మేడూరి నాగేశ్వరరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మేడూరి నాగేశ్వరరావు
మేడూరి నాగేశ్వరరావు


MP
నియోజకవర్గం మచిలీపట్నం, తెనాలి

వ్యక్తిగత వివరాలు

జననం 31 మార్చి 1910
ఏటుకూరు, గుంటూరు జిల్లా
మరణం 1998 జనవరి 13(1998-01-13) (వయసు 87)
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
జీవిత భాగస్వామి ముసలమ్మ
సంతానం 4; 2 కుమారులు, 2 కుమార్తెలు
మతం హిందూమతం

మేడూరి నాగేశ్వరరావు ( 1910 మార్చి 31 – 1998 జనవరి 13) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు.

జీవిత చిత్రం

[మార్చు]

నాగేశ్వరరావు, 1910, మార్చి 31న, గుంటూరు జిల్లా, ఏటుకూరులో జన్మించాడు. ఈయన తండ్రి వెంకట్రాయుడు. ఈయన విద్యాభ్యాసం ఏ.ఈ.ఎల్.ఎం ఉన్నత పాఠశాలలో జరిగింది. 1930లో ముసలమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుర్లు. 1930లో చదువుకు స్వస్తి చెప్పి ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని వెల్లూరు, అలీపూరు జైల్లో శిక్షను అనుభవించాడు.

1936 నుండి 1971 వరకు ప్రదేశ్ కాంగ్రేసు కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. 1937 నుండి 1947 వరకు పదేళ్ళ పాటు గుంటూరు జిల్లా కాంగ్రేసు కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. 1959 నుండి 1970 వరకు మూడు పర్యాయాలు గుంటూరు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నాడు. 1951-52 లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసర్చ్ లో సభ్యుడిగా ఉన్నాడు. 1946లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. 1954లో దుగ్గిరాల మధ్యంతర ఎన్నికలలో ఆంధ్ర రాష్ట్ర శాసనసభకు, 1956లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు.

నాగేశ్వరరావు 1971లో మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రేసు తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యాడు. ఆ తర్వాత 1977లో 6వ లోక్‌సభకు, 1980లో ఏడవ లోక్‌సభకు తెనాలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యాడు.[1]

1994లో కోట్ల విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో నాగేశ్వరరావు సన్మానం చేసి, సహస్ర పూర్ణ చంద్రోదయాన్ని జరిపారు.[2] ఈయన 1998 జనవరి 13 న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Members of Parliament". Mangalagiri. Retrieved 2016-12-01.
  2. Nageswara Rao Meduri, Luminaries of 20th Century, Part I, Potti Sriramulu Telugu University, Hyderabad, 2005, pp: 303.

బయటి లింకులు

[మార్చు]