మేవారు కుంభా
Rana Kumbha | |
---|---|
![]() | |
Rana Kumbha | |
పరిపాలనా కాలం | 1433–68 |
ముందువారు | Mokal Singh |
తర్వాతివారు | Udai Singh I |
సంతతి | |
Udai Singh I Rana Raimal | |
తండ్రి | Mokal Singh |
తల్లి | Sobhagya Devi |
మరణం | 1468 |
" కుంభకర్ణ "(క్రీ.శ.1433-1468) రాణా కుంభ అని ప్రసిద్ది చెందాడు. ఆయన పశ్చిమ భారతదేశంలోని మేవారు రాజ్యాన్ని పాలించాడు. ఆయన రాజ్పుతుల శిశోడియా వంశానికి చెందినవాడు.[1] కుంభ మేవారుకు చెందిన రాణా మోకలు సింగు కుమారుడు. ఆయన భార్య శోభాగ్య దేవి. మార్వారు రాజ్యంలో రుంకోటు పరమారా ఫైఫు హోల్డరు జైత్మలు సంఖ్లా కుమార్తె.
ఆరంభ కాలం[మార్చు]
13 వ శతాబ్దం ప్రారంభంలో అలావుద్దీను ఖల్జీ సైన్యాలు ఆక్రమించిన తరువాత, మేవారు చాలా అశక్తికరంగా ఉంది. 1335 లో తుర్కికు యోకేని తరిమివేసి, చిత్తోరులో రెండవ గుహిలా రాజవంశాన్ని స్థాపించిన ఘనత రానా హమ్మిరాకు దక్కింది. రాణా తరువాత మహారాణా అనే బిరుదును ఈ రాజవంశం పాలకులు ఉపయోగించారు.
రాణా హమ్మిరా మనవడు, మహారాణా మోకలును 1433 లో ఇద్దరు సోదరులు (చాచా, మేరా) హత్య చేశారు. అయినప్పటికీ వారికి తగిన మద్దతు లేకపోవడం వల్ల చాచా, మేరా పారిపోయారు. రాణా కుంభ మేవారు సింహాసనాన్ని అధిష్టించాడు. ప్రారంభంలో రాణా కుంభాకు మాండోరుకు చెందిన రన్మలు (రణమల్ల) రాథోడు సహకరించారు. 1442 నవంబరులో మాళ్వా సుల్తాను మహమూదు ఖల్జీ మేవారు మీద వరుస దాడులను ప్రారంభించాడు. మచిందర్గడు, పన్గడు, చౌముహాలను స్వాధీనం చేసుకున్న తరువాత సుల్తాను వర్షాకాల మకాం చేశాడు.
1443 ఏప్రెలు 26 న రాణా కుంభ సుల్తాను శిబిరం మీద దాడి చేశాడు. అనిశ్చిత యుద్ధం తరువాత సుల్తాను మండుకు తిరిగి వెళ్ళాడు. 1443 నవంబరులో సుల్తాను మళ్లీ దాడి చేశాడు. గాగ్రౌను, ప్రక్కనే ఉన్న కోటలను స్వాధీనం చేసుకున్నాడు. కాని చిత్తూరును పట్టుకోవడంలో ఆయన విఫలం అయ్యాడు. మండల్గడు, బనాలు యుద్ధంలో సుల్తాను పోరాడి ఓడిపోయాడు. ఈ యుద్ధాల కారణంగా వల్ల రక్తసిక్తమైన సుల్తాను మరో పదేళ్లపాటు మేవారు మీద దాడి చేయలేదు.
