మెరిసే మెరిసే
స్వరూపం
మెరిసే మెరిసే | |
---|---|
దర్శకత్వం | పవన్ కుమార్ కె. |
నిర్మాత | వెంకటేష్ కొత్తూరి |
తారాగణం | దినేష్ తేజ్, శ్వేతా అవస్తి |
నిర్మాణ సంస్థలు | కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎల్‌ఎల్‌పి |
పంపిణీదార్లు | పీవీఆర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 6 ఆగస్టు 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
మెరిసే మెరిసే 2021లో రూపొందిన తెలుగు సినిమా.[1] కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై వెంకటేష్ కొత్తూరి నిర్మించిన ఈ సినిమాకు పవన్ కుమార్ కె. దర్శకత్వం వహించాడు. దినేష్ తేజ్, శ్వేతా అవస్తి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 6 ఆగస్టు 2021న విడుదలైంది.[2]
చిత్ర నిర్మాణం
[మార్చు]మెరిసే మెరిసే సినిమా షూటింగ్ 2020లో ప్రారంభమైంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను దర్శకుడు తరుణ్ భాస్కర్ 18 సెప్టెంబర్ 2020న విడుదల చేశాడు.[3] మెరిసే మెరిసే టీజర్‌ను 6 ఫిబ్రవరి 2021న దర్శకుడు శివ నిర్వాణ విడుదల చేశాడు.[4]ఈ సినిమాలోని కనులతో రచించు లిరికల్ సాంగ్ ను హీరో శ్రీవిష్ణు 20 నవంబర్ 2020న,[5] నిన్నే నేనిలా లిరికల్ సాంగ్ ను 24 డిసెంబర్ 2020న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- దినేష్ తేజ్
- శ్వేతా అవస్తి
- సంజయ్ స్వరూప్
- గురురాజ్
- సంధ్య జనక్
- బిందు
- మని
- శశాంక్
- నానాజీ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎల్‌ఎల్‌పి
- నిర్మాత: వెంకటేష్ కొత్తూరి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పవన్ కుమార్ కె.
- సంగీతం: కార్తీక్ కొడగండ్ల
- సినిమాటోగ్రఫీ: నగేష్ బన్నెల్
మూలాలు
[మార్చు]- ↑ Andrajyothy (4 November 2020). "'మెరిసే మెరిసే'". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ Sakshi (18 July 2021). "థియేటర్లలో మెరిసే మెరిసే, అప్పుడే రిలీజ్!". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ Sakshi (20 September 2020). "ప్రేమ మెరిసే". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ Telangana Today (6 February 2021). "'Merise Merise' looks visually good: Siva Nirvana". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
- ↑ EENADU (21 November 2020). "ప్రేమ మెరిసే." Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.