మైక్ ప్రోక్టర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మైక్ ప్రోక్టర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
మైఖేల్ జాన్ ప్రోక్టర్
పుట్టిన తేదీ (1946-09-15) 1946 సెప్టెంబరు 15 (వయసు 77)
డర్బన్, నాటల్ ప్రావిన్స్, యూనియన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా
మారుపేరుప్రాక్, ప్రాక్సీ
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రఆల్ రౌండర్
బంధువులు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 228)1967 20 January - Australia తో
చివరి టెస్టు1970 5 March - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1965–1981Gloucestershire
1965/66–1988/89Natal
1969/70Western Province
1970/71–1975/76Rhodesia
1987/88Orange Free State
కెరీర్ గణాంకాలు
పోటీ Test FC LA
మ్యాచ్‌లు 7 401 271
చేసిన పరుగులు 226 21,936 6,624
బ్యాటింగు సగటు 25.11 36.01 27.94
100s/50s 0/0 48/109 5/36
అత్యధిక స్కోరు 48 254 154*
వేసిన బంతులు 1,514 65,404 12,335
వికెట్లు 41 1,417 344
బౌలింగు సగటు 15.02 19.53 18.76
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 70 7
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 15 0
అత్యుత్తమ బౌలింగు 6/73 9/71 6/13
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 325/– 91/–
మూలం: CricketArchive, 2008 27 October

మైఖేల్ జాన్ ప్రోక్టర్ (జననం 1946, సెప్టెంబరు 15 - 17 ఫిబ్రవరి 2024) దక్షిణాఫ్రికా మాజీ క్రికెట్ ఆటగాడు.[1] ఫాస్ట్ బౌలర్ గా, హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్‌మన్ గా రాణించాడు. 1970లు, 1980లలో ప్రపంచ క్రికెట్ నుండి దక్షిణాఫ్రికా బహిష్కరణకు గురైనందున అంతర్జాతీయ వేదికను తిరస్కరించబడ్డాడు. 1970లో విస్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, 1967లో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు.

క్రికెట్ నుండి రిటైర్ అయిన తరువాత, క్రికెట్ మ్యాచ్‌లకు అఫీషియల్‌గా ఐసీసీ ద్వారా ప్రోక్టర్‌ను మ్యాచ్ రిఫరీగా నియమించారు.

క్రికెట్ రంగం[మార్చు]

దక్షిణాఫ్రికాపై నిషేధంతో 1967 - 1970 మధ్యకాలంలో ఆస్ట్రేలియాకు వ్యతిరేకంగా కేవలం ఏడు టెస్ట్ మ్యాచ్‌లలోనే ఆడాడు.[2] 15.02 సగటుతో 41 టెస్ట్ వికెట్లు తీశాడు. బారీ రిచర్డ్స్, గ్రేమ్ పొలాక్‌లతో పాటు, ప్రోక్టర్ ఆస్ట్రేలియాపై 3-1, 4-0 తేడాతో వరుసగా రెండు సిరీస్‌ల పరాజయాలకు కారణమయ్యాడు.

ప్రోక్టర్ 1970లో రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ వర్సెస్ ఇంగ్లాండ్ తరపున ఆడాడు. ఐదు టెస్ట్ ఫార్మాట్ మ్యాచ్‌లలో 23.9 సగటుతో 15 వికెట్లు తీశాడు.

1982లో దక్షిణాఫ్రికాలో పర్యటించిన గ్రాహం గూచ్ నేతృత్వంలోని ఇంగ్లీష్ రెబల్ XIకి వ్యతిరేకంగా మూడు "టెస్టులు", మూడు "వన్ డే ఇంటర్నేషనల్స్" ఆడిన స్ప్రింగ్‌బాక్ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.

1978/79లో, ఆట జీవితం ముగిసే సమయానికి, ఆస్ట్రేలియాలో కెర్రీ ప్యాకర్ వరల్డ్ సిరీస్ క్రికెట్‌లో వరల్డ్ XI కోసం ఆడాడు. ఆడిన మూడు "సూపర్ టెస్ట్"లలో బ్యాట్, బాల్‌తో ప్రదర్శన ఇచ్చాడు - అతని బ్యాటింగ్ సగటు 34.2, అతని బౌలింగ్ సగటు 18.6 గా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "Mike Procter Profile - Cricket Player South Africa | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-18.
  2. "SA vs AUS, Australia tour of South Africa 1966/67, 3rd Test at Durban, January 20 - 25, 1967 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-12-18.

బాహ్య లింకులు[మార్చు]