నాగపూరు ఆక్రమణ, సుల్తానుల ప్రతిస్పందన[మార్చు]
నాగౌరు పాలకుడు ఫిరుజు (ఫిరోజు) ఖాను 1453-1454 లో మరణించాడు. ఇది ఒక యోధునిగా కుంభ సామర్థ్యాన్ని పరీక్షించిన సంఘటనల పరంపరను ప్రారంభించింది. సింహాసనాన్ని ఆక్రమించిన తన మామ ముజాహిదు ఖానుకు వ్యతిరేకంగా షమ్సు ఖాను (ఫిరుజు ఖాను కుమారుడు) ముందుగా రాణా కుంభ సహాయం కోరాడు. పాలకుడు అయిన తరువాత షంసు ఖాను తన రక్షణను బలహీనపర్చడానికి నిరాకరించి గుజరాతు సుల్తాను కుతుబుద్దీను సహాయం కోరాడు (అహ్మద్ షా 1442 లో మరణించాడు). దీనితో ఆగ్రహించిన కుంభ 1456 లో నాగౌరును, కాసిలి, ఖండేలా, సాకంభరిలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
దీనికి ప్రతిస్పందనగా కుతుబుద్దీను సిరోహిని పట్టుకుని కుంభాల్మెరు మీద దాడి చేశాడు. మహముదు ఖల్జీ, కుతుబుద్దీను మేవారు మీద దాడి చేసి దోపిడీలను విభజించడానికి ఒక ఒప్పందానికి (ఛాంపనేరు ఒప్పందం) వచ్చారు. కుతుబుద్దీను అబూను పట్టుకున్నాడు. కాని కుంభాల్మేరును పట్టుకోలేకపోయాడు. చిత్తోరు వైపు ఆయన పురోగతి నిరోధించబడింది. రాణా కుంభ సైన్యం నాగౌరు చేరుకుంది. తరువాత జరిగిన తీవ్రమైన యుద్ధం తరువాత గుజరాతు సైన్యం మీద చేసిన యుద్ధంలో కుతుబుద్ధీను ఘోరమైన ఓటమిని చవిచూశాడు. విపత్తు వార్తలను సుల్తానుకు తీసుకెళ్ళేసమయంలో అవశేషాలు మాత్రమే అహ్మదాబాదుకు చేరుకున్నాయి.
మహమూదు ఖల్జీ అజ్మీర్‌ను స్వాధీనం చేసుకున్నాడు. డిసెంబర్ 1456 లో మండల్గడును జయించాడు. కుంభ ముందుచూపును సద్వినియోగం చేసుకొని రావు జోధా (రన్మలు రాథోడు కుమారుడు) మాండోరును స్వాధీనం చేసుకున్నాడు. ఈ బహుళ దిశల దాడికి వ్యతిరేకంగా ఆయన తన రాజ్యాన్ని కాపాడుకోగలిగాడు అని రాణా కుంభ నైపుణ్యం శ్లాఘించబడింది. 1458 లో కుతుబుద్దీను రెండవ అహ్మదు షా మరణం, మహమూదు బెగాడ (గుజరాతు కొత్త పాలకుడు), మహమూదు ఖిల్జీల మధ్య శత్రుత్వం రాణా కుంభాను కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అనుమతించింది.
మాల్వాకు చెందిన మహమూదు ఖల్జీ, గుజరాతు సుల్తానేటు కుత్బుద్దీను రెండవ అహ్మదు షా, నాగౌరుకు చెందిన షమ్సు ఖాను, మార్వారుకు చెందిన రావు జోధా వంటి శత్రువులు చుట్టుముట్టిన సమయంలో రాణా కుంభ మేవారును విజయవంతంగా సమర్థించారు. తన భూభాగాన్ని విస్తరించారు.
కోటల నిర్మాణం[మార్చు]
మళ్ళీ రాజ్యాన్ని నిర్మించడానికి కృషి చేసిన ఘనత కుంభకు ఉంది. మేవారు రక్షణగా ఏర్పడే 84 కోటలలో 32 కుంభ చేత నిర్మించబడ్డాయి. .[1] మేవారు ప్రధాన కోట, కుంభ నిర్మించిన కుంభాలు ఘరు కోట. ఇది రాజస్థానులో ఎత్తైన కోట (ఎంఆర్‌ఎల్ 1075 మీ)గా గుర్తించబడుతుంది.
