Jump to content

మూలిక

వికీపీడియా నుండి

ఔషధముల తయారీ కొరకు ఉపయోగించే వృక్ష భాగమును మూలిక అంటారు. మూలిక యొక్క బహువచనం మూలికలు. ముఖ్యంగా వీటిని నాటు వైద్యంలో ఉపయోగిస్తారు. ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క భాగం, లేదా కొన్ని భాగాలు, లేదా మొత్తం భాగం మూలికగా ఉపయోగపడుతుంది. ఎక్కువగా మూలికలను చెట్ల వేర్ల నుంచి సేకరిస్తారు. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్నప్పటికి మూలికలను ఉపయోగిస్తూనే ఉన్నారు. మూలికల వలన సైడ్ ఎఫెక్ట్‌లు రావని నమ్ముతారు. చెట్లకు మూలమైన వేర్ల నుంచి మూలికలను ఎక్కువగా సేకరిస్తారు కాబట్టి దీనికి మూలిక అని పేరు వచ్చినది. కొందరు నాటు వైద్యులు మూలికలను అడవులలో తిరిగి సేకరిస్తారు. వాటిని దంచి పొడులుగా, లేదా లేపనంగా విక్రయిస్తారు. మూలికల మందు విక్రయించే నాటు వైద్యులు వారు సేకరించిన మూలికలను కూడా ప్రదర్శిస్తారు. మూలికలతో తయారు చేసిన ఔషధములలో కొన్ని చప్పరించేవి, మింగేవి, త్రాగేవి ఉంటాయి, అలేగే లేపనంగా పూసుకునేవీ ఉంటాయి. మూలికలను రుచి కొరకు తేనె వంటి వాటితో రంగరించి లేపనంగా తయారు చేస్తారు, అందువలన మూలికల ఔషధంలో తీపిదనం వస్తుంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఔషధ మొక్క

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మూలిక&oldid=4345660" నుండి వెలికితీశారు