Jump to content

మృత్తికలు

వికీపీడియా నుండి
(మృత్తిక నుండి దారిమార్పు చెందింది)

మానవుడి అవసరాలను తీర్చే సహజ వనరుల్లో నేలలు లేదా మృత్తికలు ముఖ్యమైనవి. భూ ఉపరితలంలోని సారవంతమైన సన్నటి పొరే నేల. వ్యవసాయాభివృద్ధిలో నేలలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. కాబట్టి వృక్షసంపద, పంటల ఉత్పత్తికీ తద్వారా సకల ప్రాణుల జీవనానికి మృత్తిక అవసరం. ఇది గతిశీలమైన ప్రకృతి వనరు.

రకాలు

[మార్చు]

నేలలు లేదా మృత్తికల అధ్యయన శాస్త్రాన్ని పెడాలజీ అనీ మృత్తికా నిర్మాణ ప్రక్రియను పెడోజెనిసిస్ అని అంటారు. స్వభావం, రంగు, వాటి రసాయన ధర్మాలను ఆధారంగా చేసుకుని భారత వ్యవసాయ పరిశోధన మండలి భారతదేశంలో నేలలను 8 రకాలుగా విభజించింది.[1] అవి

  1. ఒండలి నేలలు: ఇవి భారతదేశంలో దాదాపు 45 శాతం ఆక్రమించి ఉన్నాయి. నేలలన్నింటిలోకి అత్యంత సారవంతమైనవి. నదులు తెచ్చే అవక్షేప పదార్థాలు నిక్షేపితం కావడంతో ఏర్పడ్డాయి.
  2. నల్లరేగడి నేలలు: ఇవి బసాల్ట్ శిలలు విచ్ఛిన్నం కావడం వల్ల ఏర్పడతాయి. వీటికి నలుపు రంగు రావడానికి కారణం అందులో కరిగే ఉండే ఇనుము, మెగ్నీషియం ఆక్సైడ్ లు. ఇవి మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్ లోని దక్షిణ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి. వీటినే స్థానికంగా రేగడి నేలలు అనికూడా అంటారు.
  3. ఎర్ర నేలలు: గ్రానైట్, నీస్ లాంటి శిలలు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడ్డాయి. ఇవి ఎర్రగా ఉండటానికి ప్రధాన కారణం అందులో కరిగి ఉండే ఫెర్రిక్ ఆక్సైడ్ లు
  4. లేటరైట్ నేలలు: లేటర్ అంటే ఇటుక అని అర్థం. ఇవి ఇటుక రంగులో ఉండటం వల్ల ఆ పేరు వచ్చింది.
  5. శుష్క, ఎడారి నేలలు: ఇవి భారతదేశ వాయువ్య ప్రాంతంలోని శుష్క, అర్థ శుష్క ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. నిస్సారమైన నేలలు కావడంతో వ్యవసాయానికి వీలుపడదు.
  6. పర్వత ప్రాంత నేలలు: దేశంలోని శుష్క, అర్థ శుష్క ప్రాంతాల్లో ఉన్న సోడియం, కాల్షియం, మెగ్నీషియం లవణాలతో కూడిన చవుడు నేలలను క్షార మృత్తిక నేలలు అంటారు.
  7. లవణీయ, క్షార మృత్తిక నేలలు
  8. బురద, జీవ సంబంధ నేలలు

మృత్తికా క్రమక్షయం

[మార్చు]

క్రమక్షయ కారకాలైన ప్రవహించే నీరు, గాలి, హిమానీ నదాలు, మానవులు, జంతువుల కార్యకలాపాల వల్ల మెత్తని, సారవంతమైన మృత్తిక పైపొర కొట్టుకొని పోవడాన్ని మృత్తికా క్రమక్షయం అని అంటారు. విచక్షణా రహితంగా అడవులను నరికివేయడం, అధిక వర్షపాతం, తరచు సంభవించే వరదలు, అతి వేగంగా వీచే గాలులు, అతి పశుగ్రాసం మొదలైనవి మృత్తికా క్రమక్షయానికి ప్రధాన కారణాలు.

రకాలు

[మార్చు]
  1. పట క్రమక్షయం
  2. వంక క్రమక్షయం
  3. అవనాళికా క్రమక్షయం

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు ప్రతిభ వ్యాసం, అక్టోబర్ 6, 2009