ఇతర నిర్మాణాలు[మార్చు]
చిత్తూరు వద్ద 37 మీటర్ల ఎత్తైన తొమ్మిది అంతస్తులగోపురం నిర్మాణానికి రానా కుంభ కమిషను ఇచ్చారు. విజయ స్తంభ (విజయగోపురం) అని పిలువబడే ఈ గోపురం బహుశా 1458-68 మధ్య పూర్తయింది. అయినప్పటికీ కొన్ని మూలాలు 1448 నాటిదని పేర్కొన్నాయి.[2][3] ఈ గోపురం హిందూ దేవతలు, దేవతల శిల్పాలతో కప్పబడి ఉంది. రామాయణం, మహాభారతం దృశ్యాలను వర్ణిస్తుంది.
కుంభ కాలం నుండి చాలా స్తంభం మీద లిఖించిన శాసనాలు ఉన్నాయి.
- 17 వ వచనం: కుంభ మాల్వా సముద్రం చిందరవందర చేసిన సుమేరు పర్వతం లాంటివాడు. ఆయన దాని రాజు ముహమ్మదును అణగదొక్కాడు.
- 20 వ వచనం: అతను ఇతర అల్పమైన మలేచా పాలకులను (పొరుగువారికి) నాశనం చేశాడు. ఆయన నాగౌరును వేరు చేశాడు.
- 21 వ వచనం: ఆయన ముస్లములు స్వాధీనం చేసుకున్న నుండి పన్నెండు లక్షల ఆవులను రక్షించి, నాగౌరును వారికి సురక్షితమైన పచ్చికగా మార్చాడు. అతను నాగౌరును బ్రాహ్మణుల నియంత్రణలోకి తీసుకువచ్చాడు. ఈ భూమిలో ఆవులు, బ్రాహ్మణులను భద్రపరిచాడు.
- 22 వ వచనం: నాగౌరు మ్లేచ్చులకు కేంద్రంగా ఉంది. కుంభ ఈ చెడు చెట్టును వేరు చేసింది. దాని కొమ్మలు, ఆకులు స్వయంచాలకంగా నాశనమయ్యాయి.
రానా కుంభ పాలనలో రణక్పూరు అలంకారాలతో కూడిన త్రిలోక్య-దీపక జైన దేవాలయం, కుంభస్వామి, చిత్తోరులోని ఆదివర్ష దేవాలయాలు, శాంతినాథ జైన దేవాలయం నిర్మించబడ్డాయి.
మరణం, తరువాత[మార్చు]
రాజ్పుతానాలోని బ్రిటీషు నిర్వాహకుడైన జేమ్సు టాడ్, ఇప్పటికీ రాజపుత్రులచే ప్రశంసించబడ్డాడు. కాని ఆధునిక చరిత్రకారులచే విశ్వసించతగనివాడిగా భావించబడ్డాడు. రానా కుంభ మీరా బాయిని వివాహం చేసుకున్నాడని తప్పుగా నమ్మాడు.[4] ఆయన 1468 లో ఆయన కుమారుడు ఉదయసింహ (మొదటి ఉదయ సింగు) చేత చంపబడ్డాడు. ఆ తరువాత ఆయన హత్యారా (హంతకుడు) గా పిలువబడ్డాడు. 1473 లో ఉదయసింగు స్వయంగా మరణించాడు. కొన్నిసార్లు మెరుపు తాకిడితో మరణించాడని భావించబడింది. కాని హత్య కూడా జరిగి ఉండవచ్చు.[2]
ఉదయసింగు ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన మీద మెరుపు దాడి జరిగిందని భావిస్తున్నారు. తన సోదరుడు రైమలు స్వాధీనం చేసుకున్న మేవారును తిరిగి పొందటానికి మద్దతు ఇచ్చినందుకు ప్రతిగా ఢిల్లీ సుల్తానుతో తన కుమార్తెను వివాహం చేయడానికి వెళ్ళాడని ఆరోపించారు. తన పాలన ఐదు సంవత్స్రాలలో ఆయన మేవారు భూభాగాన్ని చాలావరకు కోల్పోయాడు. అబూ డియోరాను అధిపతిగా స్వతంత్రుడిని చేసి, మార్వారు రాథోడు రాజు జోధాకు అజ్మీరు, శాకంభరిని స్నేహానికి చిహ్నంగా ఇచ్చాడు (వారు దాయాదులు). ఉదయ సింగును తరువాత (ఆయన కుమారుడు కాలేదు) మరొక సోదరుడు అధికారం స్వీకరించాడు. మేవారు రైమలు. రైమలు ఢిల్లీ సుల్తాను సహాయం కోరాడు. ఘాసా వద్ద జరిగిన యుద్ధంలో సహస్మాలు, సూరజ్మలు, తిరుగుబాటు సోదరులు రైమలు రెండవ కుమారుడు పృథ్వీరాజు చేతిలో ఓడిపోయారు.[citation needed]
