మేకల వెంకటేష్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మేకల వెంకటేష్ రంగారెడ్డి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

అతను కుత్బుల్లాపూర్ మండలం నిజాంపేట్ గ్రామానికి చెందినవాడు. అతను 1967లో జన్మించాడు. 1994లో నిజాంపేట్ ఎంఫీటీసిగా విజయం సాధించాడు. 2006లో కుత్బుల్లాపూర్ మండలాధ్యక్షులుగా కూడా ఎన్నికయ్యాడు. 2013 మార్చిలో జరిగిన ఎంపీటీసి ఎన్నికలలో కూడా పోటీచేశాడు. 2014 ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసాడు. 2009 శాసనసభ ఎన్నికలలో చేవెళ్ళ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున విజయం సాధించిన కె.ఎస్.రత్నం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడంతో, స్థిరాస్తి వ్యాపారంలో ఆర్థికంగా నిలదొక్కుకొని పార్టీ తరఫున కృషిచేస్తున్న వెంకటేష్ టి.డి.పి అభ్యర్థిగా ఎంపైకైనాడు.[1] ఈ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి జె.యాదయ్య 781 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. మేకల వెంకటేష్ కు 15117 ఓట్లు మాత్రమే వచ్చాయి.[2]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా టాబ్లాయిడ్, తేది 10-04-2014
  2. Codingest. "చేవెళ్ళ - చేవెళ్ళ - Tollywood Latest News | Movie Reviews and Cinema Gossips| Live Telugu Channels". NTV Telugu (in ఇంగ్లీష్). Retrieved 2020-07-04.