మైక్రోసాఫ్ట్ విండోస్ 11

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైక్రోసాఫ్ట్ విండోస్‌ 11 లోగో

మైక్రోసాఫ్ట్ విండోస్ 11 (ఆంగ్లం: Microsoft Windows 11) ఒక కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టం. విండోస్ 10 తదుపరి కూర్పుగా విండోస్ 11ను మైక్రోసాఫ్ట్ సంస్థ 2021 జూన్ 24 న ఆవిష్కరించింది. లైవ్ టైల్స్ లేకుండానే విండోస్ 11 వర్షన్‌ ఉండడం, టాస్క్‌బార్‌లో ఐకాన్స్‌ స్థానాన్ని చివరి నుంచి మధ్యలోకి తీసుకురావడం వంటి మార్పులతో, విండోస్ 10తో పోల్చితే విండోస్ 11 కొత్తగా కనిపించింది. మరింత సరళంగా, సౌకర్యవంతంగా ఉండే ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టంలో ఆండ్రాయిడ్‌ యాప్స్‌ అందుబాటులోకి వచ్చాయని మైక్రోసాఫ్ట్ కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల వెళ్లడించాడు. భారతదేశంలో విండోస్ 10 వాడే వినియోగదారులకు ఈ కొత్త నిర్వహణ వ్యవస్థ సాఫ్టువేరును పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు.[1]

మైక్రోసాఫ్ట్ సూచించిన దాని ప్రకారం విండోస్‌ 11 ను స్థాపించడం గానీ, అప్‌డేట్‌ గానీ చేసుకోవాలంటే కంప్యూటరు 64 బిట్‌ అయి ఉండాలి. 1 జీహెచ్‌జెడ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుండాలి. కనీసం 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఫ్రీ ‌స్టోరేజీ ఉండాలి.[2]

మూలాలు

[మార్చు]
  1. "Windows 11: కొత్త 'విండోస్‌' కుమ్మేసిందిగా". EENADU. Retrieved 2022-02-14.
  2. "Windows 11: విండోస్‌ 11 యూజర్లకు మైక్రోసాఫ్ట్ వార్నింగ్." EENADU. Retrieved 2022-02-14.