మెహమూద్ (నటుడు)
మెహమూద్ అలీ | |
---|---|
జననం | బాంబే, బాంబే ప్రెసిడెన్సీ, బ్రిటిష్ రాజ్ (ప్రస్తుతం ముంబై) | 1932 సెప్టెంబరు 29
మరణం | 2004 జూలై 23 డన్మోర్, పెన్సిల్వేనియా, అమెరికా | (వయసు 71)
వృత్తి |
|
పిల్లలు | 7, పక్కి అలీ, లక్కీ అలీ, మాకీ అలీ, గిన్నీ అలీ |
తల్లిదండ్రులు | ముంతాజ్ అలీ (తండ్రి) |
బంధువులు | మీనా కుమారి (కోడలు) |
మెహమూద్ అలీ (1932 సెప్టెంబరు 29 - 2004 జూలై 23) ఒక భారతీయ నటుడు, గాయకుడు, దర్శకుడు. సినీ నిర్మాత కూడా అయిన ఆయన హిందీ చిత్రాలలో హాస్య పాత్రలు పోషించడంలో ప్రసిద్ధి చెందాడు.[1][2][3]
నాలుగు దశాబ్దాల తన కెరీర్‌లో 300 పైచిలుకు హిందీ చిత్రాలలో నటించాడు. ఆయన జాతీయ హాస్యనటుడిగా గుర్తింపు పొందాడు.[2][4] మెహమూద్ ఫిల్మ్‌ఫేర్ అవార్డులకు 25, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎ కామిక్ రోల్ కి 19 నామినేషన్లు అందుకున్నాడు. ఈ అవార్డులు 1954లో ప్రారంభం కాగా ఉత్తమ హాస్యనటుడి విభాగంలో అవార్డులు 1967లో మొదలయ్యాయి. అంతకు ముందు మెహమూద్ ఉత్తమ సహాయ నటుడికి కూడా 6 నామినేషన్లు అందుకున్నాడు.
జీవితం తొలి దశలో
[మార్చు]బొంబాయిలో 1940, 1950లలో చలనచిత్ర రంగానికి చెందిన భారీ స్టార్ అయిన లతీఫున్నీసా, నటుడు ముంతాజ్ అలీలకు మెహమూద్ అలీ 1932 సెప్టెంబరు 29న జన్మించాడు. అతను ఎనిమిది మంది సంతానంలో రెండవవాడు. ఆయన సోదరి మినూ ముంతాజ్ కూడా బాలీవుడ్ సినిమాల్లో పేరు పొందిన నర్తకి, క్యారెక్టర్ నటి. ఆయన తమ్ముడు అన్వర్ అలీ కూడా నటుడు, అలాగే ఖుద్-దార్, కాష్ వంటి చిత్రాలకు నిర్మాత.[3][4]
మరణం
[మార్చు]2004 జులై 23న అమెరికాలోని పెన్సిల్వేనియాలో మెహమూద్ మరణించాడు. గుండె సంబంధిత జబ్బుల చికిత్స కోసం అక్కడికి వెళ్ళాడు. ముంబైలోని బాంద్రాలోని మెహబూబ్ స్టూడియోలో ఆయన అభిమానులు ఆయనకు నివాళులర్పించారు.[2][3][4]
అవార్డులు
[మార్చు]- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సహాయ నటుడు అవార్డు - విజేత - 1963 దిల్ తేరా దివానా
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ హాస్యనటుడు అవార్డు - విజేత
1967 - ప్యార్ కియే జా
1970 వారిస్ – రామ్ కుమార్ /తల్లి (ద్విపాత్ర)
1972 పరాస్ - మున్నా సర్కార్
1975 - వర్దాన్
- ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ హాస్యనటుడు అవార్డు - నామినేట్
1967 లవ్ ఇన్ టోక్యో – మహేష్
1968 మెహర్బన్
1969 నీల్ కమల్ - గిర్ధర్ గోపాల్ అగర్వాల్
1969 సాధు ఔర్ షైతాన్ – బజరంగ్/రామ్
1970 మేరీ భాభి – శంబు
1971 హంజోలి - శివరామ్
1972 మెయిన్ సుందర్ హూన్ – సుందర్
1973 బొంబాయి నుండి గోవా – ఖన్నా, బస్ కండక్టర్
1974 దో ఫూల్ – పవిత్ర కుమార్ రాయ్ 'పుట్టన్'/మణి
1975 దునియా క మేళా
1975 కున్వారా బాప్ – మహేష్/రిక్షా వాలా
1976 ఖైద్ - బజరంగీ
1977 సబ్సే బడా రూపయ్య – నేకి రామ్
1980 నౌకర్ – దయాళ్
1983 ఖుద్-దార్ - జగ్గన్
మూలాలు
[మార్చు]- ↑ Zaveri, Hanif (2005). Mehmood, a Man of Many Moods (in ఇంగ్లీష్). Popular Prakashan. p. 50. ISBN 978-81-7991-213-3. Archived from the original on 24 December 2016. Retrieved 22 June 2021.
- ↑ 2.0 2.1 2.2 Indian comedy actor Mehmood dies on BBC news website Archived 24 డిసెంబరు 2020 at the Wayback Machine Published 23 July 2004, Retrieved 5 November 2019
- ↑ 3.0 3.1 3.2 Karan Bali (23 July 2016). "Profile of Mehmood". Upperstall.com website. Archived from the original on 24 December 2020. Retrieved 7 November 2019.
- ↑ 4.0 4.1 4.2 Indian film comedian Mehmood dies at 72 Archived 7 నవంబరు 2019 at the Wayback Machine Dawn (newspaper), Published 24 July 2004, Retrieved 7 November 2019
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- 1932 జననాలు
- 2004 మరణాలు
- భారతీయ సినిమా నటులు
- హిందీ సినిమా నటులు
- ఫిల్మ్‌ఫేర్ అవార్డుల విజేతలు
- భారత హాస్యనటులు
- 20వ శతాబ్దపు భారతీయ నటులు
- 20వ శతాబ్దపు భారతీయ గాయకులు
- భారత స్వరకర్తలు
- 20వ శతాబ్దపు భారతీయ స్వరకర్తలు
- 20వ శతాబ్దపు భారతీయ చలనచిత్ర దర్శకులు
- బెంగుళూరు చలనచిత్ర దర్శకులు
- హిందీ సినిమా నిర్మాతలు
- బెంగుళూరు చలనచిత్ర నిర్మాతలు
- 20వ శతాబ్దపు హాస్యనటులు