మెట్టు శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మెట్టు శ్రీనివాస్‌

పదవీ కాలం
2022 మార్చి 23 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జననం 1971
వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు సీపీఎం పార్టీ
నివాసం శివనగర్‌, ఖిలావరంగల్‌

మెట్టు శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2022 మార్చి 23న తెలంగాణ రాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితుడై[1],[2] ఏప్రిల్ 3న భాద్యతలు స్వీకరించాడు.[3]

జననం, విద్యాభాస్యం[మార్చు]

మెట్టు శ్రీనివాస్ 1971లో తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, ఖిలావరంగల్, శివనగర్‌ లో జన్మించాడు. ఆయన 1991 కాకతీయ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎకనామిక్స్‌ పూర్తి చేశాడు. ఆయన అనంతరం మహబూబాబాద్‌ ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో మూడేళ్లు లెక్చరర్‌గా పని చేశాడు.[4]

రాజకీయ జీవితం[మార్చు]

మెట్టు శ్రీనివాస్ 1991 కాకతీయ విశ్వవిద్యాలయంలో సీపీఎం అనుబంధ విద్యార్థి సంఘం ఎస్‌ఎఫ్‌ఐ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 1997 నుంచి 2015 వరకు సీపీఎం వరంగల్‌ నగర కార్యదర్శిగా 18 ఏండ్లు సుదీర్ఘకాలం పని చేసి, అనంతరం ఆరేండ్లు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించాడు. మెట్టు శ్రీనివాస్ వరంగల్‌ తూర్పు నియోజకవర్గం నుండి సీపీఎం అభ్యర్థిగా 1999, 2009, 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు.[5]

మెట్టు శ్రీనివాస్‌ మేధావులు, బీసీ ఉద్యమకారులతో ఏర్పడిన బీసీ సబ్‌ ప్లాన్‌ సాధన కమిటీ ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు. ఆయన 2017 మార్చి 20న మెట్టు శ్రీనివాస్‌ రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. మెట్టు శ్రీనివాస్‌ ఆ తరువాత టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శిగా నియమితుడై వివిధ జిల్లాల్లో శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎన్నికల్లో ఇన్‌చార్జిగా, 2021లో వరంగల్‌ రూరల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వాలు, కమిటీల ఇన్‌చార్జిగా పని చేశాడు. ఆయనను 2022 మార్చి 23న తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[6] ఆయన ఏప్రిల్ 3న భాద్యతలు స్వీకరించాడు.[7]

మూలాలు[మార్చు]

  1. Eenadu (24 March 2022). "రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్‌". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  2. Namasthe Telangana (24 March 2022). "మూడు కార్పొరేషన్లకు చైర్మన్లు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  3. Namasthe Telangana (3 April 2022). "కష్టపడి పనిచేసే వారిని సీఎం కేసీఆర్ గుర్తిస్తారు". Retrieved 3 April 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  4. Namasthe Telangana (24 March 2022). "మనోళ్లకు చైర్మన్‌ పదవులు". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  5. Andhra Jyothy (24 March 2022). "సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్న మెట్టు శ్రీనివాస్‌". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  6. Prabha News (23 March 2022). "3 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం". Archived from the original on 24 March 2022. Retrieved 24 March 2022.
  7. Namasthe Telangana (4 April 2022). "మెట్టు శ్రీనివాస్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రముఖుల హాజరు". Archived from the original on 4 April 2022. Retrieved 4 April 2022.