మేడేపల్లి వేంకటరమణాచార్యులు
స్వరూపం
మేడేపల్లి వేంకటరమణాచార్యులు | |
|---|---|
| జననం | 1862 |
| మరణం | 1943 (aged 80–81) |
| వృత్తి | కవి |
| తల్లిదండ్రులు |
|
మేడేపల్లి వేంకటరమణాచార్యులు (1862 - 1943) ప్రముఖ సంస్కృతాంధ్ర కవులు.
వీరు గోలకొండ వ్యాపారి, వైష్ణవుడు, భారద్వాజస గోత్రుడు, ఆపస్తంబసూత్రుడు. వీరి తండ్రి: రఘునాథాచార్యులు. తల్లి: లచ్చమాంబ. జననము: 10-7-1862 సం. నిర్యాణము: 1943 సం. వీరి పూర్వుల నివాసము అనకాపల్లి (విశాఖపట్టనము జిల్లా). వీరి నివాసము: విజయనగరము.
రచించిన గ్రంథాలు
[మార్చు]తెలుగు రచనలు
[మార్చు]- పార్థసారధి శతకము,
- దేవవ్రత చరిత్రము (ప్రబంధము),
- సేతుబంధ మహాకావ్యము (ప్రవరసేనరచిత ప్రాకృతకావ్యమున కాంధ్రపరివర్తనము),
- అలంకారశాస్త్ర చరిత్రము,
- ఆంధ్ర హర్ష చరిత్రము (వచనము) (1929) [1]
- లౌకికన్యాయ వివరణము.
- నిఘంటు చరిత్రము
సంస్కృత రచనలు
[మార్చు]- షేక్స్పియరు నాటకకథలకు సంస్కృతానువాదము,
- వకుళాభరణుల ద్రావిడగాథా సహస్రమునకు సంస్కృతశ్లోకములు- ఇత్యాదులు.
బయటి లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- మేడేపల్లి వేంకటరమణాచార్యులు, ఆంధ్ర రచయితలు, మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, 1950, పేజీలు: 192-4.
వర్గాలు:
- Pages where birth or death is being automatically determined
- Pages using infobox person with unknown parameters
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- 1862 జననాలు
- 1943 మరణాలు
- తెలుగు కవులు
- సంస్కృత కవులు
- విజయనగరం జిల్లా కవులు
- విజయనగరం జిల్లా సంస్కృత పండితులు