మూడవ విష్ణువర్ధనుడు
మూడవ విష్ణువర్ధనుడు, వేంగి సామ్రాజ్యాన్ని సా.శ. 719 నుండి 755 వరకు 36 సంవత్సరాల పాటు పాలించిన తూర్పు చాళుక్య రాజు. అతను మంగి యువరాజు కుమారుడు. అతను సమస్త భువనాశ్రయ, త్రిభువనాంకుశ, విషమసిద్ధి అనే బిరుదులు స్వీకరించాడు.
మూడవ విష్ణువర్ధనుడు, తన బంధువులైన పశ్చిమ చాళుక్యులతో కలిసి పల్లవులను ఓడించి, వేంగి రాజ్యానికి సరిహద్దులలో ఉన్న బోయ కొట్టములను తన రాజ్యంలో కలుపుకున్నాడు. అలాగే పశ్చిమ చాళుక్యులు కూడా పల్లవ భూభాగాన్ని తమ రాజ్యంలో కలుపుకున్నారు. సా.శ. 730 లో అధికారానికి వచ్చిన పల్లవ రాజు రెండవ నరసింహవర్మ, తన రాజ్యాన్ని తిరిగి సంపాదించడం కోసం, అశ్వమేధయాగం చేసి, గుర్రం వెంట రక్షణగా ఉదయచంద్రుడనే తన ప్రతినిధిని పంపించాడు. మూడవ విష్ణువర్ధనుడికి సామంతులుగా ఉన్న బోయ ప్రభువులు ఆ అశ్వాన్ని అడ్డగించగా ఉదయచంద్రుడు వారిని ఓడించి పారదోలాడు. ఆ విధంగా మూడవ విష్ణువర్ధనుడి కాలంలో తూర్పు చాళుక్యులు బోయ రాజ్యంపై తమ ఆధిపత్యాన్ని కోల్పోయారు.[1] సుమారు మరో వంద సంవత్సరాల తరువాత గుణగ విజయాదిత్యుని కాలంలో గానీ ఆ రాజ్యం తిరిగి తూర్పు చాళుక్యుల వశం కాలేదు.
అధికారం కోసం పోరు
[మార్చు]రెండవ జయసింహుని మరణం తరువాత, అతని సవతి తమ్ముళలో పెద్దవాడిగా అధికారం చేపట్టవలసిన వాడు. కానీ అతని తమ్ముడు కొక్కిలి అతన్ని తరిమేసి, అధికారాన్ని చేపట్టాడు. అయితే 6 నెలల్లోనే మూడవ విష్ణువర్ధనుడు తమ్ముడిని తరిమేసి అధికారం చేపట్టాడు. తూర్పు చాళుక్య వంశంలో అధికారం కోసం అంతర్గత కలహాలు మొదలైన సందర్భం ఇది.[2]
అంతకు ముందువారు కొక్కిలి |
తూర్పు చాళుక్యులు సా.శ, 719 - 755 |
తరువాత వారు మొదటి విజయాదిత్యుడు |
మూలాలు
[మార్చు]- ↑ నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 75.
{{cite book}}
: CS1 maint: date and year (link) - ↑ నేలటూరి, వెంకటరమణయ్య (1950). The Eastern Calukyas of Vengi. మద్రాసు: వేదం వెంకటరాయ శాస్త్రి & బ్రదర్స్. p. 68.
{{cite book}}
: CS1 maint: date and year (link)