Jump to content

మెట్‌పల్లి రెవెన్యూ డివిజను

వికీపీడియా నుండి
మెట్‌పల్లి రెవెన్యూ డివిజను
దేశంభారతదేశం
రాష్ట్రంతెలంగాణ
జిల్లాజగిత్యాల

మెట్‌పల్లి రెవెన్యూ డివిజను, తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లాలోని ఒక పరిపాలనా విభాగం. జగిత్యాల జిల్లాలోవున్న మూడు రెవెన్యూ డివిజన్లలో ఇది ఒకటి. ఈ డివిజను పరిపాలనలో 3 మండలాలు ఉన్నాయి.[1] ఈ డివిజను ప్రధాన కార్యాలయం మెట్‌పల్లిలో ఉంది. 2016, అక్టోబరు 11న రాష్ట్రంలోని జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఆధారంగా రెవెన్యూ డివిజను పరిధి సవరించబడింది.[2] ఈ రెవెన్యూ డివిజను నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గంలోని, కోరుట్ల శాసనసభ నియోజకవర్గాల పరిధిలో భాగంగా ఉంది.

వివరాలు

[మార్చు]

ఐఏఎస్ క్యాడర్‌లో సబ్ కలెక్టర్ లేదా డిప్యూటి కలెక్టర్ హోదాలో ఉన్న రెవెన్యూ డివిజనల్ అధికారి ఈ రెవెన్యూ విభాగానికి ఆఫీసర్ గా ఉంటాడు. తహశీల్దార్ కేడర్‌లోని అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పరిపాలనలో సహాయం చేస్తాడు. కలెక్టరేట్‌, మండల రెవెన్యూ విభాగాల మధ్య అనుసంధానంగా ఈ డివిజను పరిపాలనా వ్యవహారాలలో పనిచేస్తుంటుంది.[3]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం ఈ రెవెన్యూ డివిజన్ లో మొత్తం 1,93,321 జనాభా ఉంది. ఇందులో 94540 మంది పురుషులు, 98781 మంది స్త్రీలు ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

మెట్‌పల్లి డివిజనులోని మండలాలు:[4]

క్ర.సం మెట్‌పల్లి రెవెన్యూ డివిజను మండలంలోని రెవెన్యూ గ్రామాల సంఖ్య
1 మెట్‌పల్లి మండలం 19 రెవెన్యూ గ్రామాలు
2 మల్లాపూర్ మండలం 21 రెవెన్యూ గ్రామాలు (3 నిర్జన గ్రామాలు)
3 ఇబ్రహీంపట్నం మండలం 15 రెవెన్యూ గ్రామాలు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "District Census Handbook - Krishna" (PDF). Census of India. pp. 14–17. Retrieved 2022-04-02.
  3. "Administrative Setup | Karimnagar | India". Archived from the original on 2021-11-06. Retrieved 2022-04-02.
  4. "జగిత్యాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2022-04-02.