అయితే రైమలు బతికే ఉన్నందున పృథ్వీరాజు వెంటనే సింహాసనాన్ని అధిరోహించలేకపోయాడు. ఏది ఏమయినప్పటికీ ఆయన తమ్ముడు జైమలు అంతకుముందు చంపబడినందున యువరాజుగా ఎన్నుకున్నారు. ఆయన అన్నయ్య సంగ్రామ సింగు ముగ్గురు సోదరుల మధ్య పోరాటం నుండి పరారీలో ఉన్నారు.[citation needed]
పృథ్వీరాజుకు చివరికి ఆయన బావ విషం తాగించి చంపాడు. ఆయన సోదరిని హింసించినందుకు పృథ్వీరాజు ఆయనను కొట్టాడు. కొన్ని రోజుల తరువాత రైమలు దుఃఖంతో మరణించాడు. తద్వారా సంగ్రామసింగు సింహాసనాన్ని ఆక్రమించడానికి మార్గం సుగమం చేసింది. ఇంతలో స్వయం ప్రవాసం నుండి తిరిగి వచ్చిన సంగ్రామసింగు మేవారు సింహాసనాన్ని అధిరోహించి రానా సంగగా ప్రసిద్ది చెందారు.[citation needed]
ఇవికూడా చూడండి[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 Sen, Sailendra (2013). A Textbook of Medieval Indian History. Primus Books. pp. 116–117. ISBN 978-9-38060-734-4.
- ↑ 2.0 2.1 Ring, Trudy; Watson, Noelle; Schellinger, Paul, eds. (2012). Asia and Oceania: International Dictionary of Historic Places. Routledge. p. 193. ISBN 978-1-13663-979-1.
- ↑ "Chittaurgarh Fort, Dist. Chittaurgarh". Archaeological Survey of India. Archived from the original on 2007-10-21.
- ↑ Nilsson, Usha (1997). Mira Bai. Sahitya Akademi. ISBN 978-81-260-0411-9.
అదనపు అధ్యయనం[మార్చు]
![]() |
Wikimedia Commons has media related to మేవారు కుంభా. |
- Lectures on Rajput history and culture by Dr. Dasharatha Sharma. Publisher: Motilal Banarsidass, Jawahar Nagar, Delhi 1970. ISBN 0-8426-0262-3.
మేవారు కుంభా :en:Sisodia Cadet branch of the 1468
| ||
అంతకు ముందువారు రాణా మొకలు |
శిశోదయ రాజపుత్ర పాలకులు 1433–1468 |
తరువాత వారు మొదటి ఉదయ సింగు |
- All articles with unsourced statements
- Articles with unsourced statements from October 2015
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- 1468 మరణాలు
- మేవార్ సంస్థానం
- 15th-century Indian people
- జనన సంవత్సరం తప్పిపోయినవి
- రాజపుత్ర రాజులు
- హిందూ పోరాటయోధులు
- Patricides