మేడిశెట్టి సత్యవతి
మేడిశెట్టి సత్యవతి ప్రముఖ రంగస్థల నటీమణి.
జననం
[మార్చు]సత్యవతి, సుబ్బాయమ్మ నారాయణస్వామి దంపతులకు 1936లో ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా, తణుకు లో జన్మించారు.
రంగస్థల ప్రస్థానం
[మార్చు]సత్యవతి, తన 18వ యేట నాటకరంగంలోకి ప్రవేశించి, రంగస్థల నటనను వృత్తిగా స్వీకరించారు. దాదాపుగా 5ం సంవత్సరాలు నాటకరంగంలో ఉండి, అనేక వేల ప్రదర్శనలు ఇచ్చారు. పి.వి. భద్రం 'కూలినకొంప', పెనుగొండ ఫ్రెండ్స్ యూనియన్ 'దరిద్రాయం, మల్లాది సూర్యనారాయణ 'పెదపడుచు' వంటి నాటకాలు తొలినాళ్ళలో సత్యవతికి పేరు సంపాదించిపెట్టాయి. అంతేకాకుండా ఈమె ఎందరినో ప్రోత్సహించి, నటనలో శిక్షణ ఇప్పించారు.
ప్రముఖ సినీనటులు మల్లాది సత్యనారాయణ, రామకృష్ణ, చలం గార్లతో కూడా నటించారు. 'పల్లెపడుచు', 'అన్నాచెల్లెలు', 'కులంలేనిపిల్ల', 'పేదపిల్ల' వంటి నాటకాలలోని పాత్రలు సత్యవతికి మంచి గుర్తింపునిచ్చాయి. మాదాసు నరసింహారావు నిర్వహణలో 'తులసీజలంధర' లో పార్వతి, 'శ్రీకృష్ణ జరాసంధ' లో రాణి, 'కళ్యాణకృష్ణ' లో దాది వంటి పౌరాణిక పాత్రలను కూడా పోషించారు.
ఈమెతోపాటు ఈవిడ కుటుంబంలోని వారంతా నటులుగా మంచి పేరు సంపాదించారు. సత్యవతి కుమార్తె మేడిశెట్టి రాజ్యం రంగస్థల నటిగా మాత్రమే కాకుండా, దర్శకురాలిగాకూడా పేరుపొందారు. రాజ్యం సంస్థలో మల్లాది సూర్యనారాయణ 'లక్ష్మమ్మకథ' చారిత్రాత్మక నాటకంలో ఈవిడ, అత్తగారి పాత్రను పోషించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తో జీవిస్తున్నారు.
మూలాలు
[మార్చు]మేడిశెట్టి సత్యవతి, తణుకు తళుకులు (జీవన చిత్రాలు), భదరీనాథ్, 2010, పుట. 85.