మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా
(2012 తెలుగు సినిమా)
దర్శకత్వం కిరణ్ మీగడ,
అరుణ్ రుద్ర
నిర్మాణం కందుకూరి రాజశేఖర్
కథ అరుణ్ రుద్ర
చిత్రానువాదం కిరణ్ మీగడ,
అరుణ్ రుద్ర
తారాగణం రేవంత్ కోరుకొండ,
రాజితా రెడ్డి,
కె.రాజ్‌కుమార్
సంగీతం మైఖేల్ మక్కల్
నృత్యాలు శివ తుర్లపాటి
సంభాషణలు శివ సోమయాజుల
ఛాయాగ్రహణం మురళి పల్లికొండ
కూర్పు శశాంక్ మాలి
నిర్మాణ సంస్థ ధర్మపద క్రియషన్స్
భాష తెలుగు

మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా 2012, ఫిబ్రవరి 24న విడుదలైన తెలుగు సినిమా. పూర్తిగా నూతన నటీనటులు, నూతన సాంకేతిక నిపుణులతో తీసిన ఈ సినిమాను సద్గురు శివానందమూర్తి తనయుడు కందుకూరి రాజశేఖర్ ధర్మపద క్రియేషన్స్ పతాకంపై నిర్మించాడు. ఈ సినిమా మొత్తం అమెరికాలో షూటింగ్ జరిగింది.

నటీనటులు

[మార్చు]
  • రేవంత్ కోరుకొండ - చరణ్
  • రాజితా రెడ్డి - హారిక
  • రాజశేఖర్ కందుకూరి - హారిక తండ్రి

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే,దర్శకత్వం: కిరణ్ మీగడ, అరుణ్ రుద్ర
  • నిర్మాత: కె.రాజశేఖర్
  • కథ: అరుణ్ రుద్ర
  • మాటలు : శివ సోమయాజుల
  • సంగీతం: మైఖేల్ మక్కల్
  • కూర్పు: శశాంక్ మాలి
  • ఛాయాగ్రహణం: మురళి పల్లికొండ
  • నృత్యాలు: శివ తుర్లపాటి

అమెరికాలోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసుకునే చరణ్ (రేవంత్)కు జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉంది. తన తోటి వారికి సలహాలు సూచనలూ ఇస్తూ, వారికి సందర్భానుసారం తగిన సాయమూ చేస్తుంటాడు. అమెరికాలో ఎమ్మెస్ చేసి, ఓ చక్కని ఉద్యోగం చేయడానికి వచ్చిన హారిక (రాజితా రెడ్డి) తో ప్రేమలో పడతాడు. అయితే తనకు కెరీరే ప్రధానమని, ప్రేమ పెళ్ళి విషయంలో తాను ఏ నిర్ణయం తీసుకోలేనని హారిక స్పష్టం చేస్తుంది. దాంతో చరణ్ ఖిన్నుడౌతాడు. ఎమ్మెస్ పూర్తి చేసిన హారికకు ఊహించని విధంగా చరణ్ పనిచేసే కంపెనీలోనే ఉద్యోగం వస్తుంది. దాంతో హారికకు వివాహం చేయాలని ఇండియాలో ఉండే ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెడతారు. వ్యాపారపరంగా తాము కష్టాలలో ఉన్న స్నేహితుడి కొడుకును చేసుకుంటే బాగుంటుందని హారికతో ఆమె తండ్రి చెబుతాడు. ఇటు చరణ్‌తో తన ప్రేమను వ్యక్తం చేయలేక, అటు తండ్రి మాట కాదనలేక హారిక సతమతమౌతుంది. ప్రేమ విషయంలో మిత్రులకు సాయపడే చరణ్ తన ప్రేమను సక్సెస్ చేసుకున్నాడా? హారిక తన మనసులోని మాటను తండ్రికి చెప్పి చరణ్‌కు దగ్గరైందా? అనేది సినిమా పతాక సన్నివేశం.[1]

స్పందనలు

[మార్చు]
  • తొలి చిత్రంలోనే హీరో, హీరోయిన్‌లు ఇద్దరూ చక్కని నటనను కనబరిచారు. ముఖ్యంగా రేవంత్ నృత్యాలను అద్భుతంగా చేశాడు. ఇందులో హీరోయిన్ తండ్రి పాత్రను నిర్మాత రాజశేఖరే పోషించడం విశేషం. సంగీత దర్శకుడు మైఖేల్ మక్కల్ అందించిన బాణీలు వినసొంపుగా ఉన్నాయి. ఈ సినిమా ద్వారా ఇద్దరు యువ దర్శకులు అరుణ్ రుద్ర, కిరణ్ మీగడ పరిచయం అయ్యారు. వారికిది తొలిచిత్రమే ఎంచుకున్న కథను ఆసక్తికరంగా తెరకెక్కించారు. వాణిజ్యపరంగా ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే అంశాన్ని పక్కన పెడితే, సరళంగా సాగే చక్కని ప్రేమకథా చిత్రాన్ని చూసిన అనుభూతిని ప్రేక్షకులకు అందిస్తుందని చెప్పొచ్చు. విదేశీ నేపథ్యంలో కథ జరుగుతోంది కాబట్టి, అక్కడి వికృతులను తెరమీద చూపించి సొమ్ము చేసుకోవాలనే దురాశను ప్రదర్శించకుండా నిర్మాత కె. రాజశేఖర్ నిజాయితీతో ఈ సినిమా తీయడం అభినందనీయం. - వడ్డి ఓంప్రకాశ్ నారాయణ్ ఫిల్మ్ జర్నలిస్ట్[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 వడ్డి ఓంప్రకాశ్ (5 March 2012). "ఓ ఎన్.ఆర్.ఐ. ప్రేమకథాచిత్రం 'మై హార్ట్ ఈజ్ బీటింగ్!'". జాగృతి వారపత్రిక: 34.

బయటి లింకులు

[మార్చు]