మైలవరం పురాతన వస్తు ప్రదర్శనశాల

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సముద్ర గుప్తుని కాలం నాటి నాణెం

మైలవరం పురాతన వస్తు ప్రదర్శనశాల[1] వై ఎస్‌ ఆర్‌ జిల్లా మైలవరంలో స్థాపించబడిన పురావస్తు ప్రదర్శన శాల. ఇది ప్రాచీన శిల్పసంపదకు, కళా నైపుణ్యానికీ అద్దంపడుతూ పర్యాటకులకు ఆనందాన్ని కలిగిసున్నది. కొన్నింటికీ సరైన ఆదరణ లేక పడి వున్నా పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. మైలవరం జలాశయం అతిథి గృహం ఆవరణలో మొదటగా ఈ మ్యూజియం దర్శనమిస్తుంది.[2]

విశేషాలు[మార్చు]

మైలవరంలో జలాశయం నిర్మాణం పూర్తి అయిన తరువాత, 1976 లో ఇక్కడ పురాతన వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేశారు. అప్పట్లో పురాతన చరిత్ర కలిగిన గండికోట చుట్టుప్రక్కల ప్రాంతాలలో బయటపడిన అతి పురాతన వస్తుసామాగ్రిని ఇక్కడ భద్రపరిచారు. జలాశయంలో మునకకు గురైన 13 గ్రామాలకు సంబంధించిన చిన్న శిల్పకళా సామగ్రిని సైతం ఇక్కడే భద్రపరిచారు. 12వ శతాబ్దానికి చెందిన నాణేలు, 16వ శతాబ్దానికి చెందిన ఆయుధ సామాగ్రి, 3వ శతాబ్దంలో వినియోగించిన ఇటుకలు, హుక్కా లాంటి వస్తువులు, ఇక్కడ ఉన్నవి. ప్రస్తుతం ఈ భవనం శిధిలావస్థలో ఉంది. దీనిని అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. [3] అలాగే మ్యూజియం పరిసర ప్రాంతంలో పలు రకాల ఆకృతులలో కూడిన శిల్ప సముదాయాన్ని అప్పటి నీటి పారుదల శాఖ అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి తోడు మ్యూజియంకు గండికోట భవనాలకు మధ్య వున్న ఏకశిల చూపరులను ఆకట్టుకుంటోంది.

మూలాలు[మార్చు]

  1. location of the place
  2. మైలవరం మ్యూజియం[permanent dead link]
  3. (ఈనాడు కడప/మైలవరం, డిసెంబరు19-2013.2వ పేజీ.)

ఇతర లింకులు[మార్చు]