మఋణాలు ఇచ్చే "గ్రామీణ్ బ్యాంకు" కోసం 2006లో నోబెల్ శాంతి బహుమతిను గెలుచుకున్నారు.[3][4][5]

జననం, విద్యాభ్యాసం

[మార్చు]

ముహమ్మద్ యూనుస్ 1940లో బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌లో జన్మించాడు. ఆయన ఢాకా విశ్వవిద్యాలయం నుండి ఉన్నత విద్యను పూర్తి చేసి అనంతరం వాండర్‌బిల్ట్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రాన్ని అభ్యసించడానికి ఫుల్‌బ్రైట్ స్కాలర్‌షిప్ అందుకొని 1969లో వాండర్‌బిల్ట్ నుండి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ చేశాడు. ముహమ్మద్ యూనుస్ పీహెచ్‌డీ పూర్తి చేసిన తరువాత మిడిల్ టేనస్సీ స్టేట్ యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కొంత కలం పని చేసి బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చి చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగానికి అధిపతిగా పని చేశాడు. [6][7]

వృత్తి

[మార్చు]

1974 బంగ్లాదేశ్ కరువు తర్వాత నలభై రెండు కుటుంబాలకు సూక్ష్మఋణాలు ఇచ్చాడు. సూక్ష్మఋణాలు అంటే చిన్న అప్పులు, సాధారణంగా మామూల అప్పులు తీసుకోలేని వాళ్లకు, చాల్ల సారులు మహిళలకు ఇచ్చిన అప్పులు. 1983లో ఆయన సూక్ష్మరుణ వ్యవస్థ గ్రామీణ్ బ్యాంకు అయింది. 2006లో ఆయన సూక్ష్మఋణాలకు నోబెల్ శాంతి బహుమతిను గెలుచుకున్నాడు. 2011లో, అయన వయసు మూలంగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం యూనుస్‌ని గ్రామీణ్ బ్యాంకుకి రాజీనామా చేపించింది.

2024 బంగ్లాదేశీ నిరసనలు తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా పనిచేస్తున్నాడు.

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (8 August 2024). "బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ సారధిగా బాధ్యతలు స్వీకరించిన యూనస్". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  2. Alam (8 August 2024). "Nobel laureate Muhammad Yunus takes oath as head of Bangladesh's interim government" (in Indian English). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  3. "The Nobel Peace Prize 2006". 2006. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  4. Eenadu (8 August 2024). "బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వ సారథిగా యూనస్‌ ప్రమాణ స్వీకారం". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  5. NT News (8 August 2024). "బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రధానిగా నేడు యూనస్‌ ప్రమాణం". Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  6. "Who is Muhammad Yunus, the Nobel laureate set to head Bangladesh's interim govt?". 8 August 2024. Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.
  7. The Hindu (7 August 2024). "Watch: Who is Muhammad Yunus, Bangladesh's interim PM?" (in Indian English). Archived from the original on 8 August 2024. Retrieved 8 August 2024.