మేఘాలి మీనాక్షి
మేఘాలి | |
---|---|
జననం | కోల్‌కతా, భారతదేశం |
వృత్తి | నటి, మోడల్ |
క్రియాశీల సంవత్సరాలు | 2015–ప్రస్తుతం |
మేఘాలి మీనాక్షి తమిళ సినిమారంగానికి చెందిన భారతీయ నటి. ఆమె పా.విజయ్ నటించిన ఆరుత్ర చిత్రం ద్వారా చిత్రసీమలో అడుగుపెట్టింది. దీనికి గీత రచయిత-కమ్-నటుడే కాక ఆయన దర్శకత్వం వహించాడు.[1]
కెరీర్
[మార్చు]2017 ఏప్రిల్లో, ఆమె విక్రమ్, తమన్నా నటించిన స్కెచ్‌లో అతిథి పాత్ర పోషించింది. అయితే, పా.విజయ్‌తో నటించిన ఆరుత్ర చిత్రం ముందుగా విడుదలైంది.[2][3][4]
కోలీవుడ్‌లో పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె రగడమ్ చిత్రంలో ద్విపాత్రాభినయం చేసింది. కస్తూరి రాజా దర్శకత్వం వహించిన పాండి మునిలో ఆమె జాకీ ష్రాఫ్‌తో పాటు ప్రధాన పాత్రలో నటించింది.[5]
ఆమె మిలన్ భౌమిక్ దర్శకత్వం వహించిన నిర్భోయ అనే బెంగాలీ చిత్రంలో ప్రధాన పాత్రను పోషించింది. దీనిని సంబిత్ మీడియా అండ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సంజీబ్ సమద్దర్ నిర్మించాడు. 2012లో జరిగిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.[6][7]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2016 | జితన్ 2 | అంజలి | |
2018 | స్కెచ్ | గాయత్రి | |
2018 | ఆరుత్ర | పార్వతి | |
2018 | నిర్భోయ | నిర్భయ | బెంగాలీ సినిమా |
2023 | అప్పత | అవంతిక |
మూలాలు
[మార్చు]- ↑ "Meghali is Pa Vijay's heroine". The Times of India. Retrieved 3 March 2017.
- ↑ "Bhagyaraj sir gave me plenty of advice: Meghali". The Times of India. Retrieved 7 June 2017.
- ↑ "Meghali to star in Vikram's 'Sketch'". The Times of India. Retrieved 21 April 2017.
- ↑ Meghali to play a dual role in her next "Meghali to play a dual role in her next film". The Times of India. Retrieved 9 October 2017.
- ↑ "Jackie Shroff plays an aghori in Kasthuri Raja's comeback film". The Times of India. Retrieved 7 May 2018.
- ↑ "Film on Delhi gang rape to help change mindset". Dainik Jagran. Retrieved 26 March 2013.
- ↑ ""Nirbhoya" Bangla Movie Goes on Floors". Washington Bangla Radio on Internet. Archived from the original on 20 February 2013. Retrieved 17 February 2013.